
న్యూఢిల్లీ: ఏషియన్ కాంక్రీట్స్, సిమెంట్స్‌లో మిగిలిన 55 శాతం వాటాను అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ కైవసం చేసుకుంది. ఇందుకు సుమారు రూ.426 కోట్లు వెచి్చంచింది. అంబుజా సిమెంట్స్ అనుబంధ సంస్థ అయిన ఏసీసీకి ఇప్పటికే ఏషియన్ కాంక్రీట్స్‌లో 45 శాతం వాటా ఉంది. ఏషియన్ కాంక్రీట్స్, సిమెంట్స్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని నలఘర్ వద్ద 1.3 మిలియన్ టన్నుల ప్లాంటు, అలాగే అనుబంధ కంపెనీ అయిన ఏషియన్ ఫైన్ సిమెంట్స్‌కు పంజాబ్‌లోని రాజ్‌పురాలో 1.5 మిలియన్ టన్నుల సిమెంట్ ప్లాంటు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment