యలమంచిలి : రోజూలాగే సాయంత్రం పాఠశాల నుంచి ఉత్సాహంగా ఇంటికి వచ్చిన ఐదో తరగతి బాలిక కూల్‌డ్రింక్ అనుకుని పొరబాటు పురుగు మందు తాగడంతో మృత్యువాత పడింది. రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు జరిగిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి. దిమిలి గ్రామానికి చెందిన మామిడి శ్రీహరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె మామిడి నాగభవాని (10) స్థానికంప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.
వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో వ్యవసాయ పనుల నిమిత్తం శ్రీహరి, అతని భార్య పొలం పనులకు వెళ్లారు. సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన భవాని సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. ఆకలి తీర్చుకునేందుకు కూల్‌డ్రింక్ అనుకుని పురుగుమందును పొరబాటున తాగింది. కొద్దిసేపటికే బాలిక నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు తండ్రికి సమాచారం అందించారు. ఆమెను హుటాహుటిన స్థానిక 30 పడకల ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆలస్యం కావడంతో బాలిక పరిస్థితి పూర్తిగా విషమించింది.
ఆమెను పరీక్షించిన వైద్యులు, సిబ్బంది లాభంలేదని మెరుగైన చికిత్స కోసం విశాఖకు తీసుకెళ్లాల్సిందిగా చెప్పడంతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను తండ్రి భుజాలపై వేసుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చేసరికి బాలిక మృతి చెందింది. తండ్రి శ్రీహరి కన్నీరుమున్నీరుగా విలపించడం కంట తడిపెట్టించింది. బరువెక్కిన హృదయంతో బాలిక మృతదేహాన్ని తండ్రి ఇంటికి తీసుకెళ్లడంతో బాలిక తల్లి, సోదరి, సోదరుడితో పాటు బంధువులు తీవ్రంగా రోదించారు.
కూల్‌డ్రింక్ అనుకుని..
Published Tue, Aug 18 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM
Advertisement
Advertisement