United States Citizenship and Immigration Services
-
హెచ్-1బీ : దడ పుట్టిస్తున్న కొత్త రూల్
ముంబై : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలైన కష్టాలు... హెచ్-1బీ వీసాదారులను ఇంకా వీడటం లేదు. కొత్త కొత్త నిబంధనలతో హెచ్-1బీ వీసాదారులకు ట్రంప్ షాకిస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికా మరో కొత్త రూల్ తీసుకొచ్చి హెచ్-1బీ వీసాదారులకు దడ పుట్టిస్తుంది. వీసా గడువు పొడగింపు లేదా స్టేటస్ మార్చుకోవడం తిరస్కరణకు గురైతే, హెచ్-1బీ వీసాదారులు దేశ బహిష్కరణ విచారణలను ఎదుర్కొనే ఈ కొత్త రూల్ వీసా దారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. అమెరికా అథారిటీలు ఇచ్చే గడువు ముగిసినా కూడా ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడైంది. జూన్ 28న అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన పాలసీ మెమొరాండమే హెచ్-1బీ వీసాదారుల్లో ఈ గుబులు రేపింది. ఈ మెమొరాండం ప్రకారం యునిటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్(యూఎస్సీఐఎస్) ‘నోటీస్ టూ అప్పియర్(ఎన్టీఏ)’ ను జారీ చేయడానికి వీలవుతుంది. దీంతో అమెరికాలో ఉంటున్న హెచ్-1బీ వీసాదారులను తేలికగా దేశ బహిష్కరణ చేయడానికి వీలవుతుంది. ఇదే ఇప్పుడు ఎన్నారైల్లో సంచలనం కల్గిస్తోంది. వీసా పొడిగింపు దరఖాస్తు లేదా పిటిషన్ తిరస్కరణకు గురైనప్పుడు లేదా చట్టవిరుద్ధంగా ఆ దరఖాస్తుదారుడు అమెరికాలో ఉన్నప్పుడు ఈ నోటీసులు అందుకుంటాడు. ఈ నోటీసులే దేశ బహిష్కరణకు తొలి అడుగులు. అన్ని కేసుల్లో ఎన్టీఏలను జారీ చేయొచ్చు. వీసా పొడిగింపు తిరస్కరణకు గురైనప్పుడు లేదా వీసా రాకున్నా 240 రోజులు గడువు దాటాక కూడా అమెరికాలో ఉంటే ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి వచ్చే ఈ నోటీసు ప్రకారం కోర్టులో హాజరై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీసా ప్రక్రియ పూర్తవడానికి సాధారణంగా 180 రోజులు పడుతుంది. ఒకవేళ ఆలస్యంగా దరఖాస్తు చేస్తే.. అది తేలే లోగే వీసా గడువు 240 రోజుల పూర్తవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువు పూర్తయ్యేలోగానే తిరిగి స్వదేశానికి వచ్చేయాలి. ఒకవేళ గడువు పూర్తయినా దరఖాస్తు వ్యవహారం తేలే వరకు అమెరికాలో ఉంటే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీసా పొడిగింపు దరఖాస్తును అంగీకరిస్తే సరే. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది. వీసా రాకుంటే 240 రోజుల గడువు దాటాక దరఖాస్తు విషయం తేలేవరకు మీరు అమెరికాలో ఉండాల్సి వస్తే, అది అక్రమంగా అమెరికాలో ఉన్న కిందకే వస్తుంది. దీంతో మీరు కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. నోటీస్ వచ్చిందంటే హెచ్-1బీ వీసాదారులు సమస్యల ఊబిలో చిక్కుకున్నట్టే. ఒకవేళ నోటీసుకు సమాధానం ఇవ్వకండా భారత్‌కు వచ్చేస్తే మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టకుండా అయిదేళ్ళు నిషేధం విధిస్తారు. నోటీసు వచ్చేలోగానే తమకు తాము దేశం విడిచి పెట్టి వెళ్ళేందుకు కోర్టు అనుమతి కోరవచ్చు. వీసా తిరస్కరించిన తరవాత అక్కడే ఉంటే.. ఆ వ్యవధి ఏడాది దాటితే.. వారిపై పదేళ్ళ వరకు మళ్ళీ అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశముందని తెలిసింది. ఈ నిబంధనలు చూసిన హెచ్ 1 బీ వీసాదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత కొత్త నిబంధనలు విద్యార్థులకు కూడా వర్తిస్తాయని తెలియడంతో, అమెరికాలో ఉంటున్న విద్యార్థుల్లో కంగారు మొదలైంది. హెచ్1బీ వీసాలు 240 రోజులకు ఇస్తుంటారు. వీసా ముగుస్తున్న సమయంలో ఉద్యోగి తరఫున కంపెనీ దరఖాస్తు చేసేది. గడువును అమెరికా అధికారులు తిరస్కరిస్తే వెంటనే సదరు ఉద్యోగి తిరిగి స్వదేశానికి వచ్చేస్తారు. కంపెనీ మళ్ళీ దరఖాస్తు చేసి వీసా వస్తే తిరిగి అమెరికా వెళ్ళేవారు. కాని ఇప్పుడు ఈ నిబంధనలను మరింత కఠనం చేస్తున్నారు. -
జీరో టాలరెన్స్... అమెరికా వివరణ
వాషింగ్టన్ : అమెరికా సరిహద్దుల నుంచి వలసదారుల్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం ప్రకారం అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి వేర్వేరు కేంద్రాల్లో ఉంచుతారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్‌ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తున్నారంటూ అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. తాజాగా జీరో టాలరెన్స్ విధానాన్ని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో పాటు లారా బుష్ కూడా తప్పుపట్టారు. అయితే విధానంపై సమాధానం ఇవ్వాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం(డీహెచ్ఎస్) జీరో టాలరెన్స్ విధానం గురించి పత్రికా ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యానే... సరిహద్దు గుండా అక్రమంగా దేశంలోకి చొరబడే తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసేందుకు ప్రత్యేకంగా ఒక విధానమంటూ ఏదీలేదని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. కాకపోతే మైనర్లను కస్టడీలోకి తీసుకొని వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని తెలిపింది. అయితే.. అక్రమ వలసదారుల్లో కొంత మంది మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు ఉండే అవకాశం ఉన్నందున పిల్లల భద్రత దృష్ట్యానే తాము కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొంది. 2017 అక్టోబర్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య కాలంలో ఈవిధంగా సరిహద్దుల గుండా పిల్లలతో సహా ప్రవేశించే వారి సంఖ్య 315 శాతం పెరిగిందని, వీరిలో చాలా మంది పిల్లల గురించి ప్రశ్నించినపుడు సరైన సమాధానం చెప్పకుండా తడబడటం తమ అనుమానాన్ని మరింతగా పెంచిందని డీహెచ్ఎస్ తెలిపింది. ఇటువంటి కారణాల వల్లే కుటుంబ సభ్యుల నుంచి పిల్లల్ని వేరుచేస్తున్నామని.. అయితే కోర్టు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్న పిల్లల్ని 20 రోజుల్లోగా విడుదల చేస్తున్నామని డీహెచ్ఎస్ తెలిపింది. వారిని తిరస్కరించడం లేదు... ఆశ్రయం కోరి వచ్చేవారిని అమెరికా తిరస్కరించడంలేదని, కేవలం తమ పౌరుల భద్రతా దృష్ట్యానే వలసదారులను అన్ని విధాలా పరీక్షించిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికా సరిహద్దు రక్షణా విభాగం(యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్) నిబంధనలను అనుసరించి ఎంత మంది విదేశీయులకు దేశంలోకి ప్రవేశించే అనుమతి ఇవ్వాలనే నిర్ణయం జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగా అక్రమ వలసదారుల నుంచి పిల్లల్ని వేరుచేసిన తర్వాత వారి బాగోగుల గురించి తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం అందించడంలేదనే వార్తల్ని డీహెచ్ఎస్ ఖండించింది. పిల్లల్ని ఎక్కడ ఉంచామనే విషయం తల్లిదండ్రులకు కచ్చితంగా తెలియజేస్తామని.. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్(హెచ్ఎస్ఎస్) సహాయంతో డిటెన్షన్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ లైన్(డ్రిల్) ద్వారా ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిల్లలతో సంభాషించే వీలు కల్పిస్తున్నామని పేర్కొంది. అవన్నీ అవాస్తవాలే... అమెరికా సరిహద్దు అధికారులకు ఇతర భాషలు తెలియని కారణంగానే సమస్యలు ఎక్కువవుతున్నాయంటూ వచ్చిన వార్తల్ని డీహెచ్ఎస్ ఖండించింది. బార్డర్ పెట్రోల్ ట్రైనీస్ కచ్చితంగా రెండు భాషల్లో(ఇంగ్లీష్, స్పానిష్) ప్రావీణ్యం కలిగి ఉంటారని, వలసదారుల మాటల్ని వారు చక్కగా అర్థం చేసుకోగలరని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మైనర్లను అదుపులోకి తీసుకుంటారని.. అదేవిధంగా అదుపులోకి తీసుకునే సమయంలో, తిరిగి తల్లిదండ్రులకు అప్పగించే సమయంలో డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తారని తెలిపింది. వలసదారులకు శుభ్రమైన తాగు నీటిని అందించడంతో పాటు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నామని డీహెచ్ఎస్ పేర్కొంది. అదేవిధంగా పిల్లల్ని కేజ్‌లు, ఐస్‌బాక్స్‌లో బంధించడం లేదని, వారి సంరక్షణకు సంబంధించి బాధ్యతగా వ్యవహరిస్తున్నామని తెలిపింది. ఫోర్స్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ నిర్బంధంలోకి తీసుకున్న వారిని 20 రోజుల్లోగా తప్పనిసరిగా విడుదల చేస్తున్నామని.. ఒంటరిగా దేశంలోకి చొరబడిన మైనర్లను అదుపులోకి తీసుకున్న 72 గంటల్లోగా హెచ్ఎస్ఎస్కు తరలించి వారి వివరాలు సేకరిస్తామని డీహెచ్ఎస్ వివరించింది. నిర్బంధంలో ఉన్న పిల్లలతో మాట్లాడటానికి హెచ్ఎస్ఎస్ కల్పించే సదుపాయాల వివరాలు... హెచ్ఎస్ఎస్ హాట్‌లైన్ (ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో 24 గంటలు అందుబాటులో ఉంటుంది) 1. ఐసీఈ(యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) నిబంధనల ప్రకారం నిర్బంధ సౌకర్యాలేని వారు ఫోన్ చేయాల్సిన నంబర్ : 1-800-203-7001 2. ఐసీఈ నిబంధనల ప్రకారం నిర్బంధంలో ఉన్నవారు : 699# ఫోన్ చేసే వ్యక్తులు పిల్లల పూర్తి పేరు, పుట్టిన తేదీ, మాతృదేశం తదితర వివరాలు తెలపాల్సి ఉంటుంది. హెచ్ఎస్ఎస్ ఈమెయిల్ : information@ORRNCC.com ఐసీఈ కాల్‌సెంటర్ : (సోమ వారం- శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు) నంబర్లు : 1-888-350-4024, 9116# ఈమెయిల్ - Parental.Interest@ice.dhs.gov -
హెచ్-1బీ వీసాపై భారీగా ఫిర్యాదులు
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాలలో మోసాలు, దుర్వినియోగం జరిగనట్టు భారీగా ఫిర్యాదులు వచ్చాయని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు. హెచ్-1బీ, హెచ్-2బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఉద్దేశించిన తమ ప్రత్యేక ఈ మెయిల్, హెల్స్‌లైన్‌కు 5వేలకు పైగా ఫిర్యాదులు అందాయని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికార ప్రతినిధి ఫిలిప్ స్మిత్ తెలిపారు. గత ఏడాదికి సంబంధించి ఈ అక్రమాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఏ రకమైన ఫిర్యాదులు వచ్చాయి, ఏయే దేశాల నుంచి వచ్చాయి అనే వివరాలను అధికారికంగా ఆయన ప్రకటించలేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం హెచ్-1బీ వీసాల జారీ విధానంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమెరికా ఉద్యోగాలు అమెరికా పౌరులకే చెందాన్ననినాదంతో వీసా నిబంధనల్లో మార్పులకు గతేడాది నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వీసా జారీ ప్రక్రియలో అక్రమాలు, మోసాలను నివారించేందుకు సంబంధిత చర్యలను కూడా చేపట్టారు. ముఖ్యంగా హెచ్-1బీ, హెచ్-2బీ వీసాల జారీలో జరుగుతున్న మోసాలు, దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఈ మెయిల్ హెల్స్‌లైన్ (ReportH1BAbuse@uscis.dhs.gov/ReportH2BAbuse@uscis.dhs.gov) ను ఏర్పాటు చేశారు. అనుమానిత వీసాలతో పాటు, దుర్వినియోగానికి పాల్పడుతున్న డేటాను గుర్తించడానికి ఇది సహకరిస్తుంది. కాగా అమెరికా ప్రభుత్వం ఏడాదికి 65,000ల హెచ్-1బీ వీసాలు జారీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
అమెరికా వెళ్తే అంతే మరి..
హూస్టన్: వలసదారుల్ని వెనక్కి పంపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ ఎత్తుగడలతో ఎన్నో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు వేరవుతున్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిందనే కారణంగా తన ముగ్గురు పిల్లలకు దూరం అయిన ఒక తల్లి దీనగాథ ఇది. బతుకుదెరువు కోసం సుమారు 3 వేల మైళ్లు ప్రయాణం చేసి భర్తను కలుసుకునేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి అమెరికాకు బయలుదేరింది సిల్వానా. అప్పటికే తన భర్త దుండగుల చేతిలో చిక్కి చావు నుంచి తప్పించుకుని అఙ్ఞాతంలో నివసిస్తున్నాడని ఆమెకు తెలియదు. మధ్య అమెరికాలోని ఈఐ సెల్వడార్కు చేరుకుంది. గన్ కల్చర్‌కు చిరునామాగా ఉన్న అమెరికా దేశాల్లో ఎప్పుడు ఎవరు ఎవరిని ఎందుకు చంపుతారో కూడా తెలియదు. సిల్వానా కూడా సరిగ్గా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. టాక్సీ దిగగానే వారిని అడ్డుకున్న ఓ గ్యాంగ్ ఆమె పెద్ద కుమారుడికి తుపాకీ గురిపెట్టింది. కానీ అదృష్టవశాత్తూ అందులోని బుల్లెట్లు అయిపోవడంతో నిన్ను వదిలేస్తున్నామంటూ గ్యాంగ్‌స్టర్ వెళ్లిపోయాడు. కానీ వారిలో భయం మాత్రం పోలేదు. అదే తన పిల్లలతో గడిపే చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. గ్యాంగ్ నుంచి ఎలాగోలా తప్పించుకుని తనవారిని కాపాడుకుంది. మెక్సికో సరిహద్దులో వలసదారులతో కలిసి చేసిన ప్రయాణం ఆమెకు తన పిల్లల్ని దూరం చేసింది.. ఆమెను జైలు పాలు చేసింది. ఇమ్మిగ్రేషన్ అధికారులను చూడగానే వలసదారులు అక్కడ ఉన్న ఎత్తైన గోడను దాటి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, సిల్వానా కూడా తన పిల్లలిద్దరినీ గోడ అవతలి వైపు పంపివేసింది. మూడేళ్ల కుమారున్ని గోడపై నుంచి విసిరివేయగా అవతలవైపు ఉన్నవారు బ్లాంకెట్ సాయంతో అతన్ని పట్టుకున్నారు. ‘ఎప్పుడైతే పిల్లలు దూరమయ్యారో అప్పుడే నా ఆత్మ నన్ను వదిలిపోయిందని’ ఒక ఇంటర్వ్యూలో తన చేదు ఙ్ఞాపకాలను గుర్తుచేసుకుంది సిల్వానా. ఆమెను అక్రమవలసదారుగా గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు అమెరికా చట్టాల ప్రకారం ఆమెను నిర్బంధించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు అధికమయ్యాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరం చేయడం అన్యాయమని, అమెరికా కుటుంబ చట్టాల ప్రకారం ఇది విరుద్దమని డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధులు దేశ భద్రత విభాగానికి లేఖ రాశారు. తాజాగా ఓ ఏడేళ్ల అమ్మాయిని తల్లికి దూరం చేశారని ఇమ్మిగ్రేషన్ అధికారులపై ఆరోపణలు రావడంతో.. పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇటువంటి విధానాల వల్ల ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులకు దూరమవుతున్నారని అమెరికన్ సివిల్ లిబర్టీ యూనియన్ డిప్యూటీ డైరెక్టర్ లీ గెలెంట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి దూరమై.. వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు ఒక హోటల్‌కి తీసుకువెళ్లేందుకు వ్యాన్ ఎక్కించారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. వారిలో సిల్వానా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. చిన్న తమ్ముడిని ఒడిలో పెట్టుకుని, చెల్లిని ఓదారుస్తూ, నాన్న కనిపిస్తాడేమోనన్న ఆశతో ఆ రాత్రంతా నిద్రపోలేదు సిల్వానా పెద్ద కొడుకు. హోటల్‌కు చేరుకోగానే తమ తండ్రి వద్దకు తీసుకువచ్చారేమో అని సంబరపడింది సిల్వానా కూతురు. కానీ ఆమె ఆనందం అంతలోనే ఆవిరైంది. అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు గదులు కేటాయించడంతో సోదరులకు కూడా దూరం అయింది. కేవలం భోజన సమయాల్లో వారిని చూసేందుకు వీలయ్యేది. అన్నను కలిసిన ప్రతీసారీ ఆమె అడిగే ఒకే ఒక ప్రశ్న అమ్మ ఎక్కడా అని. అమ్మ కావాలి అంటూ ఏడ్చే చిన్నారి తమ్ముడిని ఎలా ఓదార్చాలో అర్థంకాక.. చెల్లికి సమాధానం చెప్పలేక ఎంతో కుమిలిపోయేవాడు ఆమె పెద్ద కొడుకు. తల్లి ఇచ్చిన ఫోన్ బుక్‌ను పోగొట్టుకున్నాడు. తండ్రిని కలుసుకునేందుకు మార్గాల కోసం అన్వేషించాడు. ఫేస్బుక్ ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దామనుకుంటే అక్కడ యాక్సెస్ లేదని అధికారులు చెప్పడంతో నిరాశ చెందాడు. చేసేదేమీలేక చుట్టూ ఉన్న వారితో కొత్త స్నేహాలు ఏర్పరచుకున్నారు. కొద్దిరోజులకే వారిని కూడా ఎప్పటికపుడు తమ దేశాలకు తిరిగి పంపించేయడంతో మళ్లీ ఒంటరివారిగా మిగిలేవారు సిల్వానా పిల్లలు. తల్లి కోసం ఏడ్చిన ఆమె కూతురు.. మరో నాలుగేళ్ల చిన్నారిని తల్లిలా లాలించడం నేర్చుకుంది. రోజులు గడుస్తున్నా తల్లిజాడ తెలియక వెక్కి వెక్కి ఏడ్చే ఆ చిన్నారులది అరణ్యరోదనగానే మిగిలింది. 21 రోజుల నిరీక్షణ అనంతరం.. తండ్రి యులియో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పిల్లలతో ఫోన్లో మాట్లాడిన అనంతరం సిల్వానాలో ఆశలు చిగురించాయి. కానీ చిన్న కొడుకు మాత్రం ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడకపోవడం ఆమెను ఎంతగానో బాధించింది. హుస్టన్ ఎయిర్‌పోర్టులో పిల్లల్ని రిసీవ్ చేసుకోవాలని అధికారులు సమాచారంతో అందిచడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తల్లి కూడా ఎయిర్‌పోర్టుకు వస్తుందని ఎదురుచూసిన చిన్నారులకు నిరాశే ఎదురైంది. నిర్బంధం నుంచి విముక్తి.. అరిజోనాలో సిల్వానాను నిర్బందించారు అధికారులు. తన పిల్లల గురించి అడిగిన ప్రతిసారీ ఆమెకు ఎటువంటి సమాధానం లభించేది కాదు. కొన్నాళ్ల తర్వాత ఆమెను తిరిగి పంపించేందుకు, వలసదారులతో కలిసి విమానం ఎక్కించారు. ‘మిగతావారంతా సంతోషంగానే ఉన్నారు. నేను మాత్రమే పిల్లలకు దూరమై నరకయాతన అనుభవిస్తున్నానని కుమిలిపోయింది సిల్వానా. నిర్భంధంలో ఉన్నప్పటికీ భర్తను కలుసుకోగలిగింది కానీ.. పిల్లల జాడ మాత్రం తెలుసుకోలేపోయింది. తనలాగే పిల్లలకు దూరమైన 8 మంది తల్లుల్ని కలుసుకుంది సిల్వానా. సెల్వడార్లో తమను బెదిరించి, తమ జీవితాలు చెల్లాచెదురవడానికి కారణమైన దుండగులను గుర్తుపట్టి పోలీసులకు సాయం చేసింది. 2000 డాలర్ల పెనాల్టీ విధించి ఆమెకు విముక్తి కలిగించారు అధికారులు. అంతులేని ఆనందంతో.. రిలీజ్ అయిన వెంటనే పిల్లల్ని చూసేందుకు ఆత్రుతగా బయలుదేరింది. కానీ తనను పిల్లలు క్షమిస్తారా.. మూడేళ్ల పసివాడు కనీసం గుర్తిస్తాడా అనే సందేహాలతో సతమతమైంది. పెద్ద వాళ్లిద్దరూ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చిన్న కుమారుడు మాత్రం ఎంతగా ప్రయత్నించినా తల్లి దగ్గరకు రాలేదు. సోదరుడి వద్దే ఉండిపోయాడు. ఆ చిత్రాన్ని చూసిన యులియో కూడా కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. -
అమెరికా అధికారుల కస్టడీలో భారతీయుడి మృతి
అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల కస్టడీలో ఉన్న ఓ భారతీయుడు అక్కడే ఆస్పత్రిలో మరణించారు. అతుల్ కుమార్ బాబూభాయ్ పటేల్ (58)ని దేశంలోకి వచ్చేటప్పుడు తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేవంటూ అధికారులు గత వారం అదుపులోకి తీసుకున్నారు. మే పదో తేదీన ఈక్వెడార్ నుంచి వచ్చిన ఓ విమానంలో ఆయన అట్లాంటాలో దిగారు. రెండు రోజుల పాటు అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆయనను అట్లాంటాలోని సిటీ డిటెన్షన్ సెంటర్లోనే ఉంచేశారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన మరణించారని అధికారులు తెలిపారు. పటేల్ వద్ద తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకపోవడం వల్లే ఆయనను దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతించలేదని ఇమ్మిగ్రేషన్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అట్లాంటాలోని సిటీ డిటెన్షన్ సెంటర్లో ఉండగా ఆయనకు ప్రాథమిక వైద్యపరీక్షలు చేసినప్పుడు హైబీపీ, డయాబెటిస్ ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆయన డయాబెటిస్ చూస్తున్న ఓ నర్సు.. ఆయనకు ఊపిరి అందడం లేదని చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా, అక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. భారతీయ రాయబార కార్యాలయానికి పటేల్ మృతి గురించి సమాచారం అందించగా, వాళ్లు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. కస్టడీలో ఇలా మరణించడం చాలా అరుదుగా జరుగుతుందని ఇమ్మిగ్రేషన్ శాఖ చెబుతోంది. -
అమెరికాలో నిజంగానే పాచి పనులా?
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత అనేక మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రేపటి రోజున అమెరికాలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని పట్టుబడుతున్న ట్రంప్ ఈ నెల 20 న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయన అధికారం చేపట్టిన తర్వాత ఆయా రంగాలు మరీ ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయన్న అంశంపైనే ఇప్పుడు అందరి మధ్య చర్చ సాగుతోంది. నిజానికి అమెరికా ఎన్నికల ఘట్టం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ కొత్త ఉద్యోగాల నియామకాల్లో కొంత స్తబ్ధత వచ్చేసింది. అనేక కంపెనీలు నియామకాలను నిలిపివేశారు. అనూహ్య పరిస్థితుల్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సాఫ్ట్ వేరు నిపుణుల్లో మరీ ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్లో ఆందోళన ఎక్కువైంది. ట్రంప్ హయాంలో ఇమిగ్రేషన్ విధానం ఎలా ఉంటుంది? కేవలం స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తారా? ఒకవేళ నిజంగానే అమెరికా స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తే... ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుంది? సాఫ్ట్ వేర్ రంగంపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది? వంటి అనేక అంశాలపై తీవ్రాతి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలకు సైతం పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నాయి. చదవండి.(ఈ నిజాలు తెలిస్తే అమెరికా ఊసే ఎత్తరు..) ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల మధ్య... తానొక విసుగు చెందిన యూఎస్ విద్యార్థినిని అంటూ ఒకమ్మాయి వీడియో పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అమెరికాలో భారతీయ విద్యార్థుల పరిస్థితులను వివరిస్తూ ఆ అమ్మాయి చెప్పిన విషయాలపై రకరకాల భాష్యాలు వినిపిస్తున్నాయి. తాను బీటెక్ చేసిన ఏడాది తర్వాత అందరూ వెళుతున్నారు కదా... అబ్బా అనుకుని అమెరికా వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ అమ్మాయి తన వీడియో పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆ అమ్మాయి చెప్పిన యూనివర్సిటీల గురించి ఇంతకుముందే పలు వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ... గతేడాది ఆ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన వందలాది భారతీయ విద్యార్థులను విమానాశ్రయాల్లోనే ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేసి వెనక్కి పంపిన విషయం గుర్తుండి ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెబుతున్న యూనివర్సిటీలు కూడా అవే. ఆ యూనివర్సిటీల్లో చేరుతున్న అనేక మంది విద్యార్థులు పరిమితికి మించి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుండటం, ఉద్యోగాలు చేయడం కోసమే వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారన్న అనుమానాలతో అప్పట్లో అనేక మంది విద్యార్థులను ఎయిర్ పోర్టుల నుంచి వెనక్కి పంపించారు. ఆ వీడియోలో అమ్మాయి చెబుతున్నదాన్ని బట్టి అక్కడ అనేక మంది పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారన్న సంగతి వెల్లడవుతోంది. అక్కడ ఇంటి రెంట్లు కట్టుకోలేక ఒకే ఇంట్లో 10 నుంచి 15 మంది విద్యార్థులు సర్దుకోవడం, వాళ్లలో కొందరు పాకీ పనులకు సైతం వెళుతున్నారని... ఇలా అనేక విషయాలను ఆ అమ్మాయి వెళ్లడించారు. అయితే అందరి పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఇండియాలోనే హాయిగా ఉండాలని చెబుతున్న ఆ అమ్మాయి అభిప్రాయాలను విబేధిస్తున్న వారూ ఉన్నారు. సమర్థిస్తున్న వాళ్లూ ఉన్నారు. అమెరికాలో అంతగా ఇబ్బందులు ఉంటే.. ఇక అక్కడెందుకు ఉండాలి? తిరిగి వచ్చేయొచ్చు కదా... అని ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. అమెరికా వెళ్లడమంటే కష్టాలు తప్పవు మరి అని చెబుతున్న వాళ్లూ ఉన్నారు. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వం ప్రకటించే ఇమిగ్రేషన్ విధానంపైనే ఇప్పడు అందరి దృష్టి ఉంది. ఏదేమైనప్పటికీ డాలర్ మోజు తీరాలంటే... కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు... తప్పవు. -
భారతీయులకు హెచ్-1 బీ షాక్!
హెచ్-1 బీ, ఎల్ 1 వీసాలపై మరిన్ని ఆంక్షలన్న ట్రంప్ సర్కార్ భారతీయ ఐటీ వృత్తి నిపుణులు అత్యధికంగా వినియోగించే హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ సర్కారు తాజాగా మరోసారి సంకేతాలు ఇచ్చింది. ఈ వీసాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని అమెరికా అటార్నీ జనరల్ పదవికి నామినేట్ అయిన సెనేటర్ జెఫ్ సెషన్స్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆయనను అటార్నీ జనరల్ పదవికి నామినేట్ చేశారు. 'మనం స్వేచ్ఛాయుత ప్రపంచంలో జీవిస్తున్నామని, ఒక అమెరికన్ ఉద్యోగాన్ని విదేశాల్లో తక్కువ జీతంతో పనిచేసే మరొకరితో భర్తీ చేయడం సరైనదేనని భావించడం చాలా తప్పు' అని సెనేట్ జ్యుడీషియరి కమిటీ ముందు హాజరైన జెఫ్ తెలిపారు. అమెరికా అటార్నీ జనరల్ పదవి చేపట్టేందుకు తాను సిద్ధమని ధ్రువీకరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ 'మనకు సరిహద్దులు ఉన్నాయి. మన పౌరులకు మనం కట్టుబడి ఉండాలి. ఆ విషయంలో మనం చాంపియన్లం. మీతో పనిచేయబోతుండటం గర్వంగా భావిస్తున్నా' అని జెఫ్ అన్నారు. అమెరికాలో అత్యధిక హెచ్-1బీ వీసాలు పొందుతున్నది భారతీయులే. అమెరికాకు చెందిన కాగ్నిజెంట్, ఐబీఎం తదితర సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేసేందుకు ఈ వీసాల ద్వారానే భారతీయుల అనుమతి పొందుతున్నారు. ఒకవేళ ఈ వీసాలపై ఆంక్షలు విధిస్తే భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీలు, వాటి భాగస్వాములైన అమెరికన్ కంపెనీలకు తీవ్ర ఎదురుదెబ్బ కానుంది. -
అమెరికాలో భారీగా భారత విద్యార్థులు
వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య దాదాపు 2 లక్షలకు చేరుకుందని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ నివేదిక నివేదిక వెల్లడించింది. ఏడాదిలో ఈ సంఖ్య 28.5 శాతం పెరిగిందని తెలిపింది. అయినా 3.23 లక్షలతో అక్కడ చైనా విద్యార్థులు భారతీయుల కన్నా ఎక్కువ ఉన్నారని పేర్కొంది. ఏడాదిలో చైనా విద్యార్థుల సంఖ్య పెరుగుదల రేటు 7.2 శాతమే. అమెరికాలో 11 లక్షల విదేశీ విద్యార్థులున్నారు. అమెరికాలో చదువు కోసం వివరాలు నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 5.5 శాతం పెరిగింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) కోర్సులు చేసేందుకు విదేశీ విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతేడాది జూలై నుంచి ఈ సంఖ్య 15.2 శాతం పెరిగింది. ఆసియా ప్రాంతానికి చెందిన 407,000 మంది విద్యార్థులు స్టెమ్ కోర్సులు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 17 శాతం అధికం. మొత్తం మీద అమెరికాలో ఉన్న ఆసియా విద్యార్థుల సంఖ్య 6.6 శాతం పెరిగి 856,681కు చేరుకుంది. -
షారుక్‌కు అమెరికా క్షమాపణ
-
షారుక్‌కు అమెరికా క్షమాపణ
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు అమెరికా క్షమాపణ చెప్పింది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఆయనను నిర్బంధించడంతో తీవ్ర ఆవేదనకు గురైన షారుక్.. ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కిన విషయం తెలిసిందే. పదే పదే తనను అమెరికాలో ఇలా అవమానిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. షారుక్‌ను అమెరికా విమానాశ్రయంల ఆపేయడం ఇప్పటికి ఇది మూడోసారి. (చదవండి: అమెరికాలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం) దాంతో అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారి ఒకరు షారుక్ ఖాన్‌కు క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు. 'విమానాశ్రయంలో కలిగిన అసౌకర్యానికి సారీ షారుక్ ఖాన్.. కానీ అమెరికన్ దౌత్యవేత్తలను కూడా అదనపు తనిఖీల కోసం ఆపుతాం' అని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే, ఎలాంటి కారణం లేకుండా షారుక్‌ను మళ్లీ మళ్లీ ఆపడంపై భారత ప్రభుత్వ వర్గాలు కూడా తీవ్ర అసంతృప్తి తెలిపాయి. ఇక షారుక్ ఎలా బయటకు వచ్చారన్న విషయం కూడా స్పష్టంగా తెలియరాలేదు. ఆయన తనంతట తానే వచ్చారా.. లేదా భారత అధికారులు కల్పించుకున్న తర్వాత అమెరికా ప్రభుత్వం స్పందించిందా అన్న విషయం తెలియలేదు. -
అమెరికాలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో ఆయనను అధికారులు నిర్బంధించారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి భద్రతా ఏర్పాట్లు ఎంత ముఖ్యమో తనకు పూర్తిగా తెలుసునని, కానీ, ప్రతిసారీ అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం అంటే చిరాకు వేస్తుందని అంటూ ఈ విషయాన్ని స్వయంగా షారుక్ ఖానే ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే అదే సమయంలో కాలక్షేపం కోసం తాను ఏం చేశానో కూడా చెప్పారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అనుమతి వచ్చేవరకు వేచి చూస్తూ మంచి పోకిమన్లను పట్టుకున్నానని అన్నారు. షారుక్ ఖాన్‌ను అమెరికా విమానాశ్రయంలో అడ్డుకోవడం ఇది మొదటి సారి కాదు. 2012 ఏప్రిల్‌లో కూడా ఆయనను న్యూయార్క్ విమానాశ్రయంలో రెండు గంటల పాటు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపేశారు. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని, కారణం ఏమీ లేకుండా రెండు మూడు గంటల పాటు విమానాశ్రయంలో ఆగిపోవడం భలే చిరాకు అని ఇంతకుముందు ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. తన పిల్లలను మంచి యూనివర్సిటీలో చేర్చడం కోసమే తరచు అమెరికా వెళ్తున్నానని ఆయన వివరించారు. నిజానికి అంతకుముందే 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ (అయామ్ నాట్ ఎ టెర్రరిస్ట్) అనే సినిమా కూడా షారుక్ హీరోగా వచ్చింది. I fully understand & respect security with the way the world is, but to be detained at US immigration every damn time really really sucks. — Shah Rukh Khan (@iamsrk) 12 August 2016 The brighter side is while waiting caught some really nice Pokemons. — Shah Rukh Khan (@iamsrk) 12 August 2016 -
అక్రమ ‘వీసా’పై యూఎస్ సీరియస్
♦ స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడ్డ ♦ 306 మంది భారతీయ విద్యార్థులు వాషింగ్టన్: వీసా గడువు ముగిశాక కూడా అమెరికాలోనే అక్రమంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ.. స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన 306 మంది భారత విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో 306 మంది విద్యార్థులు వీసా గడువు పెంచుకునేందుకు దళారుల ద్వారా ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని, వీరంతా న్యాయబద్ధంగా విద్యార్థి వీసాలు తీసుకుని వచ్చినవారేనని ఇమ్మిగ్రేషన్ అధికారి మార్క్ టోనర్ తెలిపారు. గతవారం జరిగిన ఈ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా 11 మంది భారత సంతతి వారితోపాటు 21మంది దళారులను అరెస్టు చేశామన్నారు. ‘వీరందరి దగ్గర విద్యార్థి వీసాలే ఉన్నాయి. కానీ వీసా పొడగించుకునేందుకు అక్రమమార్గాల్లో ప్రయత్నించినందుకే వీరిపై చర్యలుంటాయి’ అని టోనర్ పేర్కొన్నారు. అసలేం జరుగుతోంది? విద్యార్థి వీసాపై వెళ్లిన వారు వేర్వేరు కారణాలతో వీసా గడువు పెంచాలని సమయం ముగిసే 3-4 నెలల ముందు ఇమ్మిగ్రేషన్ అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇదంతా చట్టబద్ధంగా జరిగే వ్యవహారమే కానీ,సరైన కారణాల్లేని పక్షంలో విద్యార్థులు మధ్యవర్తుల ద్వారా వీసా గడువు పెంచుకునేలా అక్రమమార్గాలను అన్వేషిస్తారు. మధ్యవర్తులు మనుగడలో లేని వర్సిటీల పేరుతో విద్యార్థుల వీసా గడువు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తారు. దీంతో విద్యార్థి వీసాలపై వెళ్లిన వారికి మరింత కాలం అమెరికాలోనే ఉండి అక్కడే ఉద్యోగాలు వెతుక్కునేందుకు.. ఆర్థిక అవసరాలకోసం పనిచేసేందుకు వీలుంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఇలాంటి దళారుల ఆటకట్టించేందుకు.. కొన్ని నకిలీ వర్సిటీలను సృష్టించి దళారులను ఆకర్షిస్తుంది. ఆ తర్వాత విద్యార్థి వీసా ఫ్రాడ్ చేసే వారిని పట్టుకుంటుంది. వారంరోజుల క్రితం ఇలా యూఎస్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ సృష్టించిన వర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే నకిలీ వర్సిటీలో చేరేందుకు చాలా మంది విద్యార్థులు వచ్చారు. ఇందులో దళారులుగా ఇద్దరు తెలుగువారూ ఉన్నట్లు తేలింది. -
పాశ్చాత్యుల్ని వీడని రంగు జబ్బు
చర్మం రంగు కారణంగా భారత మూలాలున్న బ్రిటన్ వ్యక్తిని నిర్బంధించిన అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు లండన్: శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా వస్తున్న మార్పులతో ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోయినా పాశ్చాత్యుల్లో గూడు కట్టుకున్న వర్ణ వివక్ష మాత్రం ఇంకా తుడిచి పెట్టుకుపోలేదు. తాజాగా భారత సంతతికి చెందిన బ్రిటన్ వ్యక్తికి అమెరికాలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. చర్మం రంగు కారణంగా అమ్రీత్ సురానా అనే వ్యక్తిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 13 గంటల పాటు నిర్బంధించి అనంతరం తిప్పి పంపేశారు. యూకే సెక్యూరిటీ కంపెనీలో ఇంటర్నేషనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల సురానా అరిజోనాలోని బ్రాంచ్ పరిశీలన నిమిత్తం లండన్ నుంచి అమెరికా వచ్చారు. డెట్రాయిట్లో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వేచి చూస్తున్న సమయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ‘అమెరికాలో వీసా లేకుండా ప్రయాణించడానికి అనుమతించిన 38 దేశాల్లో ఒక దేశానికి చెందిన వ్యక్తినని ఆధారాలు చూపినా నా చర్మం రంగు కారణంగా వారు దాన్ని నమ్మలేదు’ అని సురానా పేర్కొన్నారు. సురానాను తిప్పి పంపడంపై యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటక్షన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. 20 నిమిషాల వ్యవధిలోనే వారు నన్ను అమెరికాలో ఉద్యోగం కోసం వచ్చిన అక్రమ వలసదారుగా నిర్ధారించారని సురానా వాపోయారు. -
అమెరికా ఆశలకు ‘బ్లాక్‌లిస్ట్’ కష్టాలు!
* నాణ్యత కొరవడిన 150కి పైగా వర్సిటీలపై దృష్టిపెట్టిన అమెరికా ప్రభుత్వం * కాలిఫోర్నియాలో 22 విశ్వవిద్యాలయాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు సమాచారం * ఆ లిస్టులోని వర్సిటీల్లో చేరుతున్న విదేశీ విద్యార్థుల్ని వెనక్కి పంపుతున్న వైనం * ఇమిగ్రేషన్ అధికారులు తిప్పి పంపిన భారత విద్యార్థులు 25కు పైనే.. సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అమెరికా చదువు ఆశలకు ‘బ్లాక్‌లిస్ట్’ కష్టాలు దాపురించాయి. పలు యూనివర్సిటీల్లో అడ్మిషన్ తీసుకునేందుకు విమానం ఎక్కుతున్న భారత విద్యార్థులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయాల నుంచే తిప్పి పంపుతున్నారు. విదేశీ విద్యార్థుల డిమాండ్ దృష్ట్యా కుప్పలు తెప్పలుగా బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తూ నాణ్యతకు తిలోదకాలు ఇచ్చిన 150కి పైగా విశ్వవిద్యాలయాలను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే దీనికి కారణం. సరైన అవగాహన లేకపోవడం, అమెరికా వర్సిటీలో సీటు వస్తే చాలనుకుంటూ వెళ్లడం వంటివి విద్యార్థుల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు.. గత ఆరు నెలలుగా అమెరికా ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో నాణ్యత, బోధనా ప్రమాణాలపై దృష్టి పెట్టిం ది. అక్కడి కాలిఫోర్నియాలోని 22కు పైగా కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు సమాచారం. ఆ జాబితాలోని రెండు వర్సిటీల్లో చేరిన భారత, చైనా విద్యార్థులను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయాల నుంచే వెనక్కి పంపుతున్నారు. ఇప్పటికే వెయ్యి మందికి పైగా చైనా విద్యార్థులను వెనక్కి పంపగా.. 25 మంది భారత విద్యార్థులను తిప్పిపంపారు. సిలికాన్ వ్యాలీ వర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎంఎస్ డిగ్రీ కోసం భారత్ నుంచి 875 మంది విద్యార్థులు చేరినట్లు తెలిసింది. వారిలో దాదాపు 600 మంది ఇప్పటికే అమెరికాకు చేరుకున్నారు. వారి భవిష్యత్ ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. 1,600 విశ్వవిద్యాలయాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దాదాపు 1,600 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వాటిలో 300 ప్రభుత్వ రంగ వర్సిటీలు, మరో 600 వివిధ ట్రస్టులు, ప్రముఖ విద్యా సంస్థల అధీనంలో ఉన్నాయి. మిగతా 700 యూనివర్సిటీలు, వాటి స్థితిగతుల సమాచారం లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. సాధారణంగా అమెరికా వర్సిటీల్లో జీఆర్ఈ, టోఫెల్ ఉత్తీర్ణత, ఆ పరీక్షల్లో సాధించిన పాయింట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. కానీ ఈ 700 వర్సిటీలు జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలకు హాజరైతే చాలు అడ్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. ఎన్ని మార్కులు సాధించారన్నదానితో నిమిత్తం లేకుండానే ఎంఎస్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు జీఆర్ఈ లేకపోయినా సీటు ఇస్తామంటూ భారత్, అమెరికాలోని స్థానిక ప్రభుత్వాలు, వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. షికాగోకు చెందిన ఓ వర్సిటీ ఇలా నిజామాబాద్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వర్సిటీలో చదివిన విద్యార్థులు జీఆర్ఈ లేకపోయినా అమెరికా వర్సిటీలో చేరవచ్చన్నది ఆ ఒప్పందం. ఇలాంటి వాటితోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పుదోవ పట్టి ఇబ్బందుల పాలవుతున్నారు. కన్సల్టెన్సీలకూ నజరానాలు అమెరికాలో ఎంఎస్ డిగ్రీకి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అక్కడి కొన్ని విశ్వవిద్యాలయాలు భారత్‌లో కన్సల్టెన్సీలతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి. ఒక్కో విద్యార్థి అడ్మిషన్‌కు 250 డాలర్లు (సుమారు రూ. 15 వేలు) కన్సల్టెన్సీలకు ఇస్తున్నాయి. ఈ సొమ్ము కు ఆశపడిన పలు కన్సల్టెన్సీలు మంచి జీఆర్ ఈ, టోఫెల్ స్కోరు సాధించిన విద్యార్థులతో కూడా చెత్త వర్సిటీలకు దరఖాస్తు చేయిస్తున్నాయి. కనీస మార్కులు వచ్చిన విద్యార్థులే వీటివల్ల అధికంగా నష్టపోతున్నారు. ఆ వర్సిటీల జాబితా బయటపెట్టాలి అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన వర్సిటీల జాబితాను బయటపెట్టకపోతే ఇలాంటి అనర్థాలు తప్పవని నిపుణులు అంటున్నారు. అమెరికాలో ఏయే వర్సిటీలను నిషేధిత జాబితాలో చేర్చారనే వివరాలను అమెరికా కాన్సులేట్ కార్యాలయాలకు అందించాలని... అలా చేస్తే ఆయా వర్సిటీలు జారీ చేసిన ఐ20 పత్రాల ఆధారంగా వచ్చిన వీసా దరఖాస్తులను తిరస్కరించడానికి వీలు కలుగుతుందని అంటున్నారు. ‘బ్లాక్‌లిస్ట్’ వర్సిటీల వివరాలు ప్రకటిస్తాం: సుష్మా స్వరాజ్ సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో బ్లాక్‌లిస్టులో పెట్టిన వర్సిటీలు, గుర్తింపు పొందిన వర్సిటీల జాబితాను అందచేస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. గుర్తింపులేని వర్సిటీల సర్టిఫికెట్లకు ప్రపంచంలో ఎక్కడా గుర్తింపు ఉండదని.. జాబితా విడుదల చేసే వరకు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లకుంటేనే మంచిదని సూచించారు. అమెరికాకు వెళ్లే భారత విద్యార్థుల సమస్యలను కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు మంగళవారం సుష్మా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అశోక్‌గజపతిరాజు, రామ్మోహనరావు మీడియాతో మాట్లాడారు. బ్లాక్‌లిస్టు జాబితా అందే వరకు విద్యార్థులు వేచి ఉండాలని కోరారు. ఇది ఎయిర్‌లైన్స్ సమస్య కాదని.. ఏ ఎయిర్‌లైన్స్ ద్వారా అమెరికా వెళ్లినా ఇమిగ్రేషన్‌లో ఆపేస్తారని స్పష్టం చేశారు. బ్లాక్‌లిస్టులో లేము: సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్రన్ వర్సిటీలు వాషింగ్టన్: తమ వర్సిటీలను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్టు పెట్టిందని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ ప్రకటించాయి. ఈ వివరాలను యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులకు పంపామని తెలిపాయి. ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో భద్రతను కట్టుదిట్టం చేయడంతో విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని... ఇమిగ్రేషన్ అధికారులకు సరైన వివరాలు చూపని పక్షంలోనూ తిప్పి పంపుతున్నారని వెల్లడించాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని యూఎస్ ఎంబసీ, ఎయిర్ ఇండియా అధికారులకు వర్సిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. -
అమెరికాకు ఉచితంగా రాఖీ పంపే అవకాశం!
-
అమెరికాకు ఉచితంగా రాఖీ పంపే అవకాశం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిఫ్ట్ పోర్టల్స్‌ను నిర్వహిస్తున్న యూఎస్2గుంటూర్.కామ్ రాఖీలను ఉచితంగా అమెరికాకు పంపే అవకాశాన్ని కల్పిస్తోంది. యూఎస్ఏలో స్థానిక రవాణా ఖర్చుల కింద 2 డాలర్లను చార్జీ చేస్తోంది. అయితే కస్టమర్లకు 2 డాలర్ల క్రెడి ట్ నోట్ ఇస్తామని, ఈ మొత్తాన్ని భవిష్యత్తు ఆర్డర్లలో వాడొచ్చని కంపెనీ తెలిపింది. రాఖీలు 3 డాలర్ల నుంచి లభిస్తాయి. హైదరాబాద్ స్పెషల్ ముత్యాల రాఖీలు, వెండి రాఖీలు వీటిలో ఉన్నాయి. ప్రతి ఆర్డరుపై ప్రత్యేక బహుమతి ఉంది. కస్టమర్లు డైమంట్ సెట్ గెలుపొందే అవకాశమూ ఉందని కంపెనీ తెలిపింది. కంపెనీకి 4 లక్షలకుపైగా ప్రవాస భారతీయులు కస్టమర్లుగా ఉన్నారు. -
ఎన్నారై వైద్యుడుకి ప్రతిష్టాత్మక పురస్కారం
అమెరికాలో ఎన్నారై వైద్యుడు, ప్రముఖ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ రాహుల్ జిందాల్ ప్రతిష్టాత్మక 'అవుట్ స్టాండింగ్ అమెరికన్ బై ఛాయస్' పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌లో వైద్య రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆ అవార్డుకు ఎంపిక చేసినట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) శనివారం వెల్లడించింది. యూఎస్‌లోని భారతీయ సమాజాన్నే కాకుండా అమెరికన్ ప్రజలకు కూడా రాహుల్ అందించిన సేవలు నభూతోనభవిష్యత్తు అని ఆ సంస్థ పేర్కొంది. ఈ నెల 13న వర్జీనియాలోని అర్లింగ్టన్ నేషనల్ సిమెట్రిలో జరిగే కార్యక్రమంలో ఆ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని రాహుల్ కు అందజేస్తామని వివరించింది. ఇటీవలే ఇంటర్నేషనల్ లీడర్ షిప్ ఫౌండేషన్ నుంచి రాహుల్ జిందాల్ లీడర్షిప్ అవార్డుకు కూడా అందుకున్నారు. సర్వీస్ అండ్ వాలంటరీజమ్ కమిషనర్‌గా రాహుల్ జిందాల్ ను ఆ ఫౌండేషన్ నియమించిన సంగతి తెలిసిందే. వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్లో ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే జార్జీయా వాషింగ్టన్ యూనివర్శిటీలో క్లీనికల్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీలో ఎండీ విద్యను రాహుల్ జిందాల్ అభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లారు. ఆ క్రమంలో అమెరికాలో స్థిరపడ్డారు. సమాజసేవలో భాగంగా ఉత్తర అమెరికాలో దాదాపు 600 దేవాలయాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.