న్యూ ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు అదిరిపోయే కానుక ఇచ్చారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్(డీటీసీ), క్లస్టర్ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రక్షా బంధన్ శుభదినాన నా చెల్లెళ్లకు రాఖీ కానుక ఇవ్వాలనుకుంటున్నాను. అక్టోబర్ 29నుంచి వాళ్లు డీటీసీ, క్లస్టర్ బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది వారి రక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏసీ, నాన్ ఏసీ రెండు సర్వీసుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంద’’ని తెలిపారు. డీటీసీ, క్లస్టర్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై కేజ్రివాల్ గత కొద్దినెలలుగా ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మహిళల రక్షణ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం ఈ డిసెంబరు నాటికి ఢిల్లీ వ్యాప్తంగా 70 వేల సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment