‘నా కాళ్లు మొక్కి డబ్బులు ఇచ్చి, ఏదో ఒకటి తినిపించి.. ఆత్మీయంగా హత్తుకుంటావు కదా. ఒట్టేసి చెబుతున్నా నిన్ను సతాయించడం మానను, నీ డబ్బులు లాక్కుంటూనే ఉంటాను, నీ దగ్గర ఉన్న తినుబండారాలు అన్నీ నేనే తినేస్తా. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమగా ఆలింగనం చేసుకుంటా. ఈరోజు నిన్ను చాలా మిస్సవుతున్నా. నా చిన్ని తమ్ముడికి రక్షా బంధన్ శుభాకాంక్షలు’ అంటూ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ తన సోదరుడు ఇబ్రహీం అలీఖాన్‌కు ఆత్మీయ సందేశం పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమ్ముడు ఇబ్రహీంను ఆత్మీయంగా చూస్తున్న సారా చిన్ననాటి ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోకు ఇప్పటికే 8 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
కాగా సారా అలీఖాన్ బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ పటౌడీ కుటుంబానికి చెందిన వారన్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ దంపతుల తనయ అయిన సారా కేదార్‌నాథ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సింబా హిట్‌తో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రక్షాబంధన్ రోజు తోబుట్టువుకు దూరంగా ఉన్న సారా సోషల్ మీడియాలో తనకు విషెస్ చెప్పారు. ఇక అమృతాతో విడాకులు తీసుకున్న సైఫ్.. కరీనా కపూర్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి కుమారుడైన తైమూర్ అలీఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Comments
Please login to add a commentAdd a comment