Concrete
-
టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనమే బెస్ట్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో టీ–16 రకం ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేయడంతో ఆ కాంక్రీట్ సమ్మేళనం సాంకేతికత, దాని తయారీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాత డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించిన టీ–5 రకం కాకుండా టీ–16 రకం కాంక్రీట్ సమ్మేళనం వైపే నిపుణులు ఎందుకు మొగ్గు చూపుతున్నారనే అంశంపై ఆసక్తి పెరిగింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశాకే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రం వాల్ పనులు చేపట్టాలి. కానీ.. గోదావరి వరదను మళ్లించే పనులు చేపట్టకుండానే 2016 డిసెంబర్ నుంచి 2018 జూన్ మధ్య వరద ప్రవాహం లేని రోజుల్లో ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్‌ను నిర్మించారు. 2017, 2018 సీజన్లలో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో వరద ఉద్ధతికి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. ఆ తరువాత 2019–21 మధ్య వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించి గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా ప్రభుత్వం మళ్లించింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో డయాఫ్రం వాల్ నిర్మించింది. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది నిర్మించాలా? అన్నది తేల్చడంలో తొలుత ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణుల సహకారం తీసుకున్న సీడబ్ల్యూసీ ఆ తర్వాత అంతర్జాతీయ నిపుణుల కమిటీతో అధ్యయనం చేసింది. చివరకు ఈ ఏడాది జూన్‌లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని సూచించింది. త్వరగా గట్టిపడి గోడలా మారుతుంది ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు నిర్మించిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతానికి ఎగువన, దిగువన నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరిగింది. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ట్రెంచ్ కట్టర్, గ్రాబర్ల ద్వారా భూమిని తవ్వుతూ పోతే.. భూగర్భ జలాలు పైకి ఎగదన్నుతాయి. రాతి పొర తగిలేవరకూ భూమిని తవి్వ.. ఖాళీ ప్రదేశంలోకి తొలుత బెంటనైట్ మిశ్రమాన్ని, ఆ తరువాత కాంక్రీట్ మిశ్రమాన్ని పంపాలి. టీ–5 రకం కాంక్రీట్ మిశ్రమంలో సిమెంటు పాళ్లు తక్కువగా ఉండటం వల్ల అది త్వరగా గట్టిపడదు. అందువల్ల భూగర్బ జలాల ఒత్తిడికి అది తట్టుకుని నిలబడలేదు. అదే టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమంతో సిమెంటు పాళ్లు అ«దికంగా ఉండటం వల్ల కాంక్రీట్ మిశ్రమం అధిక ఒత్తిడితో పోసిన వెంటనే బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కొంత బెంటనైట్ మిశ్రమంతో కలిసి వెంటనే టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమం గట్టిపడి గోడగా మారుతుంది. తద్వారా భూగర్భ జలాల ఒత్తిడిని అణచివేస్తుంది. టీ–5 కంటే టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమం అత్యంత పటిష్టవంతమైనదని ఐఐటీ (తిరుపతి) ప్రొఫెసర్లు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అందుకే కొత్త డయాఫ్రం వాల్లో టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించింది. -
నిన్న బూడిద.. నేడు కాంక్రీట్ పంచాయితీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నిన్నటికి నిన్న బూడిద కోసం కొట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు కాంక్రీట్ పంచాయితీలోనూ ఇరుక్కున్నారు. ఆర్టీపీపీ నుంచి సిమెంటు ఫ్యాక్టరీలకు సరఫరా చేసే ఫ్లైయాష్ కోసం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నానా యాగీ చేసి చివరకు పార్టీ నుంచి ఎలాంటి సహకారమూ లేకపోవడంతో సర్దుకున్నారు. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ‘కాంక్రీట్’ కంపెనీని చేజిక్కించుకోవడానికి ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిoచడం చర్చనీయాంశమైంది. ప్లాంటు నాకు ఇచ్చేయాలి.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం మక్కాజిపల్లి తండా వద్ద ఆర్ఎంసీ (రెడీమిక్స్ కాంక్రీట్) ప్లాంటు ఉంది. దీని నిర్వాహకులు కొన్నేళ్లుగా చిన్న చిన్న ఆర్డర్లు తెచ్చుకుని నడుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఓ మంత్రి కన్ను ఈ ప్లాంటుపై పడింది. ‘నీకు ఎంతో కొంత ఇస్తా.. ప్లాంటు ఇచ్చేసి వెళ్లిపో’ అంటూ ఓనర్‌ను మంత్రి బెదిరించడం మొదలుపెట్టారు. ప్లాంటు యజమాని ప్రాధేయపడినా మంత్రి కనికరించలేదు. ఇచ్చేసి వెళ్లిపోవాల్సిందేనని కరాఖండిగా చెప్పారు. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ప్లాంటుకు ముడిసరుకు సరఫరా చేసే కంపెనీలకు ఫోన్ చేసి.. సరుకు ఇవ్వొద్దని, లారీలు తిప్పొద్దని హుకుం జారీ చేశారు. ముడిసరుకుతో వస్తున్న లారీలను మంత్రి అనుచరులు నిలిపివేశారు. తమ ప్లాంటుకు వచ్చే లారీలను ఆపుతున్నారంటూ స్థానిక కియా పోలీస్ స్టేషన్లో యజమాని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మంత్రి బెదిరింపులు పెరిగిపోవడంతో ఆ ప్లాంటు యజమాని విధిలేని పరిస్థితుల్లో మంత్రితో తీవ్ర రాజకీయ విభేదం ఉన్న అదే ప్రాంతానికి చెందిన మరో టీడీపీ ప్రజాప్రతినిధిని సంప్రదించారు. ఆ ప్రజాప్రతినిధికి ప్లాంటులో 50 శాతం భాగస్వామ్యం కల్పిస్తూ అగ్రిమెంటు చేసుకున్నారు. దీంతో మంత్రి వెనక్కి తగ్గినట్లు సమాచారం. చిన్న పరిశ్రమలనూ వదలడం లేదు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అన్ని వ్యాపారాలు, మైన్లు, పరిశ్రమలను చేజిక్కించుకునేందుకు వాటి యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలనూ వదలడం లేదు. గుడ్‌విల్, కమీషన్లు ఇవ్వాలని, లేదంటే వాటిని అప్పగించి వెళ్లిపోవాలంటూ వేధిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినా, అపార్ట్మెంట్లకు పునాది వేసినా గద్దల్లా వాలిపోతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో అనుమతులకూ స్థానిక ఎమ్మెల్యేకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆరు నెలలుగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. -
ఏసీసీ చేతికి ఏషియన్ కాంక్రీట్స్
న్యూఢిల్లీ: ఏషియన్ కాంక్రీట్స్, సిమెంట్స్‌లో మిగిలిన 55 శాతం వాటాను అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ కైవసం చేసుకుంది. ఇందుకు సుమారు రూ.426 కోట్లు వెచి్చంచింది. అంబుజా సిమెంట్స్ అనుబంధ సంస్థ అయిన ఏసీసీకి ఇప్పటికే ఏషియన్ కాంక్రీట్స్లో 45 శాతం వాటా ఉంది. ఏషియన్ కాంక్రీట్స్, సిమెంట్స్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని నలఘర్ వద్ద 1.3 మిలియన్ టన్నుల ప్లాంటు, అలాగే అనుబంధ కంపెనీ అయిన ఏషియన్ ఫైన్ సిమెంట్స్‌కు పంజాబ్‌లోని రాజ్‌పురాలో 1.5 మిలియన్ టన్నుల సిమెంట్ ప్లాంటు ఉంది. -
దానికదే పగుళ్లు పూడ్చుకునే కాంక్రీటు..!
భవన నిర్మాణంలో వాడే కాంక్రీటు దృఢంగా ఉంటుంది. అయితే వాతావరణంలోని తేమ లేదా ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గుల వల్ల కాంక్రీటు నిర్మాణాల్లోనూ పగుళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు దాని నిర్వహణకోసం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పగుళ్లతో కొన్నిసార్లు కాంక్రీటు మూలకాలు క్షీణించే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను నివారించటానికి డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్నమైన కాంక్రీటును రూపొందించారు. ఇది తనకు తానే మరమ్మతు చేసుకుంటుంది. ఇందులోని బయోఫైబర్లు బ్యాక్టీరియా సాయంతో పగుళ్లను పూరిస్తాయి. కాంక్రీటు నిరంతరం వాతావరణ ప్రభావానికి గురవుతున్నప్పుడు పగుళ్లు ఏర్పడుతుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత మరీ పెరిగితే పగుళ్లు మరింత పెద్దగా అవుతాయి. పైగా తేమ సైతం వివిధ ప్రక్రియలతో కాంక్రీటు క్షీణించేలా చేస్తుంది. కాబట్టి కాంక్రీటు నిర్మాణాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. తరచూ మరమ్మతులు అవసరమవుతాయి. దీనికి ఖర్చు అవుతుంది. అసౌకర్యమూ కలిగిస్తుంది. అందుకే కాంక్రీటు క్షీణించే వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అందుకు అనుగునంగా డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు బయోఫైబర్లు రూపొందించారు. ఈ పాలిమర్ ఫైబర్లు కేవలం కాంక్రీటుకు దన్నుగా నిలవటమే కాకుండా పగుళ్లు వాటికవే పూడిపోయేలా చేసి మన్నికగా ఉండే కాలాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ఫైబర్లకు సన్నటి రంధ్రాలు కలిగిన హైడ్రోజెల్ పూత పూస్తారు. ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇదీ చదవండి: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో..! ఇది నిద్రాణంగా ఉంటూ తీవ్ర వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని జీవిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా పగుళ్లు ఏర్పడితే వాటిలోంచి నీరు వెళ్లి బయోఫైబర్లును తాకుతుంది. అప్పుడు హైడ్రోజెల్ విస్తరిస్తుంది. ఈ క్రమంలో బ్యాక్టీరియా నిద్రలేస్తుంది. కాంక్రీటు చుట్టూ ఉండే కార్బన్, క్యాల్షియంను తినటం ఆరంభిస్తుంది. అప్పుడు వీటి నుంచి క్యాల్షియం కార్బొనేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది పగుళ్లను పూడుస్తుంది. నిర్మాణ పదార్థాలను మెరుగు పరచటానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో బయోఫైబర్లతో కూడిన కాంక్రీటు ఆసక్తి కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. -
రెడీమేడ్ ఇళ్లు, భలే మోడళ్లు .. 90 శాతం పనులు ఫ్యాక్టరీలోనే.. ప్రత్యేకతలివే!
పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన రెడీమేడ్ ఇళ్ల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పరిచయం చేస్తోంది. మన దేశ వాతావరణానికి తగ్గట్టుగా తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన ఇళ్ల నిర్మాణాన్ని 6 విభిన్న మోడళ్లలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ టెక్నాలజీపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ‘గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ’ పేరిట లైట్ హౌస్ ప్రాజెక్టులను ప్రారంభించి.. వాటిని లైవ్ లేబొరేటరీలుగా మార్చింది. సాక్షి, అమరావతి: పట్టణ గృహ నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇటుక, సిమెంట్‌తో నెలల తరబడి ఇళ్ల నిర్మాణాలు చేయక్కర్లేకుండా ఫ్యాక్టరీలోనే దాదాపు 90 శాతం ఇంటి పనులు పూర్తయిపోతాయి. విడిభాగాలను సైట్‌కు తరలించి బిగిస్తే బహుళ అంతస్తుల భవనం సిద్ధమైపోతుంది. విదేశాల్లో అమలులో ఉన్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మనదేశంలో చేపట్టే నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చుతో వేగంగా బహుళ అంతస్తుల భవనం సిద్ధం కావడం ఇందులో ప్రత్యేకత. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 54 అత్యుత్తమ ప్రాజెక్టులను పరిశీలించి మనకు అనువైన 6 మోడళ్లను ఎంపిక చేసింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ పేరుతో చెన్నై, రాజ్‌కోట్, ఇండోర్, లక్నో, రాంచీ, త్రిపురలో నిర్మాణాలు చేపట్టింది. నిర్మాణ రంగంలో సరికొత్త విప్లవంగాను, లైట్ హౌస్ ప్రాజెక్టులుగా పేర్కొంటున్న వీటిని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కాలేజీలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ రంగంలో ఉన్న సంస్థలకు లైవ్ లే»ొరేటరీలుగా ఉపయోగపడనున్నాయి. ఆరు ప్రాజెక్టుల్లో 6,368 ఇళ్ల నిర్మాణం భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులున్న 6 రాష్ట్రాల్లో విభిన్న టెక్నాలజీలను ఉపయోగించి నిర్మాణాలను చేపట్టారు. ప్రీకాస్ట్ కాంక్రీట్ నిర్మాణ విధానంలో చెన్నైలో అన్ని వసతులతో 1,152 ఇళ్లను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. రాజ్‌కోట్‌లో మోనోలిథిక్ కాంక్రీట్ టెక్నాలజీతో 1,144 ఇళ్లను నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులు కోవిడ్‌తో దేశంలో ప్రతికూల పరిస్థితులున్నా తక్కువ కాలంలో విజయవంతంగా పూర్తయ్యాయి. ఇండోర్‌లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ శాండ్విచ్ ప్యానెల్ విధానంలో 1,024 ఇళ్లు, లక్నోలో పీవీసీ ఫ్రేంవర్క్ టెక్నాలజీతో 1,040 ఇళ్లు, రాంచీలో ప్రీకాస్ట్ కాంక్రీట్–3డీ నిర్మాణ విధానంలో 1,008 ఇళ్లు, అగర్తల (త్రిపుర)లో లైట్గేజ్ స్టీల్ స్ట్రక్చరల్ విధానంలో 1,000 ఇళ్లు నిర్మించారు. ఇకపై దేశంలోని అన్ని పట్టణాల్లో ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని యోచిస్తున్నట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రీకాస్ట్ కాంక్రీట్ విధానంలో.. ఈ విధానంలో భవనం గోడలు, స్లాబ్, మెట్లు, బీమ్ మొదలైన అన్ని భాగాలు ప్లాంట్ లేదా కాస్టింగ్ యార్డ్‌లో తయారు చేసి, సైట్లో ఒకదానికొకటి బిగిస్తారు. కాంక్రీట్‌ను కూడా ఫ్లైయాష్, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, మైక్రో సిలికా వంటి పారిశ్రామిక ఉప ఉత్పత్తులతో చేస్తారు. దీంతో మన్నికగా ఉండడంతో పాటు సహజ వనరులను సంరక్షించినట్టవుతుని నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీతో చెన్నైలో 1,152 ఇళ్లను నిర్మించారు. మోనోలిథిక్ టన్నెల్ కాంక్రీట్‌తో.. ‘టన్నెల్ఫార్మ్’గా పిలిచే అచ్చుల్లో స్లాబ్‌లు, గోడలు, గదులను ఒకేసారి వేస్తారు. ఇవి చాలా బలంగా ఉంటాయి. ఒక్కరోజులో సెంట్రింగ్ సపోర్టును తొలగించవచ్చు. గోడలకు ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. వీటికీ ఫ్లైయాష్ గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, మైక్రో సిలికా వంటి పారిశ్రామిక ఉప ఉత్పత్తులతో కాంక్రీట్ తయారు చేస్తారు. బాక్స్ టైప్ మోనోలిథిక్ స్ట్రక్చర్ కావడంతో భూకంపం, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంటుంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఈ టెక్నాలజీతో 1,144 ఇళ్లను నిర్మించారు. శాండ్విచ్ ప్యానెల్ టెక్నాలజీ ఇలా.. ఎక్కువ అంతస్తుల భవనాలు నిర్మించేటప్పుడు సంప్రదాయ ఇటుక గోడలకు బదులుగా ఫ్యాక్టరీలో తయారైన సిమెంట్ లేదా కాల్షియం సిలికేట్ బోర్డులను వాడతారు. స్టీల్ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్‌కు గోడలుగా ఈ బోర్డులను బిగిస్తారు. వీటిని ఫ్యాక్టరీలోనే తయారుచేసి సైట్లో ఒకదానికొకటి అనుసంధానిస్తారు. ఇవి తక్కువ బరువుతో పాటు మెరుగైన థర్మల్ ఇన్సులేషన్గానూ పనిచేస్తాయి. బలమైన పునాది కూడా అవసరం లేదు. ఇండోర్ (మధ్యప్రదేశ్)లో ఈ టెక్నాలజీతో 1,024 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పీవీసీ పాలిమర్ కాంక్రీట్ టెక్నాలజీ ఈ టెక్నాలజీలో ఇంటి ప్లాన్ ప్రకారం పాలీ వీనైల్ క్లోరైడ్ (పీవీసీ) వాల్ ప్యానెళ్లు ఫ్యాక్టరీలో తయారు చేసి సైట్లో బిగిస్తారు. స్ట్రక్చరల్ ఫ్రేమ్స్ బిగించిన తర్వాత గోడ ప్యానెళ్లను డెక్కింగ్ ఫ్లోర్‌తో అనుసంధానం చేస్తారు. గోడ ప్యానెళ్ల మధ్యనున్న ఖాళీల్లో కాంక్రీట్ నింపుతారు. లక్నోలో 1,040 ఇళ్లను ఈ టెక్నాలజీతో చేపట్టారు. ప్రీకాస్ట్ కాంక్రీట్– 3డీ వాల్యూ మెట్రిక్ విధానం 3డీ వాల్యూమెట్రిక్ కాంక్రీట్ నిర్మాణంలో గదులు, టాయిలెట్, కిచెన్, బాత్రూమ్, మెట్లు.. ఇలా వేటికవే మాడ్యూల్స్‌గా యార్డులో నిర్మించి సైట్లో బిగిస్తారు. ఇలా ఒకదానిపై మరొకటిగా ఎన్ని అంతస్తులైనా బిగించవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా గోడలంటూ వేరుగా ఉండవు. అన్ని వాతావరణాలను తట్టుకోవడం దీని ప్రత్యేకత. ఈ విధానంలో రాంచీలో 1,008 ఇళ్లను నిరి్మస్తున్నారు. లైట్గేజ్ స్టీల్ స్ట్రక్చరల్– ప్రీ ఇంజనీర్డ్ స్ట్రక్చరల్ పునాది అవసరం లేని ఈ టెక్నాలజీలో గాల్వనైజ్డ్ లైట్ గేజ్ స్టీల్ భాగాలతో ఇంటి భాగాలను బిగిస్తారు. ఫ్రేమ్‌ల మధ్యలో ఇన్సులేషన్ మెటీరియల్‌ను నింపి, తేలికపాటి కాంక్రీట్ ప్యానెళ్లను గోడలుగా అతికిస్తారు. ఈ విధానంలో నాలుగు అంతస్తుల భవనాన్ని నెల రోజుల్లోనే నిర్మించవచ్చు. భవనాన్ని విడదీసి మరోచోటుకు తరలించవచ్చు. స్టీల్ ఫ్రేమ్ బీమ్‌లు తేలిగ్గా ఉండటంతో భూకంపాలను తట్టుకుంటుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనువైనది కావడంతో అగర్తల (త్రిపుర)లో 1,000 ఇళ్లను నిర్మించారు. -
స్థానిక పదార్థాలతో సరికొత్త కాంక్రీట్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్, పరిశోధన విభాగం సరికొత్త కాంక్రీట్‌ను అభివృద్ధి చేసింది. స్థానికంగా లభించే ఫ్లైయాష్ (బొగ్గును మండించాక మిగిలే బూడిద), ఇసుక, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ (నిప్పుల కొలిమిల్లో వివిధ మిశ్రమాలను మండించాక మిగిలే పదార్థం), మైక్రో సిలికా (ఓ రకమైన బూడిద), నీరు, స్టీల్ ఫైబర్ (పలచని స్టీల్ ముక్కలు), పాలీప్రొలిన్ ఫైబర్స్ (ఓ రకమైన ప్లాస్టిక్ పీచు) వంటి వాటిని ఉపయోగించి ఈ కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రకటించింది. దీనికి అల్ట్రా హైపర్ఫార్మెన్స్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ (యూహెచ్‌పీఎఫ్‌ఆర్‌సీ)గా పేరుపెట్టింది. సాధారణ కాంక్రీట్‌తో పోలిస్తే సుమారు రెండింతల తక్కువ వ్యయంలోనే దీన్ని తయారు చేసే అవకాశం ఉందని... బ్రిడ్జీలు, పొడవైన కట్టడాలకు అవసరమైన బీమ్‌లకు, స్తంభాలు, ఇతర నిర్మాణాలకు ఈ నూతన కాంక్రీట్‌ను ఉపయోగించుకోవచ్చని ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఫ్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఐఐటీలోని క్యాస్టన్ ల్యాబ్‌లో ఈ నూతన కాంక్రీట్ పనితీరును పరీక్షించామన్నారు. డిజైన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. నూతన కాంక్రీట్ 150 ఎంపీయూ కంప్రెసివ్ స్ట్రెంత్‌ను కలిగి ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి నిర్మాణ సామగ్రిని అభివృద్ధి చేయడమంటే ‘ఆత్మనిర్భర్ భారత్’ కల సాకారం దిశగా ముందడుగు వేయడమేనన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. -
పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-౩ కాంక్రీట్ డ్యామ్ పూర్తి
-
ట్రెండీ లుక్ కోసం.. ఆ ఫర్నీచరే కావాలంట
గృహాలంకరణలో శతాబ్దాలుగా కలప అగ్రస్థానంలో ఉంది. స్టీల్, ఇత్తడి దశాబ్దాలుగా తమ వైభవాన్ని చాటుతూనే ఉన్నాయి. మధ్యలో కొంత వరకు ప్లాస్టిక్ చొరబడింది. నిజానికి చాలా కాలం ఫర్నీచర్ విషయంలో వీటి గురించి తప్ప పెద్దగా ఆలోచనలు సాగలేదు. ఔట్‌డోర్‌కి మాత్రమే పరిమితమైన కాంక్రీట్ ఫర్నీచర్ వేగంగా ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇన్నాళ్లూ కాంక్రీట్‌ను ఇంటి నిర్మాణంలో వాడుతారు, ఔట్‌డోర్‌లో కొంతవరకు బెంచీలు, టేబుళ్లుగా వాడుతారు తప్ప ఇంటీరియర్ డిజైనర్లో భాగంగా వాడరు అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడిక ఈ ఆలోచన మరుగున పడిపోయి కాంక్రీట్‌తో అద్భుతాలను సృష్టిస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. ల్యాంప్స్, టేబుల్స్, బుక్ కేసెస్.. ఒకటేమిటి. కాదేదీ కాంక్రీట్‌కు అనర్హం అనిపిస్తున్నారు. సిమెంట్.. ఇసుక.. రాళ్లు తగినన్ని పాళ్లలో కలిపిన ఈ కాంక్రీట్ పదార్థంతో ఏ డిజైన్ అయినా రాబట్టవచ్చు. నిజానికి దీనిని అర్ధం చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు అంటారు ఇంటీరియర్ డిజైనర్లు. పైగా మిగతా ఫర్నీచర్‌తో పోల్చితే చవకైనది. లగ్జరీగా కూడా కనిపిస్తుంది. ‘కాంక్రీట్‌ను శిల్పకలతో పోల్చవచ్చు. ఈ పదార్థానికి ఉన్న పరిమితి ఏంటో దాని తయారీదారు చేతుల్లోనే ఉంటుంది’ అంటారు ప్రతీక్ మోది. కాంక్రీట్ సొల్యూషన్స్ డిజైన్ సంస్థ ‘సూపర్ క్యాస్ట్’ యజమాని ప్రతీక్. ఇంటి డెకార్‌లో కాంక్రీట్‌ను లెక్కలేనన్ని మార్గాల్లో ఉపయోగించవచ్చు’ అంటారు. లివింగ్ రూమ్ టీవీ చూస్తూ, పేపర్ చదువుకుంటూ, టీ–కాఫీ లాంటివి సేవిస్తూ, మాట్లాడుకుంటూ, అతిథలతో కూర్చుంటూ .. కుటుంబంలో అందరూ ఇలా ఎక్కువ సేపు లివింగ్ రూమ్‌లోనే ఉండటానికి సమయాన్ని కేటాయిస్తారు. అందుకే, దీనిని ఫ్యామిలీ రూమ్ అనవచ్చు. అలాంటి ఈ రూమ్ అలంకరణలో ప్రత్యేకత తీసుకుంటారు. సృజనాత్మకత, మీదైన ప్రత్యేకత కనిపించాలంటే సెంటర్ టేబుల్‌ను వినూత్నంగా డిజైన్ చేయుంచుకోవచ్చు. అందుకు కాంక్రీట్ ఫర్నీచర్ మేలైన ఎంపిక అవుతుంది. ప్రయోగాల కాంక్రీట్ తమ ఇంటి కళలో తమకు తామే ఓ కొత్త సృష్టి చేయాలని ఎవరికి వారు అనుకునేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. వారి చేతుల్లో కాంక్రీట్ కొత్త కొత్త వింతలు పోతోంది అంటారు ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు. కాంక్రీట్ టేబుల్స్, ఇతర ఉత్పత్తులు చాలా గట్టిగా, మూలలు పదునుగా ఉంటాయి. ఇవి జాగ్రత్తగా వాడకపోతే గాయలు అయ్యే అవకాశం ఉందనుకునేవారు వీటికి వంపులను, నునుపుదనాన్ని సొగసుగా తీసుకువస్తున్నారు. అలాంటి డిజైన్స్ కూడా మార్కెట్లో విరివిగా దర్శనమిస్తున్నాయి. సరదా అభిరుచి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయాలనుకున్నా, అభిరుచిని పెంపొందించుకోవాలన్నా కాంక్రీట్ ముడిసరుకుగా ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మట్టితో బొమ్మలు, వాటికి పెయింట్స్ వేసి మురిసిపోయేవారు. ఇప్పుడా అవకాశం కాంక్రీట్ ఇస్తుంది. పైగా చేసిన వస్తువు త్వరగా పగలకుండా ఇంట్లో కనువిందు చేస్తుంది. -
కాంక్రీట్ నుంచి ఇసుక!
సాక్షి, హైదరాబాద్: పది భారీ బ్లాకులతో కూడిన సచివాలయ పాత భవనాలను కూలిస్తే వందల టన్నుల్లో కాంక్రీట్ వ్యర్థాలు ఉత్పన్నం కాబోతున్నాయి. వాటిని ఏం చేస్తారు? కొత్త సచివాలయ నిర్మాణానికి భారీ స్థాయిలో ఇసుక అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో దానిని ఎక్కడ నుంచి తెస్తారు? ఆ వ్యర్థాలనే ఇసుకగా మార్చి ఉపయోగిస్తే.. రెండు సమస్యలూ పరిష్కారమవుతాయి కదా? ఇప్పుడు ఆ దిశగానే అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. కొత్త సచివాలయ నమూనా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆకృతిలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆది నుంచి ఇష్టపడే అరబ్ నిర్మాణ శైలిలో కనిపించే గుమ్మటం డిజైన్‌తో అది ఉంటుందని దాదాపుగా స్పష్టమైంది. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కాబోయే కొత్త సచివాలయ భవన సముదాయం ఆధునిక హంగులతో ఉండనుంది. భవనంలో ఆధునికత ఉండటంతోపాటు నిర్మాణంలో కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నారు. ఇందులో భాగంగా పాత భవనాలను కూచ్చివేయగా వచ్చే వ్యర్థాలను పునర్వినియోగించాలని యోచిస్తున్నారు. వ్యర్థాలను పొడి చేసి... ప్రపంచవ్యాప్తంగా ఇసుకకు కొరత ఏర్పడుతోంది. కాంక్రీట్ నిర్మాణాలు శరవేగంగా తీవ్ర మవుతుంటంతో ఇసుక వాడకం బాగా పెరిగింది. ఇష్టం వచ్చినట్టు ఇసుకను తోడేస్తుండటంతో నదీగర్భం దెబ్బతిని నదుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే ఇసుకకు ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురాగా, మనదేశంలో ఇప్పటివరకు ఆ దిశగా పూర్తిస్థాయి ప్రయత్నాలు మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో మాత్రం ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు అనుసరిస్తున్నారు. భవనాలను కూల్చివేసినప్పుడు వచ్చే కాంక్రీట్ వ్యర్థాలను ఇసుకగా మార్చడం వీటిలో ఒకటి. ఈ వ్యర్థాలను ఇసుకలాగా పొడి చేస్తారు. కొత్త నిర్మాణాల్లో దానినే ఇసుకగా వినియోగిస్తారు. అయితే పూర్తిగా దాన్నే ఇసుక బదులు వాడితే నిర్మాణాలు అంత పటుత్వంగా ఉండవన్న అభిప్రాయాలున్నాయి. దీంతో 15 శాతం నుంచి 20 శాతం వరకు అసలు ఇసుకను తగ్గించి ఈ పొడిని వాడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ ఇసుకలో అంత పరిమాణం మేర ఈ వ్యర్థాల పొడిని కలిపి నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు. కొత్త సచివాలయ నిర్మాణంలో కూడా ఈ విధానాన్ని అనుసరించాలని అధికారులు యోచిస్తున్నారు. ఫ్లోరింగ్ పనులకు పూర్తిగా వినియోగం.. ప్రధాన నిర్మాణంలో 20 శాతానికి మించకుండా పాత కాంక్రీట్ వ్యర్ధాల పొడిని ఇసుకలో కలిపి వాడుతున్నా, ఇతర పనులకు మాత్రం వంద శాతం ఆ వ్యర్ధాల పొడినే ఉపయోగిస్తున్నారు. ఫ్లోరింగ్, టైల్స్ వేసేచోట, ఫుట్‌పాత్‌లు, కాంపౌండ్ వాల్ సహా బయటి గోడల నిర్మాణం తదితర పనుల్లో ఈ పొడినే వాడుతున్నారు. దీనివల్ల మొత్తం నిర్మాణ వ్యయంలో దాదాపు 40 శాతం వరకు ఇసుక వాడకం తగ్గుతుంది. అంతమేర ఖర్చు ఆదా కావడంతోపాటు నదులకు కూడా రక్షణ ఏర్పడుతుంది. కొత్త సచివాలయ నిర్మాణంలో కూడా ఈ పద్ధతిని అనుసరిస్తే ఈ రెండు లాభాలు కలగనున్నాయి. ప్రస్తుతం పాత సచివాలయంలో పది భారీ భవనాలున్నాయి. వాటిని కూలి్చవేస్తే వందల టన్నుల కాంక్రీట్ వ్యర్థాలు వస్తాయి. అంత భారీ మొత్తంలో వచ్చే వ్యర్థాలను ఏమీ చేయలేమని, వాటితో నగర శివార్లలో ఉన్న భారీ క్వారీ గుంతలను పూడుస్తామని గతంలో ఓ అధికారి వివరించారు. కానీ కొంతకాలంగా హైదరాబాద్‌లో కూడా భవన వ్యర్థాలను పునర్వినియోగించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించింది. అందుకు సంబంధించి కొన్ని యూనిట్లను కూడా మొదలుపెట్టింది. చెన్నై, బెంగళూరు, కొచ్చి వంటి దక్షిణ భారతదేశంలోని నగరాలతోపాటు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, గాందీనగర్, వడోదర వంటి చోట్ల భవనాల వ్యర్థాల రీసైక్లింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలోనూ ఈ విధానం అవలంబించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ సమాయత్తమవుతోంది. జీహెచ్ఎంసీతో కలిసి ఈ దిశగా ఏర్పాట్లు చేయనున్నట్టు సమాచారం. -
తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్
ప్రముఖ మలయాళ హీరోయిన్ అర్చన కవి పెను ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. కొచ్చిలో ఆమె కారులో ప్రయాణిస్తున్న సమయంలో మెట్రో శ్లాబ్ ఆమె కారుపై పడింది. దీంతో కారు అద్దలు పగిలిపోవడమే కాకుండా.. చిన్న కాంక్రీట్ ముక్క కారులోకి చొచ్చుకువచ్చింది. అయితే అదృష్ణవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ఈ ఘటనపై అర్చన ట్విటర్ వేదికగా స్పందించారు. కారు డ్రైవర్‌కు నష్ట పరిహారం అందజేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మేము కారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నప్పుడు కాంక్రీట్ శ్లాబ్ మా కారుపై పడింది. కొద్దిపాటిలో మేము ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. కారు దెబ్బతినందుకు గాను డ్రైవర్‌కు నష్ట పరిహారం అందజేయాల్సిందిగా కొచ్చి మెట్రో, కొచ్చి పోలీసు అధికారులను కోరుతున్నాను. ఈ ఘటనపై విచారణ జరపడమే కాకుండా.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల’ని అర్చన ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, పలు మాలయాళ చిత్రాల్లో నటించిన అర్చన.. తెలుగులో మధుర శ్రీదర్ దర్శకత్వం వహించిన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంలో నటించారు. -
కాంక్రీట్ వద్దు.. స్టీల్
వాషింగ్టన్: అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణంపై మొండిగా వ్యవహరిస్తున్న అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. అక్రమ వలసదారుల్ని అడ్డుకునేందుకు సరిహద్దులో కాంక్రీట్ గోడ కాకపోయినా స్టీల్‌తో గోడలాంటి నిర్మాణాన్ని చేపట్టాలని వ్యాఖ్యానించారు. అక్రమవలసదారుల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా నష్టం జరుగుతోందని వాపోయారు. స్టీల్ గోడలాంటి నిర్మాణంపై చర్చించేందుకు అమెరికా ఉక్కు పరిశ్రమ సంఘం అధ్యక్షుడితో పాటు ముఖ్యులతో సమావేశమవుతానని తెలిపారు. గోడ కారణంగా అక్రమ వలసలతో పాటు మాదకద్రవ్యాల సరఫరాను అడ్డుకోవచ్చనీ, తద్వారా నేరాలు తగ్గుముఖం పడతాయని వెల్లడించారు. ఆదివారం వైట్‌హౌస్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరిన సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 3 వారాలుగా కొనసాగుతున్న షట్‌డౌన్ సుదీర్ఘకాలం కొనసాగుతుందని ట్రంప్ పునరుద్ఘాటించారు. గోడ నిర్మాణం విషయమై ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ, మైనారిటీ నేతల చక్ కలిసివస్తే 20 నిమిషాల్లో సమస్య పరిష్కారమైపోతుందని స్పష్టం చేశారు. షట్డౌన్కు వీరిద్దరే కారణమని ఆరోపించారు. -
సిమెంట్ అవసరం లేని కాంక్రీట్
ఫ్లైయాష్ గురించి మీరెప్పుడైనా విన్నారా? థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వ్యర్థంగా మిగిలిపోయే ఈ పదార్థంతో ఇటుకలు తయారవుతున్నాయి. కొద్దోగొప్పో కలుపుకుని సిమెంట్ కూడా తయారు చేస్తున్నారు. ఇలాకాకుండా పూర్తిగా ఫ్లైయాష్‌తో కాంక్రీట్‌ను తయారు చేసేందుకు రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని కనుక్కున్నారు. తద్వారా కాంక్రీట్ తయారీ ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, అదే సమయంలో వృధా అవుతున్న ఈ వనరును మళ్లీ వినియోగించుకోవడం సాధ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోవడంలో కాంక్రీట్ తయారీ రవాణా, విద్యుచ్ఛక్తి రంగాల తరువాత మూడో స్థానంలో ఉంది. ఇంకోవైపు ఫ్లైయాష్ పునర్వినియోగం చాలా తక్కువగా ఉంది. ఈనేపథ్యంలో తాము ఒక వినూత్నమైన బైండర్ను అభివృద్ధి చేశామని, దీన్ని వాడినప్పుడు సాధారణ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ అన్నది అస్సలు వాడకుండా దాదాపు 80 శాతం ఫ్లైయాష్‌ను వాడుకుని కాంక్రీట్‌ను తయారు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రౌజబేషాసావరి అంటున్నారు. క్యాల్షియం పరిమాణం ఎక్కువగా ఉన్న ఫ్లైయాష్ 80 శాతం, ఐదు శాతం సోడియం ఆక్టివేటర్స్, మిగిలిన 15 శాతం నానో సిలికా, క్యాల్షియం ఆక్సైడ్లను కలిపి కాంక్రీట్‌ను తయారుచేస్తే అది సాధారణ పోర్ట్‌ల్యాండ్ సిమెంట్ కంటే దృఢంగా ఉండటంతోపాటు ఎక్కువ కాలం మన్నుతుంది కూడా అని ఆయన వివరించారు. కొత్త కాంక్రీట్ ధర్మాలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే నాణ్యత మెరుగుపడే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. -
పరి పరిశోధన
కొత్త కాంక్రీట్‌తో జల సంరక్షణ సులువు! వాన చినుకులన్నీ నేలలోకి ఇంకితే భూగర్భ జలం వృద్ధి చెందుతుంది. అందరికీ మేలు జరుగుతుంది. కానీ.. నగరాల్లో అంగుళం ఖాళీ లేకుండా వేసే కాంక్రీట్ రోడ్ల కారణంగా నీరంతా కొట్టుకుపోతోంది. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా ఈ చిక్కు సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది. దృఢమైన కాంక్రీట్ ద్వారా కూడా నీళ్లు సులువుగా జారిపోయేలా వీరు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఏటికేడాదీ పెరిగిపోతున్న కార్బన్ ఫైబర్ వ్యర్థాలతోనే ఈ ఘనతను సాధించడం విశేషం. కాంక్రీట్ ద్వారా నీరు కొద్దిమోతాదులో ఇంకేందుకు అవకాశమున్నప్పటికీ ఇది కాస్తా కాంక్రీట్ దృఢత్వంపై ప్రభావం చూపుతుంది. కొద్దికాలానికే కాంక్రీట్ కొట్టుకుపోతుంది. ఈ నేపథ్యంలో కార్ల్ ఇంగ్లండ్, సొమాయా నాసిరీలు కార్బన్ ఫైబర్ వ్యర్థాలతో కొత్త రకం కాంక్రీట్‌ను తయారు చేశారు. ఇది దృఢంగా ఉండటమే కాకుండా సాధారణ కాంక్రీట్ కంటే ఎక్కువ మోతాదులో నీరు భూమిలోకి ఇంకేలా రంధ్రాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధన శాలలో ఈ కొత్త కాంక్రీట్ బాగా పనిచేసినప్పటికీ.. సాధారణ పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తుందో పరీక్షించాల్సి ఉందని.. ఆ తరువాత విస్తృత స్థాయి వాడకానికి సిద్ధం చేయవచ్చునని నాసిరీ అంటున్నారు. దెబ్బతిన్న గుండెను సరిచేసేందుకు కొత్త పద్ధతి తోక తెగిపోతే మళ్లీ పెంచుకోగల శక్తి బల్లులకు సొంతం. అలాగే కొన్ని రకాల చేపలు తమ గుండె కణజాలాన్ని మళ్లీ అభివృద్ధి చేసుకోగలవు. మనిషికీ ఇలాంటి శక్తి ఉంటే.. అనేక గుండెజబ్బులకు మెరుగైన, సులువైన చికిత్స సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ పనిలోనే ఉన్నారు గ్లాడ్స్టోన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన వివేక్ శ్రీవాస్తవ. మన శరీరంలో కార్డియోమయోసైట్స్ అనే కణాలు కొన్ని ఉంటాయి. పిండ దశలో గుండె ఏర్పడేందుకు గణనీయంగా విభజితమయ్యే ఈ కణాలు.. ఆ తరువాత మాత్రం విభజనకు గురికావు. కార్డియోమయోసైట్స్కు మళ్లీ ఆ శక్తిని అందించేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వివేక్ శ్రీవాస్తవ ఇందులో విజయం సాధించారు. జంతువులపై చేసిన ప్రయోగాల్లో కార్డియోమయోసైట్స్ విభజితమవడమే కాకుండా దెబ్బతిన్న గుండె కణజాలాన్ని మరమ్మతు కూడా చేసినట్లు శ్రీవాస్తవ ప్రకటించారు. కార్డియోమయోసైట్స్ విభజనకు సంబంధించి మొత్తం నాలుగు జన్యువులు పనిచేస్తున్నట్లు గుర్తించిన ఈయన వాటిని పూర్తిస్థాయిలో పనిచేసేలా చేయడం ద్వారా కణాలు వేగంగా విభజితమయ్యేలా చేయగలిగారు. కార్డియోమయోసైట్స్ విభజనను కచ్చితంగా నియంత్రించడం ఎలాగో అర్థం చేసుకోవడం ద్వారా ఈ పద్ధతిని మనుషుల్లోనూ ఉపయోగించవచ్చునని, తద్వారా గుండె పనిచేయని స్థితికి చేరుకున్న వారికీ సాంత్వన చేకూర్చడం వీలవుతుందని శ్రీవాస్తవ అంటున్నారు. వెలుగులు ఒడిసి పడతాయి... సూర్యుడి నుంచి వెలువడే వెలుగును వంద శాతం విద్యుత్తుగా మారిస్తే.. ఈ భూమ్మీద పెట్రోలు, డీజిల్ వంటివి అస్సలు అవసరం ఉండదు. కాకపోతే ఎంతటి గొప్ప సోలార్ ప్యానెలైనా కేవలం 25 శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలవు. ఈ నేపథ్యంలో జర్మనీలోని బ్రాన్ష్వెగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. అన్ని దిక్కుల నుంచి వెలుతురును తీసుకుని అతితక్కువ ప్రదేశంలోకి కేంద్రీకరించగలిగే సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. వీటిని వరుసగా పేర్చడం ద్వారా సూర్యకిరణాల్లోని అన్నిరకాల కాంతిని విద్యుత్తుగా మార్చవచ్చు. ఈ పరికరం మొక్కల్లో వెలుతురును ఒడిసిపట్టే కణాల మాదిరిగా పనిచేస్తుందని ఫోటాన్లను శోషించుకుని ఇతర కణాలకు చేరవేస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త పీటర్ జోమో వల్లా తెలిపారు. దాదాపు 80 శాతం కాంతిని చిన్న ప్రదేశంలోకి కేంద్రీకరించగల ఈ పరికరాలతో భవిష్యత్తులో అతితక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ కాన్సెంట్రేటర్స్ను తయారు చేయవచ్చునని ఆయన వివరించారు. ప్రస్తుతం తాము నీలిరంగు కాంతిని శోషించుకుని మళ్లించగలిగేలా చేయగలిగామని.. ఇతర రంగులకు కూడా ఈ పద్ధతిని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. -
కాంక్రీట్‌కు శక్తినిచ్చే ప్లాస్టిక్
భవన నిర్మాణంలో విస్తృతంగా వాడే కాంక్రీట్‌ను మరింత దృఢంగా చేసేందుకు ఎంఐటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పద్ధతిని కనుగొన్నారు. వ్యర్థంగా పారేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లతో కాంక్రీట్‌ను గట్టిగా చేయవచ్చునని ప్రయోగాత్మకంగా నిరూపించారు. సిమెంట్ తయారీలో కార్బన్డయాక్సైడ్ వాతావరణంలోకి చేరతుందనేది తెలిసిందే. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నేల, నీరు కలుషితం అవుతోందని తరచూ వింటుంటాం. ఈ నేపథ్యంలో కాంక్రీట్ తయారీని పర్యావరణ హితంగా మార్చడం ఎలా అన్న ఆలోచనలను ఎంఐటీ శాస్త్రవేత్తలు చేశారు. ఈ క్రమంలో కాంక్రీట్‌కు ప్లాస్టిక్‌ను కలిపి చూశారు. కొంత కాలానికే కాంక్రీట్ పగుళ్లుబారింది. అయినా పరిశోధనలు ఆపలేదు. ప్లాస్టిక్‌ను గామా కిరణాల ప్రభావానికి గురి చేసి ఆ తర్వాత పొడి చేసి కాంక్రీట్‌కు కలిపి చూశారు. కాంక్రీట్ సామర్థ్యం 20 శాతం వరకూ పెరిగినట్లు గుర్తించారు. గామా కిరణాల శక్తి ఎక్కువైన కొద్దీ కాంక్రీట్ అంతేస్థాయిలో దృఢంగా మారిందని, మరిన్ని పరిశోధనల ద్వారా అత్యంత సమర్థవంతమైన మిశ్రమాన్ని రూపొందిస్తామని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త కునాల్ కుప్వాడే పాటిల్ తెలిపారు. ఈ కొత్త కాంక్రీట్‌ను ఎక్స్‌రే ద్వారా పరిశీలించినప్పుడు వాటిల్లోని స్ఫటికాలు చాలా దట్టంగా ఉన్నట్లు గుర్తించామని, రేడియోధార్మికత ప్రభావమూ లేదని పాటిల్ వివరించారు. -
చెరవేశారు
- కాంక్రీట్ జంగిళ్లుగా కూకట్పల్లి, ప్రగతి నగర్, నిజాంపేట - కాసుల కక్కుర్తితో చెరువులను రాసిచ్చేసిన యంత్రాంగం - ప్రజాప్రతినిధులే సూత్రధారులుగా వేల కోట్ల వ్యాపారం - ఆనవాళ్లు లేని హైదర్ చెరువు, మాయమైన మైసమ్మ చెరువు - కబ్జాలకు పాల్పడ్డ ఇద్దరు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు - శివారు చెరువుల పరిరక్షణ కోసం కావాలి.. ఓ కిర్లోస్కర్.. గొలుసుకట్టు చెరువులు.. విశాలమైన వరద నీటి కాల్వలు.. భారీ వర్షాలు వచ్చినా ముంపులేని వ్యవస్థ.. ఇదీ మూడు దశాబ్దాల క్రితం కూకట్పల్లి పరిసర ప్రాంతాల పరిస్థితి. నాడు పక్కా పల్లెను తలపించిన ఈ ప్రాంతం నేడు కాంక్రీట్ వనంలా మారిపోయింది. నగరం అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధుల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చెరువులు, కుంటలు లే అవుట్లుగా మారాయి. పెద్ద మొత్తంలో అపార్ట్మెంట్లు వెలిశాయి. దీంతో కూకట్పల్లి, నిజాంపేట, ప్రగతినగర్, హైదర్‌నగర్, హెచ్ఎంటీ, మూసాపేట, ఆల్విన్ కాలనీ, బోయిన్పల్లి ప్రాంతాలకు కొద్దిపాటి వర్షానికే ముంపు బారినపడుతున్నాయి. నిజాంపేట తురక చెరువు పరీవాహ కప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బండారి లే అవుట్ జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీనికి బాధ్యత వహించాల్సింది. ఇక్కడ నిర్మాణాలకు అనుమతించిన అధికారులు.. రూ.కోట్ల సంపాదనే లక్ష్యంగా వ్యాపారం చేసిన బిల్డర్లు...వీరికి అండగా నిలిచిన ప్రజాప్రతినిధులేనన్నది వాస్తవం. కూకట్పల్లి పరిసరాల్లో ఒక్క తురక చెరువే కాదు.. అనేక చెరువుల్లో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, రూ.కోట్ల ధర పలికే విల్లాల గేటెడ్ కమ్యూనిటీలు విలసిల్లుతున్నాయి. - సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ అలీతలాబ్ ఆక్రమణ.. అలీతలాబ్ (హైదర్‌నగర్) చెరువు: 17 ఎకరాలు ప్రస్తుతం మిగిలింది: 10 ఎకరాలు. ఆక్రమణలు: హైదర్‌నగర్ పరిధిలోని రాంనరేశ్నగర్ కాలనీ, శ్మశానవాటికతో కొంతమంది కబ్జాచేశారు. .. 172 సర్వే నంబర్‌కు చెందిన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఫెన్సింగ్ వేశారు. తూమును కబ్జా చేస్తూ ఓ కళాశాల నిర్మాణం చేపట్టింది. ఓ బిల్డర్ దాదాపు రెండు ఎకరాల స్థలంలో అపార్ట్మెంట్లను నిర్మించారు. అంబీర్‌చెరువు హాంఫట్.. అంబీర్ చెరువు(ప్రగతి నగర్): 156 ఎకరాలు మిగిలింది: 100 ఎకరాలు. ఆక్రమణలు: లేక్‌వ్యూ కాలనీ, శ్రీనివాసనగర్, ప్రగతినగర్ అపార్ట్మెంట్లు, నెస్ట్ అపార్ట్మెంట్, నిజాంపేటలో విల్లాలు, ఆదిత్యనగర్, కృష్ణవేణినగర్, శ్రీరామ్‌నగర్, తది తర ప్రాంతాలు. కొందరు రాజకీయ నాయకులు ఎకరాలకొద్ది కబ్జాచేసి అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మించారు. కాముని చెరువు.. కాముని చెరువు(ఖైత్లాపూర్): 100 ఎకరాలు మిగిలింది: సుమారు 50 ఎకరాలు. ఆక్రమణలు: రెండు మూడు కాలనీలు ఈ చెరువులోనే వెలిశారుు. దీనికితోడు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ సంస్థ చెరువు భూములను చెరపట్టింది. ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా మట్టి నింపి భూములను కొనుగోలు చేసుకున్నవారు బారికేడ్లను ఏర్పాటు చేశారు. భీమునికుంట వధ.. భీమునికుంట(హెచ్ఎంటీ శాతవాహన నగర్): 10 ఎకరాలు మిగిలింది: 6 ఎకరాలు. ఆక్రమణలు: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఐదు ఎకరాలను ప్రైవేట్ భూమిగా చూపిస్తూ ఆక్రమించారు. కొన్ని ప్రైవేట్ నిర్మాణాలు కూడా ఉన్నాయి. కూకట్పల్లి చెరువు.. నల్లచెరువు (కూకట్పల్లి): 50 ఎకరాలు మిగిలింది: 25 ఎకరాలు. ఆక్రమణలు: రామయ్యనగర్, శేషాద్రినగర్తో పాటు కూకట్‌పల్లికి చెందిన పలువురు పెద్దలు ఇక్కడి నిర్మాణాలకు అండగా నిలిచి చెరువు ప్రాంతాన్ని కూడా ఆక్రమించారు. ఎల్లమ్మ చెరువు... ఎల్లమ్మ చెరువు (ఎల్లమ్మబండ): 46 ఎకరాలు మిగిలింది: 30 ఎకరాలు. ఆక్రమణలు: హెచ్ఎంటీ శాతావాహన కాలనీ, జయనగర్ కాలనీతోపాటు పలు నిర్మాణాలు వచ్చారుు. ప్రైవేట్ లే అవుట్‌ను కూడా కొందరు చెరువులోనే చూపిస్తున్నారు. సున్నంచెరువు సున్నంచెరువు (మోతీనగర్): 25 ఎకరాలు మిగిలింది: 10 ఎకరాలు. ఆక్రమణలు: సున్నం చెరువులో సైతం పేదల బస్తీల పేరుతో కొందరు ప్లాట్లు చేసి విక్రరుుంచారు. ఖాజాకుంట.. ఖాజాకుంట (మెట్రో వెనకాల): 20 ఎకరాలు మిగిలింది: 5 ఎకరాలు. ఆక్రమణలు: విజ్ఞాన్పురికాలనీతో పాటు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. ఐడియల్గా ఉందని, సొంతం చేసుకున్నారు. రంగదాముని చెరువు.. రంగదాముని(ఐడీఎల్) చెరువు: 40 ఎకరాలు మిగిలింది: 30 ఎకరాలు. ఆక్రమిత ప్రాంతాలు: ఓ కళాశాలతోపాటు బాలాజీనగర్, వివేక్నగర్ల వెనుకవైపున చెరువు ఎఫ్టీఎల్లో ఆక్రమణలు చోటుచేసుకున్నారుు. కిందికుంటను నమిలేశారు కింది కుంట(హైదర్‌నగర్): 18 ఎకరాలు మిగిలింది: 6 ఎకరాలు. ఆక్రమణలు: అల్లాపూర్ సొసైటీతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే వెంక టశివరామరాజు కు చెందిన విల్లాలు కూడా ఈ చెరువు పక్కనే నిర్మించారు. బోయిన్ చెరువు.. బోరుున్ చెరువు (బోరుున్‌పల్లి): 100 ఎకరాలు మిగిలింది: సుమారు 50 ఎకరాలు ఆక్రమణలు: ఇక్కడ కాలనీలు, బస్తీలతో పాటు పలు కమర్షియల్ నిర్మాణాలు సైతం వెలిశారుు. ఇక్కడ అధికారంలో ఉన్న నాయకులు ఆధిపత్యం చెలారుుస్తూ చెరువును చెరపట్టిస్తున్నారు. మైసమ్మ చెరువు .. మైసమ్మ చెరువు (మూసాపేట): 100 ఎకరాలు మిగిలింది: దాదాపు 50 ఎకరాలు. ఆక్రమణలు: పట్టా భూము లు ఇళ్ల స్థలాలతో నిండిపోయారుు. ఎలాంటి అనుమతులు లేకుండా పేదల బస్తీల పేరుతో చెరువులోకి చొచ్చుకొచ్చారుు. కేపీహెచ్‌బీలోని 30 ఎకరాల ముళ్లకత్వ చెరువు.. హైటెక్‌సిటీ బ్రిడ్జి నిర్మాణంతో కుంచించుకుపోరుుంది. ఆల్విన్‌కాలనీలో 6 ఎకరాల్లో ఉండాల్సిన బందంకుంట ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోవటం గమనార్హం. అల్విన్ కాలనీలోనే 50 ఎకరాల్లో ఉండాల్సిన పరికి చెరువు రియల్ఎస్టేట్ వెంచర్లతో ప్రస్తుతం సుమారుగా 30 ఎకరాలకు మిగిలింది. చుట్టు రెండు మూడు లే అవుట్లు చెరువులోనే వెలిశారుు. దీంతో కొన్ని నిర్మాణాలు కూడా చెరువులోనే ఉన్నారుు. శ్రీ రక్షణకు చర్యలు చేపట్టాలి నాలాల కబ్జాల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన కిర్లోస్కర్ తరహాలోనే.. చెరువులు, కుంటల ఆక్రమణలపై కూడా కిర్లోస్కర్ లాంటి నిపుణుల బృందాన్ని నియమించి వెంటనే చర్యలు చేపట్టాలి. లేనట్లయితే వచ్చే పదేళ్లలో శివారు ప్రాంతాలన్నీ బండారి లే అవుట్‌ను తలపించడం ఖాయం. ముప్పు ఏర్పడిన తర్వాత కంటే, ముందుచూపుతో వ్యవహరించడమే మేలు. - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ -
కాంక్రీట్‌తోనే భవనానికి దృఢత్వం
భారతి సిమెంట్ సీజీఎం మల్లారెడ్డి తిరుచానూరు: భవనం సుదీర్ఘకాలం దృఢంగా ఉండాలంటే నాణ్యమైన కాంక్రీట్ అవసరమని భారతి సిమెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంసి.మల్లారెడ్డి చెప్పారు. నాణ్యమైన కాంక్రీట్ తయారీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్లో మంగళవారం రాత్రి సివిల్ ఇంజినీర్లు, డీలర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ మంచి సిమెంటుతోనే నాణ్యమైన కాంక్రీటు తయారీ సాధ్యమన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా భారతి సిమెంటు అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని సొంతం చేసుకుందని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ఐవి.రమణారెడ్డి భవన నిర్మాణానికి కాంక్రీటు తయారీలో మెళకువలను సూచించారు. కాంక్రీటు తయారీలో జల్లి, ఇసుక, కంకర ఎంత ముఖ్యమో నాణ్యమైన సిమెంటు అంతే ముఖ్యమని, లేకుంటే భవనం స్వల్ప కాలంలోనే కూలిపోయే స్థితికి చేరుకుంటుందని చెప్పారు. నాణ్యమైన కాంక్రీటు తయారీకి భారతి సిమెంటు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ రాయలసీమ ఏజీఎం ఎంఎన్.రెడ్డి, తిరుపతి బ్రాంచ్ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ కె.మల్లికార్జున్‌రెడ్డి, టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ చాయాపతి, మార్కెటింగ్ ఆఫీసర్లు వెంకట్రామరెడ్డి, బాలకృష్ణ పాల్గొన్నారు. -
ఇక ఒకే రోడ్డు... 30 ఏళ్లు!
-
స్మార్ట్ టైల్స్ వచ్చేశాయ్!
మార్కెట్లోకి ఐక్యూ స్మార్ట్ టైల్స్ - ఏసీపీ ఎలివేషన్స్‌కు ప్రత్యామ్నాయం - తక్కువ ధర.. పర్యావరణహితం కూడా.. సాక్షి, హైదరాబాద్: కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనం కొద్ది రోజుల్లోనే మసకబారిపోతే.. దుమ్ము, ధూళి కారణంగా భవనాల గోడలు అందవిహీనంగా మారిపోతే.. కష్టపడి సంపాదించిన సొమ్ము కాంక్రీట్ పాలవకుండా ఉండాలంటే భవనాలకు రక్షణ కవచం (ఫ్రంట్ ఎలివేషన్) అవసరం. ప్రస్తుతం దీనికోసం అల్యూమినియం కాంపోసైట్ ప్యానెల్ (ఏసీపీ) ఎలివేషన్స్‌ను వాడుతున్నారు. అయితే ఇది కాసింత ఖర్చుతో కూడుకున్న పని. పెపైచ్చు ఏసీపీలతో భవనం లోపల వేడెక్కువగా ఉంటుంది. ఇలాంటి చిక్కులేవీ లేకుండా తక్కువ ఖర్చుతో.. అందంగా, ఆహ్లాదంగా ఉండే ఐక్యూ స్మార్ట్ టైల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. తెలంగాణలో ఏకైక ఐక్యూ స్మార్ట్ టైల్స్ సప్లయర్ అయిన కాచిగూడలోని హోమ్ 360 డిగ్రీ యజమాని శ్రీనాథ్ రథి ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. - సాధారణంగా టైల్స్ 11-13 ఎంఎం మందం ఉంటాయి. కానీ ఐక్యూ టోన్ మాత్రం 8 ఎంఎం మాత్రమే ఉంటాయి. గట్టిదనంలో ఏమాత్రం తక్కువ కాదు. వీటిని ఇటాలియన్, స్పెయిన్, చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. వీటి ప్రత్యేకత ఏంటంటే.. ప్రస్తుతం భవనాల ఎలివేషన్స్‌కు వాడుతున్న అల్యూమినియం కాంపోసైట్ ప్యానెల్స్ (ఏసీపీ)లకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు. దీంతో భవనం లోపలికి వేడి రాదు. ఫలితంగా ఏసీ, కూలర్ల వాడకం తగ్గుతుంది. విద్యుత్ బిల్లు మోత తప్పుతుంది. ఇతర భవనాలతో పోల్చుకుంటే ఐ క్యూ స్మార్ట్ టైల్స్ ఎలివేషన్స్ ఉన్న భవనాల్లో వేడి 20-25 శాతం తక్కువగా ఉంటుంది. ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను, వేడిని తట్టుకుంటాయి కూడా. - 13 కిలోల బరువుండే ఈ స్మార్ట్ టైల్స్.. 2 ఎంఎం వరకు ఎటువైపంటే అటువైపు మళ్లుతుంది. దీంతో ఎలివేషన్స్ వాడకంలో వంపులుగా ఉన్న దగ్గర సులువుగా వంగుతాయి. వీటికి మెయింటెనెన్స్ అవసరమూ లేదు. వీటి ధర చ.అ.కు రూ.120-170 వరకు ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాంటినెంటల్ ఆసుపత్రిలో 6 వేల చ.అ.ల్లో ఫ్రంట్ ఎలివేషన్స్‌కు వీటినే వినియోగిస్తున్నారు. - క్యూ టోన్ అనే మరో రకం టైల్స్ కూడా ఉన్నాయి. ఇవి అహ్మదాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటాం. వీటి ధరలు వాల్ టైల్స్ అయితే చ.అ.కు రూ.75-300 వరకు, ఫ్లోర్ టైల్స్ అయితే చ.అ.కు రూ.80-200 వరకున్నాయి. - ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసే స్టోన్ ఆర్ట్ టైల్స్ కూడా మార్కెట్లోకి వచ్చేశాయి. ఒక్కో గదికి ఒక్కో టైల్స్ వేసుకోవటం ఫ్యాషన్‌గా మారింది కూడా. ఇవి నార్వే, ఇస్తాంబుల్, కెనడా, అమెరికా, ఆఫ్రికా, టర్కీ వంటి సుమారు 20 దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. అన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చినవే. వీటి ధర చ.అ.కు రూ.600-900 వరకుంటుంది. అన్ని రకాల సైజులుంటాయి. - స్పానిష్, ఇటాలియన్, చైనా దేశాల టైల్స్‌తో పాటు నిట్కో, సొమానీ, సింపోలో, మోటో వంటి అన్ని బ్రాండ్ల టైల్స్‌ను సరఫరా చేస్తున్నాం. పెద్ద మొత్తంలో కొనుగోళ్లకు విదేశీ టైల్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన రోజు నుంచి 45-60 రోజుల్లో, మన దేశ బ్రాండ్లయితే 10 రోజుల్లోపే డెలివరీ చేస్తాం. గతేడాది రూ.12 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ఈ ఏడాది 30 శాతం వృద్ధి రేటును ఆశిస్తున్నాం. పూర్తిగా గ్లాస్‌తో తయారైన డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ కూడా ఉన్నాయి. 6 ఎంఎం, 8 ఎంఎం మందంతో ఉండి ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఫినిషింగ్ కావటం వీటి ప్రత్యేకత. అంతేకాదు.. మనకు నచ్చిన ఫొటోలు, చిత్రాలను ఈ టైల్స్‌పైన ప్రింట్ చేసుకోవచ్చండోయ్. వీటిని ఎక్కువగా పబ్బులు, రెస్టారెంట్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో డెకొరేటివ్ కోసం వాడతుంటారు. ఇంటి విషయానికొస్తే.. చిన్నపిల్లల గ ది, వంట గది, లివింగ్ రూముల్లో ఉపయోగిస్తారు. చిన్న పిల్లల గదుల్లో వాడే ఈ టైల్స్‌పై స్పైడర్ మ్యాన్, చోటా భీం, మిక్కీ మౌస్ వంటి పిల్లలకు ఇష్టమైన బొమ్మలను ముద్రించుకోవచ్చు. అలాగే వంట గదుల్లో అయితే కూరగాయలు, పండ్ల వంటి మనకిష్టమైన ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చు. ఇవి ఢిల్లీ నుంచి దిగుమతి అవుతాయి. అన్ని రకాల రంగుల్లో, సైజుల్లో లభ్యమవుతున్న డీక్రిస్టల్ టైల్స్ ధరలు చ.అ. కు రూ.800-1,600 వరకు ఉంది. -
ఇసుక ధరపై దోబూచులాట!
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఇసుక ధర విషయంలో జిల్లా ఆధికారులు, మంత్రి దోబూచులాడుతున్నారు. పాలకులు, ఆధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో అయోమయం నెలకొంది. ధర తగ్గించాలని సాక్షాత్తు మంత్రి సూచించినా అధికారులు 95 జీవోను బూచిగా చూపి పాత ధరనే కొనసాగిస్తున్నారు. ఇసుక ధరను క్యూబిక్ మీటరుకు 675గా అధికారులు నిర్ణయించారు. దీన్ని రూ.550కి తగ్గించాలని జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇది జరిగి వారం రోజులు గడి చాయి. అయినా మంత్రి ఆదేశాలు అమలుకాలేదు. ధర తగ్గలేదు. అలాగే నాటుబళ్లవారికి ఉచింతంగా ఇసుక తవ్వుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ప్రజాప్రతినిధు లు కోరగా 95 జీవో ప్రకా రం అది సాధ్యం కాదని ఆధికారులు తోచిపుచ్చుతున్నారు. దీంతో నాటుబళ్ల వారికి ఉపాధి దూరం కాగా.. సామాన్యులకు ఇంటి నిర్మాణంగా భారంగా పరిణమించింది. వినియోగం, నాణ్యతను బట్టి ఇసుకను ప్రభుత్వం మూడు రకాలు గా వర్గీకరించింది. కాంక్రీట్, ప్లాస్టరింగ్‌లకు వాడేదాన్ని మొదటి రకం గా గుర్తించి, క్యూబిక్ మీటరు ధరను రూ.675గా నిర్ణయించారు. సాధారణ కట్టడాలు, ఇతర అవసరాలకు వాడే ఇసుకను రెండో రకంగా గుర్తించి, ధరను రూ.462గా, పునాదుల్లో ఫిల్లింగ్‌కు ఉపయోగించే ఇసుకను మూడో రకంగా గుర్తించి, ధరను రూ.352గా నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికి 70 రీచ్‌లను గుర్తించగా, 12 రీచ్‌లకు మాత్రమే అనుమతులు వచ్చాయి. వీటిలో ఎనిమిది రీచుల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఏ రీచ్‌లో ఏ రకం ఇసుక అందుబాటులో ఉందన్నదాన్ని ఇంత వరకు ఆధికారులు నిర్ణయించలేదు. దీనిపై అధికారుల్లోనే స్పష్టం లేదు. దీంతో అన్ని రీచుల్లోనూ మొదటి రకం ధర రూ.675కే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది సామాన్యులకు మరింత నష్టం కలిగిస్తోంది. గుర్తించిన 70 రీచులకు అనుమతుల కోసం గత మూడు నెలలుగా జిల్లా అధికారులు కుస్తీలు పడుతున్నారు. వాటిన్నింటిలోనూ అమ్మకాల ప్రారంభానికి ఎంతకాలం పడుతుందో వారికే తెలియడంలేదు. గుర్తించిన వాటిలోనూ కల్లేపల్లి, పొన్నాడ, పురుషోత్తపురం, తలవరం వంటి రీచుల్లో వివాదాలు రేగుతున్నాయి. కొన్ని రీచ్‌లను స్థానికులు అడ్డుకొంటుంటే.. మరికొన్నింటిలో ఆధికారుల వైఫల్యం, టీడీపీ కార్యకర ్తల ఆధిపత్యం వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇసుక ధర క్యూబిక్ మీటరు రూ.70కి తగ్గించాలని భవన కార్మికులు, వినియోగదారులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటి మధ్య మూడు నెలలుగా పనులు లేక నిర్మాణ కార్మికులు వలస పోతున్నారు. కమిటీ సమావేశం తర్వాతే..: కాగా కమిటీల నిర్ణయం తర్వాతే ధర తగ్గింపుపై పునరాలోచిస్తామని జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. జిల్లా స్టాయి ఇసుక నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలు, జీవో 95లోని వివరాలు పరిశీలించన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు, ఆ కమిటీలోనే నిపుణులు ఉంటారని, వారు ఇసుక రకాలను నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. -
ఆర్డీఎస్ రగడ
గద్వాల: ఆదినుంచీ అదే రగడ.. ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) నీటి వివాదం మరోసారి రాజుకుంది. కర్ణాటకలోని తుంగభద్ర నదిపై హెడ్‌వర్క్స్ వద్ద స్పిల్‌వే గోడపై కాంక్రీట్ పనులను ఆదివారం కర్నూలు రైతుల బృందం అడ్డుకుంది. 2007లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ ఆధునికీకరణకు రూ.92 కోట్లు కేటాయించింది. అందులో భాగంగానే హెడ్‌వర్క్స్‌లో స్పిల్వేగోడపై అరడుగు మేర కాంక్రీట్ వేయాల్సి ఉంది. రాయిచూర్ జిల్లా వైపు వంద అడుగుల మేర కాంక్రీట్‌ను గతేడాది వేశారు. ప్రస్తుతం కుడివైపు కర్నూలు జిల్లా నుంచి కాంక్రీట్ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించాడు. కాగా, విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ నేత తిక్కారెడ్డి నేతృత్వంలో రైతులు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని కాంట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. ఇదీ ఆర్డీఎస్ క(వ్య)థ..! ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ నియోజకవర్గంలో సుమారు 87,500ఎకరాలకు సాగునీరు అందాల్సిఉంది. స్లూయీజ్ రంధ్రాలు కాల్వలు అధ్వానంగా మారడంతో 30వేల ఎకరాలకు మించి అందడం లేదు. దీనికితో డు 1992లో ఆర్డీఎస్ స్లూయీజ్ రంధ్రాల కర్రషట్టర్లను రాయలసీమ ప్రాంతానికి చెం దిన కొందరు నాటు బాంబులతో బద్దలుకొట్టారు. స్పందించిన ప్రభుత్వం ఇనుపషట్టర్లను ఏర్పాటు చేయించింది. ఈ ఘటన అ ప్పట్లో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతుల మధ్య సమస్యను మరింత జఠిలం చేసింది. ఈ క్రమంలో కర్నూలు రైతులు తుంగభద్ర నదికి కుడివైపున తాగునీటి పథకాలు, వ్యవసాయ అవసరాలకు నీళ్లు రాకుండా షట్టర్ల ద్వారా అడ్డుకుంటున్నారని, వాటిని తగ్గించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. 2002లో అప్పటి ప్రభుత్వం షట్టర్ల వ ద్ద మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరుచేసింది. కర్ణాటక అధికారులు పనులు ప్రారంభించిగా కర్నూలు రైతులు అడ్డుకున్నారు. ఇదిలాఉండగా, దశాబ్దాలు గా నలుగుతున్న ఆర్డీఎస్ సమస్యకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాశ్వత పరి ష్కారం చూపుతామని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హామీఇచ్చారు. ఆ మాదిరిగానే 2004లో అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక మేరకు ఆర్డీఎస్ ఆధునికీకరణ కోసం రూ.92కోట్లు మంజూరుచేశారు. ఇందులో కర్ణాటకలో రూ.72 కోట్లు, అలంపూర్ నియోజకవర్గంలో రూ.20కోట్లతో మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించాలి ఆర్డీఎస్ పనులను అడ్డుకోవడం సరికాదు. ఎవరికి నష్టం చేసే పనుల్లేవు. కేవలం అక్కడి ప్రాంత రైతుల మెప్పు కోసమే నాయకులు అలా చేస్తున్నారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు ఇచ్చిన నిధుల ఆధునికీకరణ పనులు కొనసాగుతుంటే అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి త్వరలోనే ఆర్డీఎస్ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. సుంకేసుల బ్యారేజీని తొలగించి నీటిమళ్లింపు పథకంలా పాత లెవల్లోనే ఉండేలా చర్యలు చేపట్టాలి. - తనగల సీతారాంరెడ్డి,ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ -
ఔరా... ఆవులే క్యాన్వాసులా!
కళాత్మకం వేసవి వస్తే పలు ప్రాంతాల్లో పలు రకాల ఫెస్టివల్స్, కార్నివాల్స్ జరుగుతుంటాయి కదా! లగ్జెంబర్గలో కూడా ఓ ఫెస్టివల్ జరుగుతుంది. దాని గురించి తెలిస్తే కాస్త సరదాగా, కాస్త విచిత్రంగా కూడా అనిపిస్తుంది. మార్చి నెల రాగానే ఆ దేశంలో సందడి మొదలవుతుంది. అందరూ ఆవుల బొమ్మలు తయారు చేయడంలో మునిగిపోతారు. పలు రకాల లోహాలు, చెక్క, కాంక్రీట్ వంటి వాటితోటి అందరూ ఆవు బొమ్మలను తయారు చేసుకుంటారు. వీటి మీద తమకు నచ్చిన చిత్రాలను గీసి, వాటికి మంచి మంచి రంగులు వేస్తారు. ఏప్రిల్ నెల వచ్చేసరికి మొదలవుతుంది అసలు సందడి. అందరూ తమ ఇళ్లముందు తాము తయారుచేసిన ఆవు బొమ్మల్ని ప్రతిష్ఠిస్తారు. వ్యాపారస్తులైతే తమ షాపుల ముందు వీటిని పెడతారు. నీ ఆవు బాగుందా, నా ఆవు బాగుందా అంటూ ఆరాలు తీస్తుంటారు. దాదాపు నవంబర్ నెల వరకూ ఈ తంతు నడుస్తుంది. ఇది ఆ దేశంలో ఎంతోకాలంగా ఉన్న సంప్రదాయం. ఏటా ఆ దేశంలో రంగురంగుల ఆవుల పండుగ జరుగుతూనే ఉంటుంది. ఆ ఆవుల అందాలు చూడటానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తుంటారు! -
గోడలకు పగుళ్లుండవ్!
న్యూయార్క్: పగుళ్లు లేకుండా భవనాలు చిరకాలం ఉండేలా కొత్తరకం కాంక్రీట్‌ను పరిశోధకులు అభివృద్ధిపరిచారు. ‘సూపర్‌హైడ్రోఫోబిక్’గా పిలిచే ఈ కాంక్రీట్ తనలో ఉండే నీటిని విసర్జిస్తూ గోడలు మన్నికగా ఉండేందుకు తోడ్పడుతుంది. విస్కన్సన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు. ‘ఈ పరిశోధనలో మేం మంచి ఫలితాలను సాధించాం’ అని స్కాట్ ముజెన్స్కీ తెలిపాడు. వీళ్లు రూపొందించిన కాంక్రీట్‌లో సెన్సార్లు అమర్చుతారు. ఇవి గోడల్లో వస్తున్న మార్పులను పరిశీలించడమే కాకుండా...పగుళ్లను సాధ్యమైనంతవరకు నిరోధించేందుకు ప్రయత్నిస్తుంది. ఒక వేళ నీటిచారలు, పగుళ్లు వచ్చే అవకాశం ఉంటే బ్లూటూత్, వై-ఫైల ఆధారంగా మనకు సందేశాలు కూడా పంపిం చి, హెచ్చరికలు జారీచేస్తుంది.