చెన్నై ,తిరువొత్తియూరు: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి భార్య స్నేహితురాలిపై అత్యాచారం జరిపి తల్లిని చేసిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటకు చెందిన సిలంబరసన్ (22). అతనికి కవరపేట, కిలికోడి గ్రామానికి చెందిన షర్మిల అనే యువతితో మూడేళ్ల కిందట వివాహమైంది. దంపతలకు ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నాడు. వివాహం తరువాత సిలంబరసన్ భార్యతో కలిసి కిలికోడి గ్రామంలో నివాసం ఉంటున్నాడు.
ఈ క్రమంలో భార్య స్నేహితురాలు (24) తరచూ ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్లేవారని తెలిసింది. ఆమెపై కన్నేసిన సిలంబరసన్ భార్య లేని సమయంలో ఇంటికి వచ్చిన ఆమె స్నేహితురాలికి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి ఆమెను బెదిరించి లొంగదీసుకుని పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. దీంతో గర్భం దాల్చిన బాధితురాలు గత 21వ తేదీన పొన్నేరి ఆస్పత్రిలో మగశిశువును ప్రసవించింది. ఈ క్రమంలో తనను బెదిరించి అత్యాచారం జరిపి తల్లిని చేసిన సిలంబరసన్‌పై బాధితురాలు గుమ్మిడిపూండి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ జయకుమార్ నేతృత్వంలో పోలీసులు ఆదివారం సిలంబరసన్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment