
రాయవరం: మండే ఎండల్లో ఎవరికైనా దప్పిక వేయడం సహజం. దాహార్తితో అల్లాడుతున్న ఓ వానరానికి ఓ వ్యక్తి గ్లాసులో కూల్‌డ్రింక్ పోసి దాని సమీపంలో ఉంచాడు. ఒక్క ఉదుటున దానిని అందుకున్న ఆ వానరం కూల్‌డ్రింక్‌ను ఆత్రంగా తాగుతూనే.. తన బిడ్డకు చనుబాలు ఇచ్చిన అపురూప దృశ్యాలివి. రాయవరం మండలం మాచవరం గ్రామ సమీపంలో ‘సాక్షి’ కంటపడ్డాయి.
గ్లాసులో ఉన్నది ఏమిటబ్బా! తాగి చూస్తే పోలా!
అమ్మా.. నాకు ఇవ్వవా మరి..!
నువ్వు నా పాలు తాగు.. నేను ఈ డ్రింక్ తాగుతా