లండన్: ఆసియాలో అత్యంత ఆకర్షణీయ మహిళగా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ నిలిచారు. 50 మందితో కూడిన జాబితాలో ఆమె అగ్రస్థానం పొందారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న వార పత్రిక ‘ఈస్టర్న్ ఐ’ ఈ జాబితాను విడుదల చేసింది. వివాదాలకు దూరంగా ఉండే దీపికా పదుకోన్..ఎంత ఎదిగినా వినయ విధేయతలతో మెలగడం ఆమె విశిష్టత అని ఆ పత్రిక ఫీచర్స్ ఎడిటర్ నజీర్ అన్నారు. గతేడాది తొలిస్థానంలో నిలిచిన ప్రియాంక చోప్రా ఈ ఏడాది రెండో ర్యాంక్ పొందారు. బుల్లితెర నటి నియా శర్మకు మూడో స్థానం దక్కింది. పాకిస్తాన్ నటి మహిరా ఖాన్‌కు నాలుగు, శివంగి జోషికి 5, ఆలియా భట్‌కు 6, సోనమ్ కపూర్‌కు 7, హినాఖాన్‌కు 8, కత్రినా కైఫ్‌కు 9, నీతి టేలర్‌కు 10వ స్థానాలు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment