Rakhi Purnima
-
Rakhi Purnima 2024: ఒకరికొకరు అండాదండా
శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం అంటే తెలియని వారు ఉండవచ్చునేమో కానీ, రాఖీపూర్ణిమ అంటే తెలియని వారుండరు. పేరు తెలిసినా ఆ సంప్రదాయ బద్ధంగా ఆనాడు ఏం చేయాలో... రాఖీ కట్టడంలోని అంతరార్థం ఏమిటో తెలిసినవారు అరుదనే చె΄్పాలి.పూర్ణిమనాడు శ్రవణానక్షత్రం ఉన్న మాసానికి శ్రావణ మాసమని పేరు. శ్రావణమాసంలో రాత్రివేళ పూర్ణిమ తిథి ఉన్న రోజును రక్షికా పూర్ణిమ అన్నారు పెద్దలు. రక్షించగలిగిన పూర్ణిమ, రక్షణ కోరుకునే వారికోసం ఉద్దేశింపబడిన పూర్ణిమ అని అర్థం. ఈ పండుగ కాస్తా కాలక్రమంలో రాఖీపూర్ణిమగా పేరు మార్చుకుంది.శ్రావణ పూర్ణిమనాడు ఉదయమే స్నానం చేయాలి. ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా పూజాశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట.అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు– మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి కడుతూ– ‘ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణసమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. అయితే ఇది ఇప్పటి ఆచారం కాదు... ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమే!రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక అంతటితో వదిలేయకూడదు. ఆ బంధానికి కట్టుబడి ఒకరికి ఒకరు అన్నింటా అండగా నిలవాలి. మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే. అంతేకాదు.. దేశ రక్షణలో పాల్గొనే సరిహద్దు భద్రతాదళాలకు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి విజయాన్ని, శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం శ్రావణ పున్నమిరోజు రక్షాబంధనం కడుతుండటం శుభపరిణామం.స్థితి కారుడైన శ్రీహరి జన్మనక్షత్రం శ్రవణం నిండుగా ఉండే ఈ శ్రావణ పూర్ణిమనాడే నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను. కాబట్టి ఆ శ్రీహరి అనుగ్రహం నా మీద ప్రసరించి నేనూ రక్షించేవాడిగానే ఉండాలని అర్థం చేసుకోవడానికే శ్రావణపూర్ణిమని ఈ పండుగ రోజుగా నిర్ణయించారని గమనించాలి. అంతేకాదు, అపరాహ్ణ సమయంలో రక్షికని కడుతున్న నా రక్షికాబంధానికి ఆ ప్రత్యక్ష కర్మసాక్షి సూర్యుడని తెల్పడానికే. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలఃతేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల!రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమై΄ోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. ఈ పండుగలోని హంగులు, ఆర్భాటాల మాట ఎలా ఉన్నా, తమకు రక్షణ ఇవ్వవలసిందిగా కోరుతూ... తమ సోదరులకు దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించడం ఇటీవల వెల్లివిరుస్తున్న ఒక సత్సంప్రదాయÆ . ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో çమాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. – డి.వి.ఆర్. -
5 రూపాయల నాణేలతో అక్కకు తులాభారం
ఖమ్మం అర్బన్: ఖమ్మంలో ఓ సోదరుడు తన అక్కకు రూ.56 వేల విలువైన రూ.5 నాణేలతో తులాభారం వేసి కానుక అందజేయడం ద్వారా తన ప్రేమను చాటుకున్నాడు. భదాద్రి కొత్తగూడెం జిల్లా గార్ల బయ్యారానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బొలగాని బసవనారాయణ ఖమ్మంలో నివాసముంటున్నారు. ఆయన కుమార్తె రణశ్రీకి గత ఏడాది వివాహం జరగ్గా, కుమారుడు త్రివేది పదో తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉంటే కొన్నేళ్లుగా తనకు తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని రూ.5 నాణేలుగా మారుస్తున్న త్రివేదిని ఎవరడిగినా ఎందుకో చెప్పేవాడు కాదు. వివాహమయ్యాక తొలిసారి రాఖీ కట్టేందుకు వస్తున్న సోదరికి ఈ నాణేలతో తులాభారం వేసి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు త్రివేది.. తన తల్లిదండ్రులకు పండుగ ముందురోజు చెప్పాడు. దీంతో శుక్రవారం బంధువులను ఆహ్వానించి పండుగ వాతావరణంలో తులాభారంపై ఒక వైపు అక్కను కూర్చోపెట్టి మరో వైపు అక్క బరువు ఎత్తు తాను సేకరించిన రూ.5 నాణేలను ఉంచి బహుమతిగా ఇవ్వడంతో ఆమె మురిసిపోయింది. (క్లిక్: ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం) పంచ పాండవుల పూలే రాఖీలు మార్కెట్లో దొరికే రెడీమేడ్ రాఖీలతో అందరూ రక్షాబంధన్ జరుపు కొంటారు. హుస్నాబాద్ పట్టణంలోని ఆరెపల్లెకు చెందిన దొంతరబోయిన అయిలయ్య ఇంట్లో మాత్రం రాఖీ పండుగ వినూత్నంగా జరుగుతుంది. వీళ్ల ఇంట్లో పంచపాండవుల పూలతోనే రాఖీలు కట్టుకుంటారు. రాఖీల పోలికతో ఉండే ఈపంచపాండవుల పూలను రాఖీలుగా తయారు చేసి కట్టుకోవడం గొప్ప అనుభూతిని స్తున్నందని అయిలయ్య చెబుతున్నాడు. అయిలయ్య కొన్నే ళ్లుగా కూర గాయలు, పండ్లు, పూల నర్సరీలను పెంచుతుండటంతో కూర గాయల అయిలయ్యగా అందరికీ చిరపరిచితం. – హుస్నాబాద్ -
రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లు.. తీవ్ర విషాదం
సాక్షి, నల్లగొండ: మాడుగులపల్లి మండలం మాలగూడెంలో రాఖీ పండగనాడు విషాదం చోటుచేసుకుంది. తోడబుట్టినవాడికి రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లకు తీరని శోకం మిగిలింది. శనివారం రాత్రి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ అక్కాచెల్లెళ్ల సోదరుడు చింతపల్లి లక్ష్మయ్య ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన లక్ష్మయ్య చేతికి రాఖీ కట్టి తోడబుట్టిన బంధం విలువ తెలిపిన ఆ అక్కాచెల్లెళ్లు కన్నీరుమున్నీరయ్యారు. రాఖీ పౌర్ణమినాడు జరిగిన ఈ ఘటన గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదాన్ని నింపింది. అన్నకు రాఖీ కట్టేందుకు వారంతా నిన్ననే లక్ష్మయ్య ఇంటికి వచ్చినట్టు తెలిసింది. -
అన్నయ్యకు ప్రేమతో...
సోదర సోదరీమణుల మధ్య బంధాలు, అనుబంధాలు... అప్యాయత అనురాగాలు కలకాలం విలసిల్లాలని జరుపుకునే పండగే∙రక్షాబంధన్. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా, అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క జీవితాంతం భరోసాగా ఉంటామని చెప్పే రక్షాబంధన్‌రోజు ... తమ అన్నయ్యలు, తమ్ముళ్లకు మంచి మంచి డిజైన్లలో ఉన్న రాఖీలను ఏరికోరి కొనుక్కొచ్చి కడతారు తోబుట్టువులు. రాఖీలను ఎంత మంచిగా ఎంపిక చేస్తారో అదేవిధంగా తమ సోదరులు ఎటువంటి గిఫ్టులు ఇస్తారా? అని కూడా ఎదురు చూస్తుంటారు. రాఖీ పండగ రోజు∙తమ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడికి స్వీట్లు, రాఖీలు పట్టుకుని వెళ్లి ఎంతో ప్రేమగా కడతారు. ఇదంతా గత కొన్నేళ్లుగా మనదేశంలో పాటిస్తోన్న సంప్రదాయమే. అయితే ఈ సంప్రదాయానికి కాస్త భిన్నంగా వ్యవహరించిన లక్నోకు చెందిన ఓ చెల్లి.. తన అన్నయ్య దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోకుండా, తనే అన్నయ్యకు అతిపెద్ద బహుమతి ఇచ్చి అతని జీవితాన్ని నిలబెట్టింది. బహుమతి తీసుకున్న ఆ అన్నయ్య ఆనందానికి హద్దులు లేవు. గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాతా దేవ్ లక్నోలోని మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సుజాత అన్నయ్య సుదీప్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్( ఐఆర్ఎస్) అధికారి. ప్రస్తుతం లక్నో లో ప్రిన్సిపల్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదీప్‌కు కిడ్నీ పాడవడంతో.. అన్నయ్యను అమితంగా ఇష్టపడే సుజాత తన కిడ్నీని అన్నయ్యకు దానం చేసింది. దీంతో పదిహేను రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐకేడీఆర్సీ)లో సుదీప్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఈ రక్షాబంధన్‌కు అన్నయ్యకు నేను ఇస్తోన్న అతిపెద్ద బహుమతి ‘ఆయన జీవితమే’ అని సుజాత చెప్పడం విశేషం. సూరత్‌లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా పనిచేస్తోన్న సుదీప్ కుమార్‌కు 2012లో రెండు కిడ్నీలు పాడయ్యాయి. దీంతో 2013లో ఐకేడీఆర్సీలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. çసూరత్‌కు చెందిన బ్రెయిన్ డెడ్ అయిన రోగి నుంచి కిడ్నీ తీసి సుదీప్‌కు అమర్చారు. అతని ఆరోగ్యం కుదుటపడ్డాక ఒక పక్క ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మరోపక్క అవయవ దానం గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2015లో కొంతమందితో కలిసి ‘డొనేట్ లైఫ్’ పేరిట ఎన్జీవోను ప్రారంభించి అవయవదానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. అయితే 2013 నుంచి ఈ ఏడాది వరకు ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ... ఫిబ్రవరి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. రెండోసారి కూడా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చింది. కానీ అతనికి సరిపోయే కిడ్నీ దాత దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఎవరైనా ఇవ్వచ్చు అని డాక్టర్లు చెప్పడంతో.. వెంటనే చెల్లి సుజాత కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. డాక్టర్లు ఆమెను పరీక్షించి సుదీప్‌కు మ్యాచ్ అవుతుందని చెప్పడంతో.. వెంటనే అన్నయ్యకు తన కిడ్నీని ఇచ్చి అతడి జీవితాన్ని నిలబెట్టింది సుజాత. రాయ్‌పూర్‌కు చెందిన అనుమిత, ఫరిదాబాద్‌కు చెందిన ఆషా, వందన చంద్రా అనే మహిళలు రక్షాబంధన్ సందర్భంగా.. తమ కిడ్నీలను అన్నయ్యలకు దానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. అంతేగాక అక్కకి తమ్ముడు, చెల్లికి అన్నయ్యలు రక్షాబంధన్‌కు గిఫ్టుగా కిడ్నీలు ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. ‘తోబుట్టువు జీవితాన్ని కాపాడడమే రాఖీ అతిపెద్ద బహుమతి’ అని ఈ అన్నాచెల్లెళ్ల అనుబంధాలు చెబుతున్నాయి. ‘‘నాకైతే అన్నీ మా పెద్దన్నయ్యే. నేను వైద్య వృత్తిలో ఉన్నాను. కిడ్నీ దానం, దాని తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలుసు. అందుకే అన్నయ్యకు కిడ్నీ ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నాను. రాఖీకి అన్నయ్య నుంచి గిఫ్ట్ తీసుకోకుండా ఆయనకే జీవితాన్ని బహుమతిగా ఇచ్చాను’’ అని 51 ఏళ్ల డాక్టర్ సుజాత దేవ్ చెప్పారు. ‘‘నేను సుజాతకు థ్యాంక్స్ చెప్పిచేతులు దులుపుకోలేను. ఎందుకంటే ఆమె నేను తిరిగిచేయలేని సాయం చేసింది. సాధారణంగా రక్షాబంధన్‌కు అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇస్తుంటారు. ఈ రాఖీకి నా చెల్లి తన కిడ్నీని దానం చేసి జీవితాన్నే అతిపెద్ద బహుమతిగా ఇచ్చింది’’ అని సుదీప్ కుమార్ చెప్పారు. -
అన్నకు రాఖీ కట్టి వెళ్తూ.. అనంతలోకాలకు
సాక్షి, మొయినాబాద్(రంగారెడ్డి) : అన్నా చెల్లిలి అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. అన్నయ్యా.. నువ్వే నాకు రక్ష అంటూ చెల్లెలు రాఖీ కట్టింది. అన్నకు రాఖీ కట్టి తిరిగి ఇంటికి వెళ్తూ ఆ చెల్లెలుతో సహా ఆమె భర్త, కూతురు దుర్మరణం చెందిన సంఘటన చేవెళ్ల–శంషాబాద్ రోడ్డులో కేతిరెడ్డిపల్లి గేటు సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలం సుభాన్‌పూర్ గ్రామానికి చెందిన పోచారం బాల్‌రెడ్డి(40), అతని భార్య జ్యోతి(35), కూతురు సిరి(11), కుమారుడు సాయిచరణ్ గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా చేవెళ్లకు బైక్‌పై వెళ్లారు. జ్యోతి తన అన్నయ్య శ్రీనివాస్‌రెడ్డికి రాఖీ కట్టింది. సాయంత్రం 6 గంటలకు సుభాన్‌పూర్ వెళ్లేందుకు చేవెళ్ల నుంచి నలుగురు బైక్‌పై బయలుదేరారు. 6:30 గంటలకు చేవెళ్ల–శంషాబాద్ రోడ్డులో కేతిరెడ్డిపల్లి గేటు సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన జేసీబీ బైక్‌ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా బైక్‌తో సహా నలుగురిని తోసుకుంటూ జేసీబీ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. జేసీబీ కింద నలిగిపోయిన భార్యభర్తలు బాల్‌రెడ్డి, జ్యోతి, వారి కూతురు సిరి అక్కడికక్కడే మృతిచెందారు. జేసీబీ కింద ఇరుక్కుని ఉన్న సాయిచరణ్ కాపాడండి అంటూ కేకలు వేయడంతో రోడ్డుపై వెళ్తున్న వారు గమనించారు. అప్పటికే జేసీబీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు బాలుడిని జేసీబీ కింది నుంచి బయటకు తీసి చికిత్స కోసం స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. జేసీబీ అతివేగంతోనే... కేతిరెడ్డిపల్లి గేటు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి జేసీబీ అతివేగం, డ్రైవర్ అజాగ్రత్తే కారణంగా తెలుస్తుంది. జేసీబీని గంటకు 20 కిలోమీటర్ల స్పీడ్‌తో నడపాలి. కానీ జేసీబీ డ్రైవర్ అతివేగంతో వెళ్తుండగా ఎదురుగా బైక్ వస్తున్నా అదుపు చేయలేకపోయాడు. బైక్‌ను ఢీకొట్టి రోడ్డు కిందకు ఈడ్చుకెళ్లడంతో వారు జేసీబీ కింద నలిగిపోయి మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో జేసీబీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. రెండు గ్రామాలో విషాదం... అన్నకు రాఖీ కట్టి తిరిగి వెళ్తూ ముగ్గురు మృతిచెందిన సంఘటనతో రెండు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. మృతుల స్వగ్రామం మహేశ్వరం మండలం సుభాన్పూర్తోపాటు జ్యోతి తల్లిగారు గ్రామం చేవెళ్లలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. రాఖీ పండుగరోజు ముగ్గురు మృతి చెందడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
బస్సులోనే డ్రైవర్‌కు రాఖీ కట్టిన చెల్లెలు
సాక్షి, కరీమాబాద్(కరీంనగర్) : హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్న గట్టు కృష్ణవేణి తన అన్నయ్యకు రాఖీ కట్టుందుకు వరంగల్ అర్బన్ జిల్లాలోని ఉర్సుకు గురువారం వచ్చింది. అయితే ఆమె సోదరుడు ఆర్టీసీ లోకల్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న గడ్డం జితేందర్ అప్పటికే డ్యూటికీ వెళ్లాడు. ఈ క్రమంలో కృష్ణవేణి అన్నయ్యకు ఫోన్‌చేయగా.. వరంగల్ బస్టాడ్ ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో ఆమె అక్కడికే వెళ్లి బస్సులోనే రాఖీ కట్టి తన ఆనందాన్ని పంచుకుంది. -
చెల్లెళ్లకు కేజ్రీవాల్ రాఖీ గిఫ్ట్
న్యూ ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్(డీటీసీ), క్లస్టర్ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రక్షా బంధన్ శుభదినాన నా చెల్లెళ్లకు రాఖీ కానుక ఇవ్వాలనుకుంటున్నాను. అక్టోబర్ 29నుంచి వాళ్లు డీటీసీ, క్లస్టర్ బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది వారి రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏసీ, నాన్ ఏసీ రెండు సర్వీసుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంద’’ని తెలిపారు. డీటీసీ, క్లస్టర్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై కేజ్రివాల్ గత కొద్దినెలలుగా ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళల రక్షణ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం ఈ డిసెంబరు నాటికి ఢిల్లీ వ్యాప్తంగా 70 వేల సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులను ఆదేశించారు. -
మహిళలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు: ఏపీ డీజీపీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ రక్షా బంధన్ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం డీజీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు జరిగాయి. డీజీపీకి మహిళా మిత్ర సభ్యులు, గురుకుల పాఠశాల విద్యార్థినులు, వృద్ధులు రాఖీలు కట్టి.. రాఖిపూర్ణిమ, స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రక్షణకి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా మిత్ర ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
సోదరులకు రక్షాపూర్ణిమ
శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం అంటే తెలియని వారు ఉండవచ్చునేమో కానీ, రాఖీపండగ అంటే తెలియని వారుండరు. చిన్న నుంచి పెద్ద వరకు పురుషులందరి చేతులూ రకరకాల రాఖీలతో తళతళ మెరిసిపోతుంటాయి. శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనాడు సోదరి చేత రక్ష కట్టించుకుంటే దేవతలందరి రక్షణ కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న విశ్వాసం. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. వివాహ సమయంలో అప్పగింతల కార్యక్రమం కూడా శుక్రవారం గడిచే దాకా ఆగి ఆ తర్వాతనే పూర్తి చేస్తారు. సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారు. ఈవేళ ఇలా చేయాలి శ్రావణపూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానం చేసి, మనం ఎవరి రక్షణ అయితే కోరుకుంటున్నామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు మనఃపూర్వకంగా ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి గల ఈ రక్షికకీ పూజ చెయ్యాలి. అంటే పూజాశక్తిని రాఖీలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని సోదరుడు లేదా సోదర సమానంగా భావించిన వ్యక్తి ముంజేతికి కడుతూ– నేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను అని మనసు నుండా భావన చేసుకుని ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఆ తర్వాత తీపి తినిపించాలి. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల! రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ సోదరుడు లేదా మిత్రునికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. రక్షాబంధనం కట్టించుకున్న సోదరుడు ఆ సంవత్సరకాలంపాటూ ఆమెకి అన్నింటా అండగా నిలవాలి. ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమేననీ పౌరాణిక, చారిత్రక గాథల ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజించిన సూత్రాన్ని పురోహితుడు ఆ దేశపు రాజు ముంజేతికి ముడి వేసేవాడు. క్రమేపీ ఇది కేవలం సోదరీ సోదరులకు మాత్రమే పరిమితమైన బంధంగా ముడిపడింది. తన సోదరుని జీవితం ఎల్లప్పుడూ తియ్యగా ఉండాలని, తలపెట్టే ప్రతికార్యం విజయవంతం కావాలని, అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే– ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలిచినప్పుడే ఈ పండుగకు సార్థకత. – డి.వి.ఆర్. -
నూలుపోగుల వెన్నెల
రాఖీపూర్ణిమ అంటే తెలియని వారుండరు. పేరు తెలిసినా ఆ పండుగ నాడేం చేయాలో రాఖీ కట్టడంలో ఏ అభిప్రాయం దాగుందో తెలిసినవారు దాదాపు ఉండరు. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనాడు సోదరి చేత రక్ష కట్టించుకుంటే దేవతలందరి రక్షణ కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న విశ్వాసం. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. వివాహ సమయంలో అప్పగింతల కార్యక్రమం కూడా శుక్రవారం గడిచే దాకా ఆగి ఆ తర్వాతనే పూర్తి చేస్తారు. సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో దీనిని నారికేళ పూర్ణిమగా జరుపుకుంటారు. ఈవేళ ఇలా చేయాలి: శ్రావణ పూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానం చేసి, మనం ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి గల ఈ రక్షికకీ పూజ చెయ్యాలి. అంటే పూజాశక్తిని రాఖీలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని సోదరుడు లేదా సోదర సమానంగా భావించిన వ్యక్తి ముంజేతికి కడుతూ– స్థితిMనేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను అని మనసు నుండా బావన చేసుకుని ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఆ తర్వాత తీపి తినిపించాలి. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల! రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికాశక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ సోదరుడు లేదా మిత్రునికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. దీనిని బట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమేననీ తెలుస్తోంది. రక్షాబంధనం కట్టించుకున్న సోదరుడు తాత్కాలికంగా బహుమతులు ఇచ్చి ఊరుకోకుండా ఆ సంవత్సరకాలంపాటూ ఆమెకి అండగా నిలవాలి. ఒకప్పుడు తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజింపబడిన రక్షికని కుల పురోహితుడు (ఇంటి పురోహితుడు) ఆ దేశపు రాజు లేదా గ్రామ పెద్ద ముంజేతికి ముడి వేసేవాడు. ఇప్పుడు ఈ రక్షిక రకరకాల ఆకారాలలోకి మారింది. ఏమైనా, ఈ రక్షిక అనేది సంవత్సరకాలం ఉంచుకోవలసిన బంధం. తన సోదరుని జీవితం తీపివలె ఎల్లప్పుడూ కమ్మగా ఉండాలని, తలపెట్టే ప్రతికార్యం విజయవంతం కావాలని, అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఈ పండుగ నుంచి గ్రహించవలసినది ఒకటే– అదేమంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలిచినప్పుడే ఈ పండుగకు సార్థకత. -
సియాచిన్ జవాన్లకు స్మృతి రాఖీ
జమ్మూ/తవాంగ్: కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లు గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ సరిహద్దుల్లోని సైనికులకు రాఖీ కట్టారు. ప్రపంచంలోనే ఎత్తై యుద్ధభూమి సియాచిన్‌లో స్మృతి రాఖీ కట్టి, సైనికుల కృషిని అభినందించారు. సియాచిన్లోని ఒక మంచుదిబ్బ అంచున ఉన్న బేస్క్యాంపుకు ఆమె ఉదయం 9.22 గంటలకు ఆకాశమార్గంలో చేరుకున్నారు. సియాచిన్ యుద్ధ స్మారకం వద్ద స్మృతి పూలమాల ఉంచారు. తర్వాతజవాన్లనుద్దేశించి మాట్లాడారు. స్వలాభం, కుటుంబాల గురించి ఆలోచించకుండా సేవ చేస్తున్న సైనికులు దేశానికి గర్వకారణమన్నారు. తన తల్లి స్వయంగా తయారుచేసిన మిఠాయిలను సైనికులకు పంచిపెట్టారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుణాచల్‌ప్రదేశ్ తవాంగ్ జిల్లా లుమ్లాలో సైనికులకు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమం రూపొందించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా మంత్రులను సరిహద్దులకు పంపి, కచ్చితంగా సైనికులకు రాఖీ కట్టేలా మోదీ చూశారనీ, తద్వారా మహిళలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందనే సందేశాన్ని జాతికి ఇచ్చారని ఆమె కొనియాడారు. -
రక్షాబంధనం సోదర ప్రేమకు రక్ష
ఆగస్టు 18 రాఖీ పౌర్ణమి ఒకసారి రాక్షసులు దేవతలపై దండెత్తారు. దేవరాజు ఇంద్రుడు రాక్షసులతో తీవ్రంగా పోరాడాడు. ఈ పోరులో రాక్షసులదే పైచేయిగా మారింది. ఇంద్రుని బలం క్షీణించి అలసి సొలసి స్పృహతప్పి నేలపైకి ఒరిగిపోయాడు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ఆపి, రాక్షసులకు లొంగిపోవటం శ్రేయస్కరమని దేవగురువు బృహస్పతి హితవు పలికాడు. మహేంద్రుని భార్య శచీదేవి యుద్ధం లో విజయం సాధించడానికి తన పతికి తగిన బలం ప్రసాదించవలసిందని త్రిమూర్తులను ప్రార్థిస్తూ ఒక రక్షాబంధనాన్ని భర్త చేతికి కట్టి, ఆయనను ఉత్సాహపరుస్తూ, తిరిగి యుద్ధానికి పురికొల్పింది. రక్షాబంధన ధారణతో నూతనోత్తేజం పుంజుకున్న ఇంద్రుడు ఈసారి యుద్ధంలో అవలీలగా రాక్షసులను జయించాడు. రక్షాబంధన ప్రాశస్త్యాన్ని గుర్తించిన దేవతలు ఆనాడు శ్రావణ పూర్ణిమ కావడంతో నాటినుంచి ప్రతి శ్రావణ పూర్ణిమనాడూ ఎవరి శ్రేయస్సునైతే తాము కాంక్షిస్తున్నామో వారికి బలాన్ని, శక్తిని ప్రసాదించి, రక్షణనివ్వవలసిందిగా కోరుతూ వారి ముంజేతికి రక్షాకంకణాన్ని కట్టడం ఆచారంగా మారింది. దుష్టశక్తుల పీడ లేకుండా, వాహన ప్రమాదాలు, తదితర విపత్తుల బారినుంచి కాపాడి భగవంతుడు ఈ సంవత్సరమంతా మీకు రక్షగా నిలవాలని కాంక్షిస్తూ ఎంతో దూరాభారాలకు ఓర్చి పుట్టింటికి వచ్చి సోదరుల చేతికి రక్షాబంధనం కట్టడం, వారికి తీపి తినిపించడం, ‘నీకు అండగా నేనున్నాను’ అని అభయమిస్తూ సోదరులు వారి శక్తికొలది పసుపు కుంకుమలు, చీరసారెలతో సత్కరించే ఆచారంగా రూపుదిద్దుకుంది. రాఖీ ఇలా కట్టాలి శ్రావణ పూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానవిధిని పూర్తి చేయాలి. ఎవరిని రక్షించదలిచామో- అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి ఉన్నది ఇక్కడ రక్షికకి. కాబట్టి దీనికీ పూజ చెయ్యాలి. అంటే పూజ ద్వారా దైవశక్తిని దానిలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. ఈ రక్షికని ఒక సంవత్సర కాలంపాటు- మనం ఎవరిని రక్షించడానికి అండగా నిలువదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి బహిరంగ ప్రదేశంలో కడుతూ- ‘తప్పక అండగా నిలుస్తానని ప్రమాణం చేస్తున్నా’నంటూ - బంధుస్నేహితుల మధ్య ప్రకటించి ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఇలా కట్టడాన్ని అపరాహ్ణసమయంలో (అహ్నం అంటే పగలు. అపరం అంటే మధ్యాహ్నం 12 దాటాక. కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుండి 3 గంటల మధ్య అని అర్థం) మాత్రమే చేయాలి. ఈ విధానాన్ని గర్గ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమేనని తెలుస్తోంది. రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని ఇక వదిలేయకూడదు. మాటకి కట్టుబడి ఆ సంవత్సరకాలం పాటూ ఆమెకి అండగా నిలవాలి. మరో ముఖ్య విశేషమేమిటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే కట్టాలనే నియమం లేదు. స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే. రక్షాబంధనం కట్టే సమయంలో ఈ కింది శ్లోకం చదవాలి. యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే! మా చల మాచల! రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికా శక్తి నాలో ప్రవేశించిన నేను కూడా ఈ మిత్రునికి లేదా మిత్రురాలికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. రాజుల కాలంలో తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజించిన రక్షికని కుల పురోహితుడు (ఇంటి పురోహితుడు) ఆ దేశపు రాజు ముంజేతికి ముడి వేసేవాడు. చక్కని సూచనలనిస్తూ ఉపాయాలు చెప్తూ రక్షిస్తూ ఉంటానని భావం. ఈ సంప్రదాయాన్ని ఒక పండుగలా జరుపుకోవడంతో మాత్రం సరిపెట్టకూడదు. అందులోని అంతస్సూత్రాన్ని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే సామాజిక శ్రేయస్సు పరిఢవిల్లుతుంది. - డి.వి.ఆర్. రాఖీ కట్టడం పూర్తయింది కదా అని వదిలేయకూడదు. మాటకి కట్టుబడి ఆ సంవత్సరకాలంపాటూ ఆమెకి అన్నింటా అండగా నిలవాలి. ఇది స్త్రీలకి స్త్రీలూ పురుషులకి పురుషులూ కూడా కట్టుకోవచ్చు, అలా అండగా నిలవాలనే పవిత్రోద్దేశ్యం ఉంటే..! -
మీ సోదరుడికి రాఖీ కట్టారా?...
హైదరాబాద్: అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రాఖీ. అన్నా చెల్లెల్ల అనుబంధానికి.. అక్కా, తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.. నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. కష్టసుఖాల్లో ఒకరికొకరం సంరక్ష.. అనే అభయాన్ని తోబుట్టువులకిచ్చే పండుగే రాఖీ. కులమతాలకు అతీతంగా.. ఆప్యాయతలకు అతి దగ్గరగా.. సోదర, సోదరీమణులు ఈ ఉత్సవాన్ని అపురూపంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజంతా ఇంటింటా రాఖీ ఆనందోత్సాహాలు వెల్లివిరియనున్నాయి. రక్షానుబంధాలు పరస్పరం మనసులను తడుమనున్నాయి. రాఖీ సందర్భంగా మీ సోదరి మీకు రాఖీ కట్టిందా? మీ సోదరుడికి మీరు రాఖీ కట్టారా? అయితే ఆ ఫొటోలను వివరాలతో పాటు మాకు పంపండి. అలాగే ప్రాంతం పేరు, మీ పేరుతో sakshinetduty@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి పంపండి. వాటిని మీ వివరాలతో గ్యాలరీ రూపంలో అందిస్తాం. -
వాహ్..తీజ్
గిరిజన ఆడపడుచుల సంప్రదాయ ఉత్సవం ఏటా రాఖీ పౌర్ణమితో షురూ.. తండాల్లో కొనసాగుతున్న తీజోత్సవం.. ఉట్నూర్ : గిరిజన ఆడపడుచుల సంప్రదాయ ఉత్సవం తీజోత్సవం ఆరంభమైంది. జిల్లాలోని గిరిజన తండాల్లో ఉత్సవాలను గిరిజనులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏటా రాఖీ పౌర్ణమితో ఆరంభమయ్యే ఈ పండుగ.. శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు కొనసాగుతుంది. తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ తీజ్ ఉత్సవాల్లో గో ధుమలు వినియోగించడం ఓ ప్రత్యేకమైతే.. తీజ్ అంటే పచ్చదనం అనే అర్థం ఉండడం మరో విశేషం. తండాల్లో కొనసాగుతున్న తీజ్ సంబరాలపై ఈ వారం సండే స్పెషల్.. ఉత్సవంలో భాగంగా తొమ్మిదో రోజు సాయంత్రం తండా పెద్ద(నాయక్) ఇంటి ఎదుట మొలకెత్తిన గోధుమ బుట్టల్లో నుం చి కొన్ని గోధుమ మొలకలను తండా పెద్దల తల పాగాల్లో పెడుతారు. ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బు ట్టలను నెత్తిన పెట్టుకుని సంప్రదాయ పద్ధతుల్లో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ తండా శివారుల్లో ఉండే నీటి వనరుల్లో వాటిని నిమజ్జనం చేస్తారు. అయితే ఈ క్రమంలో వచ్చే ఏడాది తాము తీజ్ ఆడుతామో లేదోననే ఆందోళన పెళ్లి యువతుల్లో కనిపిస్తుంది. అంతకుముందు గ్రామంలో పెళ్లి కాని గిరిజన యువకులు చేతుల్లో పీడీయాను పట్టుకుని ఉంటారు. పెళ్లి కాని యువతులు ఆ యువకుల చేతిలోని పీడీయాను వివిధ ప్రయత్నాలు చేస్తూ విడిపిస్తారు. అయితే పీడీయా పట్టుకున్న వ్యక్తి ఇంటి పేరు విడిపించే యువతుల ఇంటి పేర్లు ఒక్కటి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాకుండా బుట్టలను నెత్తిన ఎత్తుకున్న యువతుల పాదాలను ఆమె సోదరులు నీళ్లతో కడిగి ఆశీర్వాదం పొందుతారు. ‘‘ఈ తీజ్ ఉత్సవాల ద్వారా యువతులు కోరుకున్న కోరికలు తీరుతాయని, తండాల్లో అందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా గడుపుతారని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని గిరిజ న పెద్దలు చెబుతుంటారు.’’ ఈ వేడుకల్లో పెళ్లికాని యువతులే పాల్గొనడం విశేషం. ఏటా రాఖీపౌర్ణమి రోజు నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు తీజ్ ఉత్సవాలు జరుగుతాయి. పెళ్లికాని యువతులు, చిన్నారులు తొమ్మిది రోజులపాటు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ముందుగా తండాల్లో పెద్దలు ప్రతి ఇంటి నుంచి గోధుమలు సేకరిస్తారు. చిన్న చిన్న వెదురు బుట్టలు కొనుగోలు చేస్తారు. సేకరించిన గోధుమలను రోజంతా నీళ్లలో నానబెడుతారు. పెళ్లి కాని యువతులు తండాలకు సమీపంలో చీమల పుట్ట మన్ను(మకొడ ధూడ్) తీసుకువచ్చి వెదురు బుట్టల్లో నింపుతారు. రాఖీపౌర్ణమి రోజున ఆ బుట్టల్లో ప్రత్యేక పూజలతో గోధుమలు మొలకెత్తడానికి చల్లుతారు. అనంతరం తండా పెద్ద ఇంటి సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచె, పందిరిపై స్థలంలో బుట్టలు పెడుతారు. యువతులు ఉపవాస దీక్షతో ప్రతీరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పవిత్ర జలాలు పోస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఎనిమిది రోజుల పాటు సాయంత్రం వేళ గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉత్సవం నిర్వహిస్తుంటారు. -
నేతల ‘రాఖీ’ బంధం
-
ఇద్దరు స్నేహితురాళ్ల ఆత్మహత్య
వత్సవాయి/పెనుగంచిప్రోలు : చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. కష్టసుఖాలు పంచుకున్నారు. చివరకు ఆ ఇద్దరు స్నేహితురాళ్లు కలిసే కన్నుమూశారు. రాఖీ పౌర్ణమిరోజు జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. వత్సవాయి మండలం మక్కపేటకు చెందిన ధారావతు అరుణ(24), పెనుగంచిప్రోలుకు చెందిన సిరిపురపు సునీత(25) చిన్ననాటి నుంచే స్నేహితులు. ఇద్దరూ పదో తరగతి వరకు పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. అరుణ ఎమ్మెస్సీ, సునీత బీఎస్సీ పూర్తిచేశారు. ప్రస్తుతం అరుణ మక్కపేటలోని ఆర్సీఎం పాఠశాలలో విద్యావాలంటీర్‌గా పనిచేస్తోంది. సునీత నందిగామలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరికీ వివాహాలైనప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల తమతమ భర్తల నుంచి విడాకులు పొందారు. సునీతకు రెండు నెలల క్రితమే హైదరాబాద్‌కు చెందిన యువకుడితో రెండో వివాహమైంది. వారి దాంపత్యజీవనం అన్యోన్యంగా సాగుతోంది. సినిమా చూసేందుకు వెళ్లి.. ఈ క్రమంలో ఆదివారం అరుణ, సునీత కలిశారు. రాఖీ పండుగను పురస్కరించుకుని సినిమా చూసేందుకు పెనుగంచిప్రోలులోని ఓ థియేటర్‌కు వెళ్లారు. ప్రేక్షకులు లేని కారణంగా సినిమా వేయకపోవడంతో ఇద్దరు కలిసి మక్కపేటలోని అరుణ ఇంటికి చేరుకున్నారు. అరుణ తల్లిదండ్రులు కూలిపనులకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో లోపలికి వెళ్లిన ఇద్దరు తలుపునకు గడియపెట్టారు. పెనుగంచిప్రోలులో కొనుగోలుచేసిన కూల్‌డ్రింక్ బాటిల్లో ఇంట్లో ఉన్న పురుగుల మందును కలుపుకుని ఇద్దరూ తాగారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో అరుణ తండ్రి భాస్కరరావు కూలి పనులు ముగించుకుని ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు వేసి ఉండటంతో ఎన్నిసార్లు పిలిచినా లోపలి నుంచి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే అరుణ మృతిచెందింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సునీతను 108 అంబులెన్స్‌లో జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించింది. అరుణ, సునీత అత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఇద్దరు స్నేహితుల మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనాస్థలాన్ని వత్సవాయి ఎస్ఐ ఆర్.ప్రసాదరావు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. -
గర్భశోకం
గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణానదిలో మృతదేహాలు లభ్యం పెనమలూరు, చోడవరం, తాడిగడపల్లో విషాదఛాయలు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మృత్యుఘోష వారు ముగ్గురు ప్రాణస్నేహితులు. రోజూ కలిసే కళాశాలకు వెళ్లి వస్తుంటారు. చదువులోనూ ముందంజలో ఉంటారు. ఏమైందో తెలియదు కానీ ముగ్గురూ కలిసే కృష్ణమ్మ ఒడిలో తనువు చాలించారు. తమపైనే ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిల్చారు. తెల్లారితే రాఖీ పండుగ.. చిన్నారి చెల్లి పూజిత వచ్చి రాఖీ కడుతుందని అన్నయ్య ఎదురు చూస్తున్నాడు.. పల్లవక్క వచ్చి రక్షాబంధనం చేస్తుందని చిన్నారి తమ్ముడు నిరీక్షిస్తున్నాడు. కానీ వారి నిరీక్షణ ఫలించలేదు. పూజిత, పల్లవి.. ఇద్దరూ విగతజీవులై ఇంటికి రావటం ఆ అన్నదమ్ములతోపాటు కుటుంబ సభ్యులకూ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ/తాడేపల్లి రూరల్/మంగళగిరి : కళాశాలకు వెళ్తున్నామని ఇంటి నుంచి బయలుదేరిన ముగ్గురు స్నేహితులు కలిసే మృత్యు ఒడికి చేరారు. కన్నవారి కలలను కల్లలు చేస్తూ కడుపుకోతను మిగిల్చారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు నిర్జీవంగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెనమలూరుకు చెందిన బిళ్ల పల్లవి(18), చోడవరానికి చెందిన సరిపూడి పూజిత(17), తాడిగడప సెంటర్ సమీపంలో నివసించే యలమంచిలి నాగలక్ష్మి బందరు రోడ్డులోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూపు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పూజిత, పల్లవి ఇద్దరు పదో తరగతి వరకు పెనమలూరులోని ఓ పాఠశాలలో కలిసే చదువుకున్నారు. శనివారం ఉదయం యథావిధిగా ఇంటి నుంచి బయలుదేరిన ఈ ముగ్గురు కళాశాలకు వెళ్లలేదు. దీంతో కళాశాల ప్రతినిధులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పల్లవి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను కలిసి వెళ్లారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థినులు శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణానది ఇసుక తిన్నెలపైకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్దిసేపటి తర్వాత వారి బ్యాగులు మాత్రమే కనిపించగా, విద్యార్థినుల ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకుని బ్యాగులు స్వాధీనం చేసుకున్న పోలీసులకు ఆదివారం ఉదయం మృతదేహాలు లభించాయి. తల్లిదండ్రులు సంఘటనా స్థలికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. చిట్టీ తల్లీ..! చీకటంటే భయం కదే..! : ‘ఎంత పని చేశావు బిడ్డా.. నాన్న, చెల్లి, నేను.. గుర్తుకురాలేదా? కాస్త దూరం నడిస్తే కాళ్లు నొప్పులమ్మా.. అంటూ ఏడ్చేదానివిగా, ఇంతదూరం నడుచుకుంటూ ఎలా వచ్చావమ్మా? నువ్వు చనిపోలేదు, నన్ను ఏడిపించేందుకే ఇలా చేస్తున్నావు, లేమ్మా.. నీకు చీకటి అంటే భయంగా కదా! కరెంటు పోతే ‘కెవ్వుమని కేకేసేదానివి కదా..! రాత్రి చీకటిలో నీళ్లలో తడుస్తూ ఎలా ఉన్నావమ్మా..’ అంటూ నాగలక్ష్మి తల్లి మాధవి బోరున విలపించారు. చీర చెంగుతో బిడ్డ మొహం తుడుస్తూ లేపేందుకు ఆమె ప్రయత్నించటం అందరినీ కలచివేసింది. నాగలక్ష్మి తండ్రి శ్రీనివాసరావు విజయవాడ ఆటోనగర్‌లో పనిచేస్తున్నారు. తల్లి మాధవి గృహిణి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయి నాగలక్ష్మి 11 గంటలకే ఇంటికి వచ్చింది. 4.30 గంటలకు కూడా ఫోన్లో మాట్లాడింది. ఇంట్లోనే ఉన్నానంటూ హైదరాబాద్‌లోని మేనమామకు, తల్లికి చెప్పింది. తర్వాత బయటకెళ్లిన ఆమె చీకటిపడ్డా కనిపించకపోవడంతో కంగారుపడిన తండ్రి ఫోన్‌చేసి చెప్పడంతో మాధవి ఫ్రెండ్స్, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. సమాచారం దొరక్కపోవడంతో వెంటనే బయలుదేరి పెనమలూరు వచ్చారు. ఇంతలోనే పోలీసులు ఫోన్ చేసి విషయం చెప్పారు. తెల్లారాక ఫిర్యాదు చేద్దామనుకుంటే : మృతుల్లో ఒకరైన సరిపూడి పూజితకు తండ్రి లేడు. ఏడేళ్ల క్రితమే మరణించారు. అమరావతి మండలం లింగాపురం సొంతూరు. పూజిత తండ్రి మరణించడంతో పిల్లలకు మంచి చదువులు చదివించాలని పెనమలూరు మండలం చోడవరంలోని బంధువుల దగ్గరకు వచ్చి ఉంటున్నారు. శనివారం పూజిత రాలేదని కాలేజి నుండి ఫోన్ రాగా తల్లి శివనాగలక్ష్మి కంగారు పడ్డారు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లిందేమోనని సరిపెట్టుకున్నారు. చీకటిపడ్డా రాకపోవడంతో కంగారుపడ్డారు. తెల్లవారేదాకా చూసి పోలీసులకు ఫిర్యాదు ఇద్దామనుకుంటే ఇంతలోనే విషయం తెలిసి భోరున విలపించారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదు..: బిళ్లా పల్లవి తండ్రి రాంబాబు ఎలక్ట్రీషియన్. ఇంటికి ఒక్కతే ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. శనివారం కాలేజీకి రాలేదంటూ ఫోన్ రావడంతో కంగారుపడిన తండ్రి స్నేహితులు, బంధువులను విచారించారు. చీకటిపడ్డా రాకపోవడంతో పోలీసుస్టేషన్‌కు వెళ్లగా వారు ఫిర్యాదు స్వీకరించలేదు. ఉ. 10 గంటలకు అమ్మాయి ఫొటో తెస్తే ఎంక్వైరీ చేస్తామని పోలీసులు చెప్పారని రాంబాబు చెప్పారు. రాత్రంతా ఆందోళనతో గడిపానని, తెల్లరేసరికి మరణవార్త విన్నామని గొల్లుమన్నారు. తల్లిదండ్రులకు మృతదేహాలు అప్పగింత కాగా, ముగ్గురు విద్యార్థినుల మృతదేహాలకు వారి తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో మంగళగిరి సీఐ హరికృష్ణ, తాగేపల్లి ఎస్ఐ వినోద్‌కుమార్‌లు పంచనామా నిర్వహించారు. పంచనామా, పోస్టుమార్టం అనంతరం విద్యార్థినుల మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు. యలమంచిలి నాగలక్ష్మి, బిల్లా పల్లవి అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. పూజిత మృతదేహాన్ని అమరావతి సమీపంలోని లింగాపురానికి తీసుకెళ్లారు. సోమవారం ఆమె అంత్యక్రియలు చేస్తారు. తల్లిదండ్రులకు సమాచారమిచ్చాం : కళాశాల ప్రిన్సిపాల్ ముగ్గురు విద్యార్థినులు శనివారం కళాశాలకు రాలేదని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని సదరు కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. దీంతో పల్లవి తల్లిదండ్రులు వెంటనే కళాశాలకు వచ్చి ఆరా తీశారని చెప్పారు. నాగలక్ష్మి తండ్రి తమ కుమార్తెకు బాగోలేదని చెప్పినట్లు తెలిపారు. పల్లవి, నాగలక్ష్మి శుక్రవారం కూడా కళాశాలకు రాలేదని, ఆ సమయంలో గుడికి వెళ్లినట్లు తల్లిదండ్రులు చెప్పారని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మరణించిన ముగ్గురు విద్యార్థినులు చదువులో కూడా ముందంజలో ఉంటారని వివరించారు. ఇతర కారణాలు తమకు తెలియవని పేర్కొన్నారు. -
నేడు రాఖీ పౌర్ణమి
అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. వినడానికైనా.. పిలవడానికైనా.. నాలుగే వరసలు.. కానీ ఇవి నాలుగు తరాలపాటు ఒకరికి ఒకరు ఉన్నాం అనే ధీమానిచ్చే బంధాలు. బతికున్నంత కాలం ఆ బతుకుకు భరోసానిచ్చే అనుబంధాలు. అడుగడుగునా సంరక్ష ణనిచ్చే నమ్మకాలు. దేవుడే దిగొచ్చి ముచ్చటపడేలా చేసే ఆశ్చర్యాల సాక్ష్యాలు. అందుకే అంటారు... అన్నా చెల్లెల్ల అనుబంధానికి.. అక్కా, తమ్ముళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.. నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష.. కష్టసుఖాల్లో ఒకరికొకరం సంరక్ష.. అనే అభయాన్ని తోబుట్టువులకిచ్చే పండుగే రాఖీ. కులమతాలకు అతీతంగా.. ఆప్యాయతలకు అతి దగ్గరగా.. సోదర, సోదరీమణులు అపురూపంగా జరుపుకుంటారు ఈ ఉత్సవాన్ని. ఈ నేపథ్యంలో ఈ రోజంతా ఇంటింటా రాఖీ ఆనందోత్సాహాలు వెల్లివిరియనున్నాయి. రక్షానుబంధాలు పరస్పరం మనసులను తడుమనున్నాయి. ఎక్కడున్నా సోదరుల ఇంటికి.. ఆదిలాబాద్ కల్చరల్ : పెళ్లయి అత్తారింటికి వెళ్లిన అక్కాచెల్లెళ్లు రాఖీ కట్టేందుకు పండుగ రోజున సోదరుల ఇంటికి వస్తారు. ఎంత దూరన ఉన్నా పండుగ రోజు రావడం ఆనవాయితీ. ఎవరైన రాలేని పక్షంలో కొరియర్, పోస్టు ద్వారా రాఖీలు పంపి అనుబంధాన్ని పంచుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో స్థిరపడిన వారు కొరియర్ ద్వారా రాఖీలు పంపి ఆనవాయితీని కొనసాగిస్తారు. ఈ పండుగను వేర్వేరు చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తారు. మన రాష్ట్రంలో జంధ్యాల పూర్ణిమగా, కేరళలో వేదాధ్యయనంగా ప్రారంభించే అవని అవిక్టంగా, తమిళనాడులో పూనూల్ పర్వగా జరుపుకుంటారు. మార్కెట్లో సందడే సందడి ఆదిలాబాద్ కల్చరల్ : రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని సోదరులకు కట్టేందుకు అందమైన రాఖీలను మనసుకునచ్చిన పలు రకాల రాఖీలు కొనుగోలు చేసేందుకు మహిళలు, యువతులు, బాలికలు శనివారం బిజిబిజీగా గడిపారు. జిల్లాలోని రాఖీ దుకాణాలు, స్టాళ్లు జనాలతో కిటకిటలాడాయి. మహిళల అభివృద్ధికి అనుగుణంగా వైవిధ్యమైన రాఖీలు వ్యాపారులు అందుబాటులో ఉంచారు. ఫ్యాన్సీ రాఖీలు కుందల్తో చేసిన డిజైన్ల రాఖీల అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. రూ.10 నుంచి మొదలుకొని రూ.500 వరకు ధరల్లో అందుబాటుల్లో లభిస్తున్నాయి. చిన్నపిల్లలను ఆకర్షించే విధంగా మిక్మౌస్, స్ప్రెడర్మన్, కార్టూన్ బొమ్మలతో కూడిన రాఖీలను అమ్ముతున్నారు. రాఖీ కట్టిన తర్వాత మిఠాయి తినపించడం ఆచారం. దీంతో మిఠాయి దుకాణాల్లో సందడి నెలకొంది. -
అనురాగ బంధం
ఒక కొమ్మకు పూసిన పువ్వుల్లాంటి అన్నాచెల్లెళ్లు ఆత్మీయ సుగంధాలు పంచుకునే వేడుక రాఖీ పండుగ. మమతానురాగాలకు ఈ రక్షాబంధనం చిహ్నం. అమ్మలోని మొదటి అక్షరాన్ని.. నాన్నలోని చివరి అక్షరాన్ని కలిపి అన్న అంటూ ఆప్యాయంగా పిలిపించుకునే సోదరుడి అనురాగ బంధం ఇది. సోదరికి భరోసాగా ఉంటానంటూ ఇచ్చే నమ్మకం... మనోధైర్యాన్ని నింపే రక్తసంబంధం. ఎప్పటిలాగే రాఖీ పండుగ వచ్చింది. మరో మధుర జ్ఞాపకాన్ని మిగిల్చేందుకు, అన్నాచెలెళ్లు, అక్కాతమ్ముళ్లు తమ అనుబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వేదికగా నిలిచింది. బాధలోనూ, సంతోషంలోనూ, కలిమిలోనూ, లేమిలోనూ.. తోడుగా నిలుస్తానంటూ చేసుకునే బాసలకు గుర్తుగా ఈ రోజు మిగలనుంది. ఎన్నో జన్మల పుణ్యఫలమైన అన్న అనురాగాన్ని, అదృష్టాన్ని సొంతం చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తోంది.రాఖీ పౌర్ణమి సందర్భంగా తమ అనుబంధాల గురించి కొందరు ఇలా వివరించారు.. - నాదెండ్ల/ తెనాలి రూరల్/నరసరావుపేట ఈస్ట్/ప్రత్తిపాడు నేడు రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల అనుబంధాల వేడుక ఇది జిల్లావ్యాప్తంగా పండుగ సందడి మార్కెట్లో ఆకట్టుకునేలా రాఖీలు ఒకరికొకరం అండగా.. ఏటా సోదరి సుభాషిణితో రాఖీ కట్టించుకుంటాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా. కానీ.. రాఖీ పౌర్ణమికి తప్పనిసరిగా తెనాలి రావాల్సిందే. మూడేళ్ల క్రితం చెల్లికి వివాహం అయి దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఉంటోంది. అయినా ఏటా క్రమం తప్పకుండా రాఖీ కట్టేందుకు వస్తుంది. నేనూ ఆ రోజు వేరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోను. ఒకరికొకరం అండగా ఉంటామనే భావనను రాఖీ పండుగ కలగ చేస్తుంది. అంతేకాక ప్రేమ, ఆప్యాయతలను మరింతగా పెంచుతుంది. - లలిత్‌కుమార్, తెనాలి మా అక్క నన్ను అమ్మలా పెంచింది... మా అక్క డాక్టర్ అన్నపూర్ణ అమ్మలా లాలించి, నాన్నలా చేయూత అందించింది. నా చిన్నతనంలోని మానాన్న కాలంచేస్తే, అప్పటినుంచి మా అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్ల బాధ్యతను మా అక్క తీసుకుంది. మా అభివృద్ధికి పాటుపడింది. మా ఇళ్లలో జరిగే అన్ని శుభకార్యాలను అక్కే పర్యవేక్షిస్తుంది. 49 ఏళ్లుగా వైద్యవృత్తిలో రాణిస్తూనే తమ కుటుంబసభ్యులకు అన్నివిధాలా తోడ్పడింది. ఏటా నాతో పాటు తమ్ముళ్లకు రాఖీ కడుతుంది. - అక్క డాక్టర్ మేదరమెట్ల అన్నపూర్ణతో తమ్ముడు పాలడుగు శ్రీనివాసప్రసాద్, పీఎన్సీ అండ్ కేఆర్ కళాశాల జాయింట్ సెక్రటరీ నరసరావుపేట అక్క దగ్గరకు వెళతా.. రాఖీ పండుగ వస్తుందంటే నేను మా అక్కయ్య వెంకట సుబ్బాయమ్మ దగ్గరికి చేరుకుంటా. నా సొంతూరు పత్తిపాడు మండలం గొట్టిపాడు. మా అక్కయ్యతో పాటు మరో అక్క కామేశ్వరమ్మ, చెల్లెలు సామ్రాజ్యమ్మలు నాదెండ్ల మండలం గణపవరంలోనే నివాసం ఉంటారు. రాఖీ పండుగ వచ్చిందంటే నేనే ఇక్కడి ఒక రోజు ముందే చేరుకుంటా. వారితో ఆనందాలు, ఆప్యాయతలు పంచుకుంటా. ఇలా 50 సంవత్సరాలుగా పండుగ జరుపుకొంటున్నాం. - గుంటుపల్లి సూర్యనారాయణ, గొట్టిపాడు మేమున్నామనే భరోసా.. నలుగురు సంతానంలో నేను ఒక్కడిని. ఇద్దరు అక్కలకు తమ్ముడిని. ఓ చెల్లికి నేను అన్నను. తరచూ మా అక్కలతో చిన్న చిన్న గొడవలు పడినప్పటికీ మా అమ్మ వారినే అరుస్తుండేది. కొంతసేపు వారితో మాట్లాడకుండా వుండేవాడిని. అనంతరం ఎప్పటిలాగే అందరితో కలిసి అల్లరి చేస్తుండేవాడిని. పెద్దయ్యాక ఏటా అక్కచెల్లెళ్లు రాఖీ పండుగరోజు అందుబాటులో ఉంటే నేరుగా వచ్చి రాఖీ కట్టేవారు. లేకుంటే రాఖీలు పంపి శుభాకాంక్షలు తెలుపుతారు. కష్ట నష్టాల్లో మేమున్నామనే భరోసా ఇవ్వడం రాఖీ పౌర్ణమి ప్రత్యేకత. ఇది అన్నాచెలెళ్లలో మనోధైర్యాన్ని నింపుతుంది. - రూరల్‌ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ పండుగలా జరుపుకొంటాం.. నాకు అక్క, చెల్లి ఉన్నారు. చిన్నతనం నుంచి నేను అల్లరి చేస్తుండేవాడిని. మా అక్క తరచూ నాతో దెబ్బలాడుతుండేది. పెద్ద అయ్యాక ఏటా రాఖీ పౌర్ణమిని మా ఇంట్లో పండుగలా జరుపుకుంటాం. అక్క, చెల్లెళ్లతోపాటు మా బంధువుల ఇళ్లల్లోని అక్క చెల్లెళ్ళు, స్నేహితులు రాఖీ కట్టేవారు. ఏటా మా ఇంట్లో ఓ ప్రత్యేకతను చాటినట్లుగా ఉంటుంది. అన్నదమ్ముళ్లు, అక్కచెల్లెళ్ల మధ్య ఉండే ఆప్యాయతకు రాఖీ పౌర్ణమి నిదర్శనం. మా గ్రామంలో ఉంటే రాఖీలు కట్టేవారు. ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉండటంతో ఏటా కొద్ది రోజులముందుగానే రాఖీలను పంపిస్తారు. వారికి గుర్తుగా రాఖీపౌర్ణమి రోజు వాటిని కట్టుకుంటాను. వారు కలిసిన సందర్భాల్లో తప్పకుండా బహుమతులను అందజేస్తుంటాను. - రాజేష్‌కుమార్, అర్బన్ ఎస్పీ అన్నాచెల్లెళ్ల అనురాగం.. తోబుట్టువుకు చివరి వరకు తోడుగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తూ రాఖీ పండుగ జరుపుకొంటారని అమ్మ చెబుతుండేది. ఏటా అమ్మానాన్నలు దగ్గరుండి నాకు చెల్లాయితో రాఖీ కట్టిస్తారు. ఈ ఆప్యాయతలు ఎప్పటికీ మరువలేనివి. - కె.విశ్వనాథ్ అన్నా, చెల్లెళ్ల అనుబంధానికి, ఆత్మీయతానురాగాలకు ప్రతీక రక్షాబంధన్. ఏటా క్రమం తప్పకుండా రాఖీ వేడుకలను జరుపుకొంటాము. అన్నయ్యకు రాఖీ కడతాను. ఇప్పుడే కాదు ఎప్పటికీ అన్నయ్య ప్రేమను మరిచిపోను. - తేజశ్విని, ప్రత్తిపాడు -
భలే గిరాఖీలు
సిద్దిపేట అర్బన్: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. ఆత్మీయ, అనుబంధాలకు ప్రతీతి.. రాఖీ. ఈ పండుగ రోజున ఆనందం అంబరమవుతుంది. ప్రతి ఇళ్లూ సంబరాలకు వేదికగా మారుతుంది. అందువల్లే పండుగకు రానురానూ ప్రాముఖ్యం ఏర్పడింది. అలాగే రాఖీలకూ డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు చిన్న స్పాంజితో పాటు బంగారు రంగు కవర్‌పై ఓ ప్లాస్టిక్ బొమ్మ ఉండే రాఖీలు అందుబాటులో ఉండేవి. కానీ మారుతున్న కాలానుగుణంగా రాఖీల్లోనూ ఎన్నో వెరైటీలు వచ్చేశాయి. మరెన్నో రకరకాల డిజైన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. దారం, దూది రాఖీలు మొదలుకొని వెండి, బంగారు కోటింగ్ రాఖీల వరకు వచ్చేశాయి. సమారు ఆరువేల రకాల డిజైన్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. కొనుగోలు దారుల ఆసక్తి మేరకు సిద్దిపేట పట్టణ వ్యాపారులు సుమారు ఎనిమిది రాష్ట్రాల నుంచి రాఖీలను దిగుమతి చేసి హోల్‌సేల్, రిటైల్‌గా విక్రయిస్తున్నారు. రాఖీ డిజైన్లలోనూ మార్పులు గతంలో నెమలి ఈకలు, పైసల, నోట్ల, దూది, స్వస్తి, హంస బిల్లలు, పొట్టి బొమ్మలు, కవర్ రాఖీలు తదితర వెరైటీలు ఉండేవి. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వెరైటీ రాఖీలు అమ్ముడుపోయేవి. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ అంతంత మాత్రంగా ఉండడం వల్ల వెరైటీ రాఖీలు ఖరీదు చేసేవారు కాదు. ఈ క్రమంలోనే 15 సంవత్సరాల క్రితం వెండికోటింగ్ రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. కొనుగోలుదారుల్లో ఆసక్తి మేరకు వ్యాపారులు ఐదు సంవత్సరాల నుంచి పలు డిజైన్లలో రాఖీలను మార్కెట్లోకి తీసుకువచ్చారు. సిద్దిపేట కేంద్రంగా... జిల్లాలో రాఖీల వ్యాపారం ఎక్కువగా సిద్దిపేట కేంద్రంగా సాగుతోంది. ప్రస్తుతం పట్టణంలో సుమారు ఆరు వేల రకాల డిజైన్లు అందుబాటులో ఉండి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. హోల్ సెల్ షాపులతో పాటు పట్టణంలో ప్రతి గల్లీలో రాఖీ విక్రయ కేంద్రాలు వెలిశాయి. రాఖీలతో పాటు ఫ్రెండ్షిప్ డే సందర్భాల్లో అవసరమయ్యే బ్యాండ్లను కూడా దుకాణాల్లో అమ్మకానికి ఉంచారు. ప్రస్తుతం రాఖీ డిజైన్లలో స్టోన్స్ ఐటెమ్స్‌కు ఆదరణ పెరిగింది. రకరకాల స్టోన్లతో పొందుపర్చిన రాఖీలు, వాటి అల్లికలు ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీ, రాజ్‌కోట్, కోల్‌కతా, అహ్మదాబాద్, సూరత్, బరోడా, ముంబై, రాజ్‌పుర తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు పలు రకాల వెరైటీలను దిగుమతి చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే వాటి ధరల్లో మార్పు అంతగా లేకపోవడంతో రాఖీలకు భలే గిరాకీ ఏర్పడింది. పట్టణం నుంచి కరీంనగర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, సదాశివపేట, గజ్వేల్, దుబ్బాక, నిజమాబాద్ తదితర ప్రాంతాలకు రాఖీలు ఎగుమతి అవుతున్నాయి. రూ.1 మొదలు రూ.1000 వరకు వివిధ రకాల రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక చిన్నారుల కోసం తయారు చేసిన చోటాభీమ్ రాఖీలు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.