
ఎండలు మండితే కూల్ డ్రింక్! నలుగురు కలిసినా.. విందువినోదాల్లో సేద తీరాలన్నా ఇదే.. ఊరెళ్లినా పక్కన ఉండాల్సిందే.. మితిమీరిన చక్కెరతో ఒళ్లు హూనమవుతుందని తెలిసినా.. తగ్గని ఈ తీపి అలవాటుకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అమ్మే ప్రతి బాటిల్‌పై ప్రభుత్వాలు పన్నుల కొరడా ఝళిపిస్తున్నాయి. మెక్సికోతో మొదలైన ఈ దాడి యూకేకూ పాకిన నేపథ్యంలో.. మనకు చేటు చేసే చక్కెర సంగతులేమిటో చూసేయండి!
ఎంత పన్ను వేస్తున్నారు?
ఐదు నుంచి ఎనిమిది శాతం చక్కెర ఉంటే.. లీటర్‌కు 18%
8 శాతం కంటే ఎక్కువ ఉంటే.. లీటర్‌కు 24%
కూల్‌డ్రింక్స్‌పై షుగర్ ట్యాక్స్ విధించిన దేశాలు 24
తొలి దేశం.. మెక్సికో(2014)
అదే బాటలో.. ఫ్రాన్స్, నార్వే, పోర్చుగల్, థాయ్‌లాండ్, స్పెయిన్. ఇదే బాటలో ఐర్లండ్, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా.
దుష్ప్రభావాలివీ..
షుగర్ అంతా క్యాలరీలతో నిండిపోయి ఉంటుంది. అందులో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, శరీరానికి అవసరమయ్యే ఫాట్స్ లాంటివేవీ ఉండవు. అప్పటికప్పుడు శక్తినిచ్చే పదార్థమే. అవసరానికి మించి షుగర్‌ని తీసుకుంటే ఎన్నో వ్యాధుల బారిన పడతాం. అవేంటో ఓసారి చూద్దాం..
♦ షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల నోట్లో హానికరమైన బ్యాక్టీరియా చేరి దంతాలు పాడైపోతాయి
♦ మన శరీరంలోని ఇన్సులిన్ వ్యవస్థ దెబ్బతిని మధుమేహ వ్యాధి(టైప్ 2) సంక్రమిస్తుంది
♦ మెటబాలిజమ్‌పై ప్రభావం చూపించి అధికంగా బరువు పెరుగుతారు. ఒబెసిటీకి దారి తీయొచ్చు
♦ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత వ్యాధులు రావొచ్చు
♦ బ్రెయిన్‌లో అధిక మోతాదులో డొపమైన్ విడుదలై పంచదార తినడం అన్నది ఒక వ్యసనంగా మారుతుంది
♦ కాలేయానికి సంబంధించి వ్యాధులు, చివరికి కేన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది
చక్కెరపై పరిమితి ఎంత?
(ఒక టీ స్పూన్ పంచదార 4.2 గ్రాములతో సమానం)
పురుషులు 9 టీ స్పూన్స్
మహిళలు 6 టీ స్పూన్స్
పిల్లలు 3 టీ స్పూన్స్
ఏ డ్రింక్స్‌లో ఎంత షుగర్!
సాఫ్ట్ డ్రింక్(600 ఎంఎల్) - 16 టీ స్పూన్స్
స్పోర్ట్స్ డ్రింక్ (600 ఎంఎల్) - 9 టీ స్పూన్స్
ఎనర్జీ డ్రింక్ (250 ఎంఎల్) - 7 టీ స్పూన్స్
Comments
Please login to add a commentAdd a comment