
నాగోలు: కూల్‌డ్రింక్ లో మత్తు మందు కలిపి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడమేగాక, బ్లాక్ మెయిల్ చేస్తున్న భార్యాభర్తలపై ఎల్‌బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన మహిళను అర్టెస్ చేసి రిమాండ్ తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్‌బీనగర్ హస్తినాపురం కాలనీ చెందిన తాళ్లూరి సౌందర్య స్రవంతి, అమె భర్త ప్రవీణ్‌కుమార్‌రాజ్ నగరంలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. 2017 అక్టోబర్‌లో ఓ యువతి వారి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత కొద్ది రోజులకు సదరు యువతిని తన ఇంటికి పిలిపించిన స్రవంతి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి ఆమెపై తన భర్త ప్రవీణ్‌తో లైంగికదాడికి చేయించి వీడియోలు, ఫోటోలు తీసింది. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించి ఆమె నుంచి నగదు, నగలు, ప్లాట్ పేపర్లు తీసుకుంది. ఇటీవల బాధితురాలికి పెళ్లి కుదరడంతో పెళ్లి చేసుకోవద్దని, ఇంటిని సైతం తమకు స్వాధీనం చేయాలని ఒత్తిడి చేయడమేగాక బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్రవంతిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment