‘‘బాక్’ మూవీ ట్రైలర్ చూస్తే సుందర్‌గారు ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టరో తెలుస్తుంది. షూటింగ్‌లో చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అని హీరోయిన్ తమన్నా అన్నారు. సుందర్ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అరణ్మనై 4’. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
అవ్ని సినిమాక్స్‌పై ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్’ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ తెలుగులో మే 3న రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో నా సినిమా జర్నీ సురేష్ ప్రోడక్షన్ నుంచే మొదలైంది. ‘బాక్’ని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్‌గారికి, జాన్వీకి థ్యాంక్స్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం థియేటర్స్‌లో అదరగొడుతుంది’’ అన్నారు.
‘‘బాక్’లో హారర్, గ్లామర్, థ్రిల్, కామెడీ.. ఇలా అన్నీ ఉన్నాయి’’ అన్నారు రాశీ ఖన్నా. ‘‘ఈ మూవీని థియేటర్స్‌లో చూడండి.. ఎంజాయ్ చేస్తారు ’’అన్నారు జాన్వీ నారంగ్. ‘‘చాలా కాలం తర్వాత ‘బాక్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీ’’ అన్నారు కోవై సరళ.
Comments
Please login to add a commentAdd a comment