న్యూఢిల్లీ: నిమ్మ రసం రుచిని తలపించే సాఫ్ట్‌డ్రింక్ స్ప్రైట్.. భారత మార్కెట్లో బిలియన్ డాలరు (దాదాపు రూ. 8,300 కోట్లు) బ్రాండుగా ఎదిగింది. బ్రాండ్ మాతృ సంస్థ కోక–కోలా కంపెనీ చైర్మన్ జేమ్స్ క్విన్సీ ఈ విషయం వెల్లడించారు. 2022 మూడో త్రైమాసికంలో భారత మార్కెట్లో అమ్మకాల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ప్రథమార్ధంలో కోక–కోలా మార్కెట్ షేరును పెంచుకోవడం కొనసాగిందని పేర్కొన్నారు.
స్థానిక పరిస్థితులకు, సందర్భాలకు అనుగుణంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు, ప్రకటనలతో స్ప్రైట్ బిలియన్ డాలర్ బ్రాండుగా మారిందని క్విన్సీ వివరించారు. కోక–కోలాకు అంతర్జాతీయంగా భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్. దేశీ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ 2021లో బిలియన్ డాలర్ బ్రాండ్‌గా చేరిందని ఈ ఏడాది జనవరిలో కంపెనీ ప్రకటించింది.
చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే!
Comments
Please login to add a commentAdd a comment