అమెరికాలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం | Shah Rukh Khan Detained At Los Angeles Airport | Sakshi
Sakshi News home page

అమెరికాలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం

Published Fri, Aug 12 2016 7:58 AM | Last Updated on Fri, Aug 24 2018 8:57 PM

అమెరికాలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం - Sakshi

అమెరికాలో షారుక్ ఖాన్‌కు చేదు అనుభవం

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో ఆయనను అధికారులు నిర్బంధించారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి భద్రతా ఏర్పాట్లు ఎంత ముఖ్యమో తనకు పూర్తిగా తెలుసునని, కానీ, ప్రతిసారీ అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం అంటే చిరాకు వేస్తుందని అంటూ ఈ విషయాన్ని స్వయంగా షారుక్‌ ఖానే ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే అదే సమయంలో కాలక్షేపం కోసం తాను ఏం చేశానో కూడా చెప్పారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అనుమతి వచ్చేవరకు వేచి చూస్తూ మంచి పోకిమన్‌లను పట్టుకున్నానని అన్నారు.

షారుక్ ఖాన్‌ను అమెరికా విమానాశ్రయంలో అడ్డుకోవడం ఇది మొదటి సారి కాదు. 2012 ఏప్రిల్‌లో కూడా ఆయనను న్యూయార్క్ విమానాశ్రయంలో రెండు గంటల పాటు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపేశారు. ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని, కారణం ఏమీ లేకుండా రెండు మూడు గంటల పాటు విమానాశ్రయంలో ఆగిపోవడం భలే చిరాకు అని ఇంతకుముందు ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. తన పిల్లలను మంచి యూనివర్సిటీలో చేర్చడం కోసమే తరచు అమెరికా వెళ్తున్నానని ఆయన వివరించారు. నిజానికి అంతకుముందే 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ (అయామ్ నాట్ ఎ టెర్రరిస్ట్) అనే సినిమా కూడా షారుక్ హీరోగా వచ్చింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement