మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ నటి సన్నీ లియోన్ మన సాంప్రదాయాలకు మెల్లిగా అలవాటు పడిపోయింది. రక్షాబంధన్ ను కూడా జరుపుకొంది .
ముంబై: మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మన సాంప్రదాయాలకు మెల్లిగా అలవాటు పడిపోయింది. మొన్ననే రక్షాబంధన్ ను జరుపుకొంది. అయితే అది ఆమె సోదరుడు సందీప్ వోహ్రాతో మాత్రం కాదు. అతను అమెరికాలో ఉండటంతో ఈసారి మరో వ్యక్తికి రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకీ అతనెవరంటారా?
సన్నీలియోన్ వ్యక్తిగత సంరక్షకుడు(బౌన్సర్) యూసఫ్ కు రాఖీ కట్టి అతనితో తన అనుబంధం చాటుకుంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మరోవైపు దీపికా పదుకొనే, మరికొందరు తారలు కూడా తమ బ్రదర్స్ కు రాఖీ కట్టిన ఫోటోలను షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం బాద్‌షాహో, సంజయ్‌దత్ భూమి చిత్రాల కోసం ఐటెం గర్ల్ గా మారిన ఈ సెక్సీ క్వీన్ త్వరలో సన్నీసిటీ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది.