
ప్రముఖ మలయాళ హీరోయిన్ అర్చన కవి పెను ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. కొచ్చిలో ఆమె కారులో ప్రయాణిస్తున్న సమయంలో మెట్రో శ్లాబ్ ఆమె కారుపై పడింది. దీంతో కారు అద్దలు పగిలిపోవడమే కాకుండా.. చిన్న కాంక్రీట్ ముక్క కారులోకి చొచ్చుకువచ్చింది. అయితే అదృష్ణవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
ఈ ఘటనపై అర్చన ట్విటర్ వేదికగా స్పందించారు. కారు డ్రైవర్‌కు నష్ట పరిహారం అందజేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మేము కారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్నప్పుడు కాంక్రీట్ శ్లాబ్ మా కారుపై పడింది. కొద్దిపాటిలో మేము ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. కారు దెబ్బతినందుకు గాను డ్రైవర్‌కు నష్ట పరిహారం అందజేయాల్సిందిగా కొచ్చి మెట్రో, కొచ్చి పోలీసు అధికారులను కోరుతున్నాను. ఈ ఘటనపై విచారణ జరపడమే కాకుండా.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల’ని అర్చన ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, పలు మాలయాళ చిత్రాల్లో నటించిన అర్చన.. తెలుగులో మధుర శ్రీదర్ దర్శకత్వం వహించిన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంలో నటించారు.