అమెరికాలో భారీగా భారత విద్యార్థులు
వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్య దాదాపు 2 లక్షలకు చేరుకుందని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ నివేదిక నివేదిక వెల్లడించింది. ఏడాదిలో ఈ సంఖ్య 28.5 శాతం పెరిగిందని తెలిపింది. అయినా 3.23 లక్షలతో అక్కడ చైనా విద్యార్థులు భారతీయుల కన్నా ఎక్కువ ఉన్నారని పేర్కొంది. ఏడాదిలో చైనా విద్యార్థుల సంఖ్య పెరుగుదల రేటు 7.2 శాతమే. అమెరికాలో 11 లక్షల విదేశీ విద్యార్థులున్నారు.
అమెరికాలో చదువు కోసం వివరాలు నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్య గతేడాదితో పోలిస్తే 5.5 శాతం పెరిగింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) కోర్సులు చేసేందుకు విదేశీ విద్యార్థులు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతేడాది జూలై నుంచి ఈ సంఖ్య 15.2 శాతం పెరిగింది. ఆసియా ప్రాంతానికి చెందిన 407,000 మంది విద్యార్థులు స్టెమ్ కోర్సులు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 17 శాతం అధికం. మొత్తం మీద అమెరికాలో ఉన్న ఆసియా విద్యార్థుల సంఖ్య 6.6 శాతం పెరిగి 856,681కు చేరుకుంది.