
అమెరికాకు ఉచితంగా రాఖీ పంపే అవకాశం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిఫ్ట్ పోర్టల్స్‌ను నిర్వహిస్తున్న యూఎస్2గుంటూర్.కామ్ రాఖీలను ఉచితంగా అమెరికాకు పంపే అవకాశాన్ని కల్పిస్తోంది. యూఎస్‌ఏలో స్థానిక రవాణా ఖర్చుల కింద 2 డాలర్లను చార్జీ చేస్తోంది. అయితే కస్టమర్లకు 2 డాలర్ల క్రెడి ట్ నోట్ ఇస్తామని, ఈ మొత్తాన్ని భవిష్యత్తు ఆర్డర్లలో వాడొచ్చని కంపెనీ తెలిపింది. రాఖీలు 3 డాలర్ల నుంచి లభిస్తాయి. హైదరాబాద్ స్పెషల్ ముత్యాల రాఖీలు, వెండి రాఖీలు వీటిలో ఉన్నాయి. ప్రతి ఆర్డరుపై ప్రత్యేక బహుమతి ఉంది. కస్టమర్లు డైమంట్ సెట్ గెలుపొందే అవకాశమూ ఉందని కంపెనీ తెలిపింది. కంపెనీకి 4 లక్షలకుపైగా ప్రవాస భారతీయులు కస్టమర్లుగా ఉన్నారు.