ఖిలా వరంగల్: ఇంటిస్థలం విషయమై అక్కాతమ్ముడి మధ్య తలెత్తిన వివాదానికి పోలీసులు ప్రేమపూర్వక పరిష్కారం చూపించారు. తమ్ముడికి అక్కతో రాఖీ కట్టించి ఇద్దరినీ ఏకం చేశారు. ఉర్సు కరీమాబాద్ కోయవాడకు చెందిన పస్తం కోటమ్మ, ఆమె తమ్ముడు కొత్తూరు ఏడుకొండలు మధ్య వారసత్వ ఇంటిస్థలంకోసం గొడవ జరుగుతోంది. చివరికి కోటమ్మ.. తమ్ము డిపై మిల్స్‌కాలనీ పీఎస్‌లో శనివారం ఫిర్యాదు చేసింది.
దీంతో ఎస్‌ఐ సురేశ్ అక్కాతమ్ముడిని స్టేషన్‌కు పిలిపించారు. వారసత్వ ఇంటిస్థలం, తోబుట్టువుల అనుబంధంపై అవగాహన కల్పించి.. స్థల వివాదాన్ని పరిష్కరించారు. అనంతరం అక్కతో తమ్ముడికి రాఖీ కట్టించారు. సుహృద్భావ పరిష్కారానికి కృషి చేసిన ఎస్‌ఐ సురేశ్‌ను ఇన్‌స్పెక్టర్ మల్లయ్య అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment