రాఖీని ఎలా కట్టాలి?
సెల్ఫ్ చెక్
ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టేసినంత ఈజీగా ఉండదు. ఒకరి క్షేమాన్ని ఒకరు కాంక్షిస్తూ సంప్రదాయబద్ధంగా చేసుకునే తంతు ఇది. మాటల్లో చెప్పలేని అభిమానానికి దేవుని అనుగ్రహాన్ని రంగరించి వేసే ఆత్మీయబంధనం.
1. మంత్రోచ్చారణతో పూజ చేసి ఆ కుంకుమను నుదుట దిద్ది, పూజాక్షతలను తల మీద వేసిన తర్వాత మాత్రమే రాఖీని కడతారు.
ఎ. అవును బి. కాదు
2. సోదరులు తల మీద వస్త్రం ఉంచుకుని దాని మీద అక్షతలు వేయించుకోవాలి.
ఎ. అవును బి. కాదు
3. అన్నయ్యకు సోదరి హారతి ఇవ్వాలి, కర్పూరం పూర్తయ్యే వరకు వెలగనివ్వాలి.
ఎ. అవును బి. కాదు
4. కొబ్బరికాయకు నూలు దారాన్ని చుట్టి సోదరునికి ఇచ్చిన తర్వాత స్వీటు తినిపిస్తారు.
ఎ. అవును బి. కాదు
5. సంప్రదాయ రాఖీ ఎరుపు, పసుపు దారం మధ్యలో గురివింద గింజ సైజులో వెల్‌వెట్ బాల్ ఉంటుంది. దీనిని బొమ్మనిరాఖీ అంటారు.
ఎ. అవును బి. కాదు
6. ఈ పండగరోజు సోదరికి సోదరులు పాదనమస్కారం చేస్తారు.
ఎ. అవును బి. కాదు
7. ఆడపడుచు పుట్టింటికి వెళ్లి రాఖీ కట్టడానికి సాధ్యం కాని పక్షంలో సోదరులే ఆమె ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకుంటారు లేదా పోస్టులో పసుపు, కుంకుమ, రాఖీ పంపిస్తారు.
ఎ. అవును బి. కాదు
8. సోదరునికి అన్నింటిలోనూ విజయం కలగాలని, సుఖసంతోషాలతో ఉండాలని సోదరి కోరితే, ఆదుకోవడానికి నేను ఉన్నాను అని సోదరుడు తెలియచేయడమే ఈ వేడుక ఉద్దేశం.
ఎ. అవును బి. కాదు
9. ఇది పైకి సన్నటి దారంలా కనిపించినప్పటికీ మనసుకు ‘సున్నితమైన, బలమైన బంధం’ అన్న భావనను సూచిస్తుంది.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీ దృష్టిలో రక్షాబంధనం ఒక వేడుక మాత్రమే కాదు అనుబంధాల బంధనం కూడ. ఎదుటి వారి శ్రేయస్సును కోరి కట్టే రాఖీకి ప్రతిగా అవ్యాజమైన అనురాగాన్ని పొందుతున్నారనుకోవాలి.