రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లు.. తీవ్ర విషాదం | Nalgonda Man Dead On Rakhi Purnima In Front Of Siblings | Sakshi
Sakshi News home page

విషాదం: మరణించిన సోదరుడి చేతికి రాఖీ కట్టిన తోబుట్టువులు

Published Sun, Aug 22 2021 4:38 PM | Last Updated on Sun, Aug 22 2021 5:07 PM

Nalgonda Man Dead On Rakhi Purnima In Front Of Siblings - Sakshi

సాక్షి, నల్లగొండ: మాడుగులపల్లి మండలం మాలగూడెంలో రాఖీ పండగనాడు విషాదం చోటుచేసుకుంది. తోడబుట్టినవాడికి రాఖీ కట్టేందుకు ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లకు తీరని శోకం మిగిలింది. శనివారం రాత్రి ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ అక్కాచెల్లెళ్ల సోదరుడు చింతపల్లి లక్ష్మయ్య ప్రాణాలు కోల్పోయాడు.

మరణించిన లక్ష్మయ్య చేతికి రాఖీ కట్టి తోడబుట్టిన బంధం విలువ తెలిపిన ఆ అక్కాచెల్లెళ్లు కన్నీరుమున్నీరయ్యారు. రాఖీ పౌర్ణమినాడు జరిగిన ఈ ఘటన గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదాన్ని నింపింది. అన్నకు రాఖీ కట్టేందుకు వారంతా నిన్ననే లక్ష్మయ్య ఇంటికి వచ్చినట్టు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement