
యశవంతపుర : పర్యటకులు తాగి పడేసిన కూల్‌డ్రింక్ టిన్‌లో తలదూర్చిన పాము చిక్కుకుని విలవిలలాడింది. చివరకు ఓ వ్యక్తి చొరవ తీసుకుని పాముకు స్వేచ్ఛ కల్పించారు. ఈ సంఘటన చిక్కమగళూరు తాలూకా మల్లందూరు గ్రామంలో జరిగింది. రోడ్డు పక్కన మిరిండా ఖాళీ టిన్ ఒక జెర్రిపోతు పాముకు కనపడింది. ఆ పానీయం రుచి చూద్దామని కాబోలు అది టిన్ రంధ్రం గుండా తలను లోపలకు దూర్చింది. అయితే తల తీయడానికి దాని వల్ల కాలేదు. టిన్‌లో చిక్కుకొంది. ఇలా సుమా రు గంట పాటు రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ అందోళన చెందింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రయోజనం లేకపోయింది. ఈ సమయంలో చిక్కమగళూరు నుంచి మల్లందూరుకు కారులో వెళ్తున్న వన్యప్రాణి ముఖ్యడు శ్రీదేవ్ పట్టుకుని లాగడంతో పాము బయటకు వచ్చింది. హమ్మ య్య అనుకుంటూ చెట్లలోకి వెళ్లిపోయింది.