Sprite
-
రెండేళ్లలో ఆ టార్గెట్‌ని చేరుకుంటాం: కోకా–కోలా
వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని ‘మాజా’ సాఫ్ట్ డ్రింక్ కూడా బిలియన్ డాలర్ బ్రాండ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్ అప్, స్ప్రైట్ సాఫ్ట్ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్ డాలర్ బ్రాండ్లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్‌ఫోలియోలో మూడోది అవుతుంది. ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. రిలయన్స్ రిటైల్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ, స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్‌కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ ఇటీవలే దేశీ బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్ క్రమంగా బెవరేజెస్ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. చదవండి: అమెజాన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్, ఏడాదికి రూ.599కే -
బిలియన్ డాలర్ బ్రాండ్‌గా స్ప్రైట్
న్యూఢిల్లీ: నిమ్మ రసం రుచిని తలపించే సాఫ్ట్‌డ్రింక్ స్ప్రైట్.. భారత మార్కెట్లో బిలియన్ డాలరు (దాదాపు రూ. 8,300 కోట్లు) బ్రాండుగా ఎదిగింది. బ్రాండ్ మాతృ సంస్థ కోక–కోలా కంపెనీ చైర్మన్ జేమ్స్ క్విన్సీ ఈ విషయం వెల్లడించారు. 2022 మూడో త్రైమాసికంలో భారత మార్కెట్లో అమ్మకాల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఆయన తెలిపారు. ప్రథమార్ధంలో కోక–కోలా మార్కెట్ షేరును పెంచుకోవడం కొనసాగిందని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులకు, సందర్భాలకు అనుగుణంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమాలు, ప్రకటనలతో స్ప్రైట్ బిలియన్ డాలర్ బ్రాండుగా మారిందని క్విన్సీ వివరించారు. కోక–కోలాకు అంతర్జాతీయంగా భారత్ అయిదో అతి పెద్ద మార్కెట్. దేశీ సాఫ్ట్ డ్రింక్ థమ్స్ అప్ 2021లో బిలియన్ డాలర్ బ్రాండ్‌గా చేరిందని ఈ ఏడాది జనవరిలో కంపెనీ ప్రకటించింది. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
స్ప్రైట్ అనుకుని విషం తాగిన చిన్నారులు
మంచిర్యాల టౌన్ (ఆదిలాబాద్) : పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు చిన్నారులకు రోడ్డు పక్కన స్ప్రైట్ బాటిల్ కనిపించింది. దీంతో ఇద్దరు చిన్నారులు అందులో స్ప్రైట్ ఉందనుకొని తీసుకొని తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ స్ప్రైట్ బాటిల్లో పురుగుల మందు ఉండటంతోటే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా దహెగాం మండలంలోని తిమ్మాపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆకుల ఆంజనేయ ప్రసాద్(11), సోమిశెట్టి అజయ్(11) అనే ఇద్దరు చిన్నారులు స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన స్ప్రైట్ బాటిల్ కనిపంచడంతో ఇద్దరు తాగారు. దీంతో వారి పరిస్థితి విషమంచింది. ఇది గుర్తించిన స్థానికులు వారిని మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.