
రాఖీ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తమ సోదరులు, సోదరీమణులను గుర్తు చేసుకుంటున్నారు. తమ ఇంట్లో జరుపుకుంటోన్న ఈ పండుగ ఫొటోలను పోస్ట్ చేస్తూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని పిలుపునిస్తున్నారు. రక్షా బంధన్ సంబర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెళ్లు చిరంజీవికి రాఖీ కట్టి నోరు తీపి చేసి ఆశీర్వాదం తీసుకోగా, వాళ్లను ఆప్యాయంగా కౌగిలించుకొని ఆనందంగా గడుపుతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అంతే కాకుండా ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.
‘నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’అని చిరంజీవి ట్వీట్ చేశారు.
నా చెల్లెళ్ళిద్దరితోనే కాదు. తెలుగింటి ఆడపడచులతో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 3, 2020
Happy #RakshaBandhan ! pic.twitter.com/DAZrypOm5B
అలాగే హీరో నితిన్ కూడా తన సోదరి నిక్షిత రాఖీ కట్టిన ఫోటోను ట్విటర్‌లో పంచుకుంటూ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్ బాబు తన కూతురు, కుమారుడి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ..'రక్షాబంధన్ శుభాకాంక్షలు.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి' అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment