
కవితా కౌశల్
అన్నలు ఉన్నవాళ్లు రాఖీలు కట్టారు. అన్నలు లేనివాళ్లు ‘అన్న’ అనుకున్న వాళ్లకు రాఖీలు కట్టారు. అన్న ఉండీ, లేకుండా పోయిన దుఃఖంలో కవితా కౌశల్ అనే చెల్లి తన అన్నకు గుర్తుగా మిగిలి ఉన్న రైఫిల్‌కు రాఖీ కట్టింది! కవిత అన్న రాకేశ్ అసిస్టెంట్ కానిస్టేబుల్. ఛత్తీస్‌గఢ్‌లోని అరణ్‌పూర్‌లో గత ఏడాది మావోయిస్టులు దొంగ దెబ్బ తీసినప్పుడు రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటనలో రాకేశ్‌తోపాటు మరో ఇద్దరు పోలీసు సిబ్బంది, దూరదర్శన్ కెమెరామన్ దుర్మరణం చెందారు. ‘‘మా అన్నను చంపినవారిపై ప్రతీకారం తీర్చుకోవడమే నా ధ్యేయం’’ అంది కవిత, అన్న రైఫిల్‌కు రాఖీ కట్టాక. కవిత ఇప్పుడు దంతేవాడలో పోలీస్ కానిస్టేబుల్. అన్న ఉద్యోగాన్ని ఆమెకు ఇచ్చారు.