జాతి విద్వేషం, జెనోఫొబియా (ఇతర దేశస్థులపై వివక్షత) అమెరికా పౌరుల్లో రోజురోజుకీ పెరిగిపోతోంది. గత కొంతకాలంగా తమ పౌరులపై దాడులు పెరిగిపోతుండడంతో ఆసియా దేశాలు ఆందోళన చెందుతున్నాయి. సినిమా రంగంలోనూ ఆసియన్లకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలో కొంత వాస్తవం ఉందని అంటున్నాడు మార్వెల్ స్టూడియో చీఫ్ కెవిన్ ఫెయిగి.
‘‘మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ డాక్టర్ స్ట్రేంజ్(2016) సినిమా టైంలో మేము ఒక పొరపాటు చేశాం. ఏన్షియట్ వన్ క్యారెక్టర్ కోసం స్కాటిష్ నటి టిల్డా స్విన్‌టన్‌ను తీసుకున్నాం. మార్వెల్ ఒరిజినల్ కామిక్స్‌లో అది ఏషియన్ క్యారెక్టర్. అయితే ‘క్రియేటివ్ ఫ్రీడమ్’ అనే వంకతో మేం టిల్డాతో నటింపజేశాం. ఆ సినిమా టైంలో ఈ పాయింట్‌ను చాలామంది లేవనెత్తారు. విమర్శించారు. అది మాకొక మేలుకొలుపు ఇకపై అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం’’ అని ఫెయిగి ఓ ప్రెస్‌మీట్‌లో తెలిపాడు. ఇక సిము లీ హీరోగా ‘షాంగ్-చీ’ తెరకెక్కింది. ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 3న రిలీజ్ చేసేందుకు మార్వెల్ ప్లాన్ వేసింది. ఆసియాకు చెందిన ఒక నటుడిని లీడ్ రోల్ తీసుకోవడం మార్వెల్ హిస్టరీలో ఇదే మొదటిసారి. ఈ స్ట్రాటజీతో చైనా, ఇండియాలో బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టాలని మార్వెల్ స్కెచ్ వేసింది.
చదవండి: ఆ మధుర బాణీలకర్త ఇకలేరు
Comments
Please login to add a commentAdd a comment