
తమన్నా, సుందర్ సి, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాక్’. సుందర్ సి. దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్, తెలుగులో ఈ నెలలోనే విడుదల కానుంది.
ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివానీ పాత్రలో తమన్నా, శివ శంకర్‌గా సుందర్ సి. నటించారు. వారి పాత్రలను పరిచయం చేస్తూ లుక్స్ రిలీజ్ చేశారు. ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బాక్’’ అన్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment