ఆసియా అత్యంత ధనికుడిగా ఆలీబాబా జాక్‌మా
బీజింగ్: ఆసియాలోనే అత్యంత ధనికుడైన వ్యక్తిగా ఆలీబాబా ఈ-కామర్స్ అధినేత జాక్ మా నిలిచారని బ్లూమ్‌బర్గ్ సర్వే వెల్లడించింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 50 ఏళ్ల జాక్ మా ఆసియా వాసుల సంపన్నుల్లో అగ్రస్థానంలో నిలిచారని ఈ సర్వే పేర్కొంది.
2012 ఏడాది నుంచి అత్యంత సంపన్న ఆసియావాసిగా ఉన్న హాంగ్‌కాంగ్ రియల్టీ, పోర్ట్స్ టైకూన్ లి క-షింగ్ ను తోసిరాజని జాక్ మా 2,860 కోట్లడాలర్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఒక్క ఏడాదిలోనే జాక్ మా సంపద 2,500 కోట్ల డాలర్లు పెరగడం విశేషం.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 8,540 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
రిలయన్స్ ముకేశ్ అంబానీ అత్యంత సంపన్న భారతీయుడిగా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన సంపద 2,180 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ బిలియనీర్స్ ఇండెక్స్‌లో ముకేశ్ 32వ స్థానంలో నిలిచారు.