భానుడికి రక్షా బంధనం!
మన దగ్గరే కాదు పైన కూడా రాఖీ పండుగ జరుగుతున్నట్టు ఉంది. ఇదిగో ఇలా సూర్యునికి రాఖీ కట్టినట్టు హరివిల్లు వర్ణాల అందమైన వలయం ఒకటి బుధవారం ఆవిష్కృతమైంది. సాధారణంగా వర్షాలు వెలిశాక ఇంద్రధనసులు కనువిందు చేస్తాయి. కానీ భానుడి చుట్టూ ఇలా రంగురంగుల వలయం ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు.