వర్షాకాలం వచ్చిందంటే చాలు. రోడ్లు పాడవటమే కాదు. ఎక్కడపడితే అక్కడ గుంతలూ తేలుతాయి. ఇంకేముంది!! కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్. ఇక హైదరాబాద్‌లో ఇరుకు రోడ్లతో జనం కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చంటోంది సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ). వైట్ టాపింగ్ టెక్నాలజీతో వేసిన కాంక్రీటు రోడ్లను దీనికి చక్కని పరిష్కారంగా చెబుతోంది. ఈ రోడ్ల జీవిత కాలం 25-30 ఏళ్ల వరకు ఉంటుంది. ఎలాంటి నిర్వహణ ఖర్చూ ఉండదు. మధ్యలో రోడ్డు దెబ్బతింటుందన్న సమస్యే లేదు. విమానాశ్రయాల్లో రన్ వే మాదిరి రోడ్లు అందంగానూ ఉంటాయి. సీఎంఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలిసారిగా బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో ఒక కిలోమీటరు మేర ప్రయోగాత్మకంగా వైట్ టాపింగ్ టెక్నాలజీతో కాంక్రీటు రోడ్డు నిర్మాణం బుధవారం ప్రారంభమైంది. తారు రోడ్డును కాంక్రీటు రోడ్డుగా మార్పే ఈ వైట్ టాపింగ్. కోట్లాది రూపాయలు ఆదా...: ఒక చదరపు మీటరుకు తారు రోడ్డుకు సుమారు రూ.1,250 వ్యయం అవుతుంది. రోడ్ల జీవిత కాలం 3-4 ఏళ్లు మాత్రమే. పైగా నిర్వహణ ఖర్చులు ఏడాదికి ఒక కిలోమీటరుకు రూ.3.5 లక్షలకుపైమాటేనని అంచనా. అయితే వైట్ టాపింగ్ కాంక్రీట్ రోడ్డుకు చదరపు మీటరుకు రూ.1,400-1,500 అవుతుంది. నిర్వహణ ఖర్చులు ఉండవు. కేబుల్స్ వేయడానికి మధ్యలో రోడ్డును తవ్వాల్సిన అవసరమే లేదని భారతి సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీందర్ రెడ్డి తెలిపారు.
Published Thu, Jul 30 2015 1:16 PM | Last Updated on Wed, Mar 20 2024 1:04 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement