అమితాబచ్చన్‌కి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ.. | West Bengal CM Mamata Banerjee Ties Rakhi To Amitabh Bachchan, Poses With His Full Family - Sakshi
Sakshi News home page

అమితాబచ్చన్‌కి రాఖీ కట్టిన సీఎం మమతా బెనర్జీ..

Published Wed, Aug 30 2023 8:14 PM | Last Updated on Wed, Aug 30 2023 8:28 PM

Mamata Banerjee Visits Amitabh Bachchan In Mumbai - Sakshi

ముంబయి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్‌ని కలిశారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు నుంచి ముంబయిలోని జుహులో ఉన్న అమితాబ్ ఇంటికి వెళ్లారు. అనంతరం బిగ్‌బీకి దీదీ రాఖీ కట్టారు. ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనున్న 'ఇండియా' కూటమి భేటీకి హాజరయ్యేందుకు ముంబయికి చేరుకున్నారు. 

అమితాబ్‌ను కలిసి అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఆయన్ని విందుకు ఆహ్వానించినట్లు చెప్పారు. అమితాబ్‌ కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపిన దీదీ.. బెంగాల్‌లో జరగనున్న దుర్గా పూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఆహ్వానించినట్లు తెలిపారు.

గతేడాది కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి అమితాబ్ హాజరైన వేళ.. సినీ రంగంలో అందించిన సేవలకు ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: రక్షాబంధన్ సాక్షిగా.. తమ్ముడి కోసం అక్క కిడ్నీ దానం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement