
మృతి చెందిన యువకులు
సాక్షి, అనంతపురం : అనంతపురంలోని హిందూపురంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో కూల్ డ్రింక్ తాగి ముగ్గురు యువకులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అస్వస్థతకు గురైన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ప్రశ్నించగా... లైట్‌గా టిఫిన్ చేసి, స్ప్రైట్ (కూల్ డ్రింక్) తాగామని తెలిపాడు. అయితే కూల్ డ్రింక్‌లో కల్తీ మద్యం లేదా విషం కలుపుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులను ప్రదీప్, శివగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment