
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అక్కచెల్లెమ్మలంతా తమ జీవితాల్లో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ఈ ప్రయాణంలో తాను తోడుగా ఉంటానంటూ ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.
నా అక్కచెల్లెమ్మలందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీరు మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఎల్లప్పుడూ మీకు నేను తోడుగా ఉంటాను. కుటుంబాలకు మంచి భవిష్యత్తును అందించడంలో అక్కచెల్లెమ్మల పాత్ర కీలకమని నేను బలంగా నమ్ముతాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 19, 2024

Comments
Please login to add a commentAdd a comment