
భద్రాద్రి: ఓ వ్యక్తి కొనుగోలు చేసిన కూల్‌డ్రింక్ సీసాలో పురుగులు కనిపించిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని స్టేషన్ బేతంపూడి గ్రామానికి చెందిన బానోత్ చంద్రు అదే గ్రామంలోని కిరాణా షాపులో ఈనెల 2న 10 కూల్‌డ్రింక్ సీసాలు కొనుగోలు చేశాడు.
ముగ్గురు కుటుంబసభ్యులు మూడు సీసాల్లోని శీతల పానీయం తాగగా వారికి వాంతులు అయ్యాయి. మిగిలిన సీసాలను గమనించగా మరో సీసాలో కూడా పురుగులు కనిపించడంతో ఖంగుతిన్నారు. సీసాలో పురుగులు ఉన్నాయని దుకాణ యజమానిని అడగగా అతడు డీలర్ వివరాలు ఇచ్చాడు.
దీంతో పాత కొత్తగూడెంలోని గోడౌన్ వద్దకు సదరు సీసాను పట్టుకెళ్లి ఈ విషయాన్ని డీలర్‌కు చెప్పగా.. అతడు తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించాడు. సోమవారం సుజాతనగర్‌లో సదరు వాహనాన్ని గుర్తించి అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment