కూల్‌డ్రింక్‌లో బయటపడిన పురుగులు
రాయగడ : రాయగడ డైలీమార్కెట్‌లో గల దేవ్‌బంగళా దుకాణాలలో ఉండే కటక్ పాన్‌షాప్‌లో స్ప్రైట్ కుల్‌డ్రింక్ బాటిల్‌లో పురుగులు, కప్పలు బయటపడ్డాయి. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ స్ప్రైట్ కంపెనీపై, బాటిల్‌ను విక్రయించిన హోల్‌సేల్ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
స్ప్రైట్ కూల్‌డ్రింక్ పెద్ద బాటిల్ కార్టన్‌ను హోల్‌సేలర్ వద్ద తీసుకుని రిటైల్‌గా విక్రయించేందుకు కటక్ పాన్‌షాప్‌లో ఓపెన్ చేసి ఒక బాటిల్ తీసి చూడగా డ్రింక్‌లో కప్పతో సహా పురుగులు తేలి ఉన్నాయి. దీనికి సంబంధించి పాన్‌షాప్ యజమాని రాజును ప్రశ్నించగా ఈ ఘటనపై తనకేమీ తెలియదని కొత్త కార్టన్ ఓపెన్ చేసి చూడగా పురుగులు ఉన్నాయని దీనిపై హోల్‌సేల్ ఏజెంట్‌కు ఫిర్యాదు చేస్తానని వివరించాడు.
వాస్తవంగా కూల్‌డ్రింక్స్ విక్రయాలపై హెల్త్ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఫుడ్ ఇన్‌స్పెక్టర్, సివిల్ సప్లయిస్ విభాగం తరచూ దాడులు చేసి తనిఖీ చేయాలని పేరుమోసిన కంపెనీలు ప్రమాదకరమైన డ్రింక్‌లను సరఫరా చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment