మీ సోదరుడికి రాఖీ కట్టారా?... | send to the raksha bandhan photos | Sakshi
Sakshi News home page

మీ సోదరుడికి రాఖీ కట్టారా?...

Published Sat, Aug 29 2015 10:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM

మీ సోదరుడికి రాఖీ కట్టారా?...

మీ సోదరుడికి రాఖీ కట్టారా?...

హైదరాబాద్: అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ. అన్నా చెల్లెల్ల అనుబంధానికి.. అక్కా, తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.. నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. కష్టసుఖాల్లో ఒకరికొకరం సంరక్ష.. అనే అభయాన్ని తోబుట్టువులకిచ్చే పండుగే రాఖీ. కులమతాలకు అతీతంగా.. ఆప్యాయతలకు అతి దగ్గరగా.. సోదర, సోదరీమణులు ఈ ఉత్సవాన్ని అపురూపంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజంతా ఇంటింటా రాఖీ ఆనందోత్సాహాలు వెల్లివిరియనున్నాయి. రక్షానుబంధాలు పరస్పరం మనసులను తడుమనున్నాయి.

రాఖీ సందర్భంగా మీ సోదరి మీకు రాఖీ కట్టిందా? మీ సోదరుడికి మీరు రాఖీ కట్టారా? అయితే  ఆ ఫొటోలను వివరాలతో పాటు మాకు పంపండి. అలాగే  ప్రాంతం పేరు, మీ పేరుతో sakshinetduty@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి పంపండి. వాటిని మీ వివరాలతో గ్యాలరీ రూపంలో అందిస్తాం.      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement