ఐస్‌క్రీమ్‌ తలనొప్పి! | Did the hedge begin as cold drinks? | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌ తలనొప్పి!

Published Wed, Nov 8 2017 12:09 AM | Last Updated on Wed, Nov 8 2017 5:36 AM

Did the hedge begin as cold drinks? - Sakshi

మీరు ఐస్‌క్రీమ్‌ లాంటి చల్లటి పదార్థం ఏదైనా తినగానే మీకు తలనొప్పి వస్తోందా? లేదా మీరు కూల్‌డ్రింక్స్‌ తాగగానే హెడేక్‌ మొదలవుతోందా?వైద్యపరిభాషలో ‘స్ఫినోపాలటైన్‌ గాంగ్లియోన్యూరాల్జియా’ అనే వ్యాధి వల్ల ఇలా జరుగుతుంది. ఈ జబ్బును వాడుక భాషలో ‘ఐస్‌క్రీమ్‌ హెడేక్‌’ అంటారు. కొంతమంది మైగ్రేన్‌ బాధితుల్లో కూడా ఈ తరహా తలనొప్పి కనిపిస్తుంటుంది. చల్లటి పదార్థం తగలగానే నోటిలోని ఖాళీస్థలాలలోకి తెరచుకునే రక్తనాళాలు సత్వరం సంకోచిస్తాయి. దాంతో ఆ విషయాన్ని మెదడుకు తెలిపేందుకు సంబంధిత నరం ప్రతిస్పందిస్తుంది.

అలా నోట్లోని ఇబ్బందికరమైన పరిస్థితి తలకు పాకుతుంది. ఇలా ఒకచోటి సమస్య మరోచోటికి పాకడాన్ని ‘రిఫరింగ్‌ పెయిన్‌’ అంటారు.నొప్పి నోటిలోని పై భాగానికి అంటే... అంగిలిలోకి పాకుతుంది. ఇలా పాకడంతో వచ్చే ఈ నొప్పిని కూడా రిఫరింగ్‌ పెయిన్‌ అంటారు. ఈ ఐస్‌క్రీమ్‌ తలనొప్పి లేదా రిఫరింగ్‌ పెయిన్‌ నిరపాయకరం. కేవలం 20 సెకండ్ల నుంచి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాస్త గోరు వెచ్చని నీళ్లతో పుక్కిలించగానే ఈ నొప్పి తగ్గిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement