కాంక్రీట్‌కు శక్తినిచ్చే ప్లాస్టిక్‌ | Concrete powered plastic | Sakshi
Sakshi News home page

కాంక్రీట్‌కు శక్తినిచ్చే ప్లాస్టిక్‌

Published Thu, Oct 26 2017 11:59 PM | Last Updated on Thu, Oct 26 2017 11:59 PM

Concrete powered plastic

భవన నిర్మాణంలో విస్తృతంగా వాడే కాంక్రీట్‌ను మరింత దృఢంగా చేసేందుకు ఎంఐటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పద్ధతిని కనుగొన్నారు. వ్యర్థంగా పారేస్తున్న ప్లాస్టిక్‌ బాటిళ్లతో కాంక్రీట్‌ను గట్టిగా చేయవచ్చునని ప్రయోగాత్మకంగా నిరూపించారు. సిమెంట్‌ తయారీలో కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణంలోకి చేరతుందనేది తెలిసిందే. ప్లాస్టిక్‌ వ్యర్థాల వల్ల నేల, నీరు కలుషితం అవుతోందని తరచూ వింటుంటాం. ఈ నేపథ్యంలో కాంక్రీట్‌ తయారీని పర్యావరణ హితంగా మార్చడం ఎలా అన్న ఆలోచనలను ఎంఐటీ శాస్త్రవేత్తలు చేశారు. ఈ క్రమంలో కాంక్రీట్‌కు ప్లాస్టిక్‌ను కలిపి చూశారు. కొంత కాలానికే కాంక్రీట్‌ పగుళ్లుబారింది. అయినా పరిశోధనలు ఆపలేదు.

ప్లాస్టిక్‌ను గామా కిరణాల ప్రభావానికి గురి చేసి ఆ తర్వాత పొడి చేసి కాంక్రీట్‌కు కలిపి చూశారు. కాంక్రీట్‌ సామర్థ్యం 20 శాతం వరకూ పెరిగినట్లు గుర్తించారు. గామా కిరణాల శక్తి ఎక్కువైన కొద్దీ కాంక్రీట్‌ అంతేస్థాయిలో దృఢంగా మారిందని, మరిన్ని పరిశోధనల ద్వారా అత్యంత సమర్థవంతమైన మిశ్రమాన్ని రూపొందిస్తామని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త కునాల్‌ కుప్వాడే పాటిల్‌ తెలిపారు. ఈ కొత్త కాంక్రీట్‌ను ఎక్స్‌రే ద్వారా పరిశీలించినప్పుడు వాటిల్లోని స్ఫటికాలు చాలా దట్టంగా ఉన్నట్లు గుర్తించామని, రేడియోధార్మికత ప్రభావమూ లేదని పాటిల్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement