
విజయవాడ: కూల్ డ్రింక్ బాటిల్‌లో బల్లి ఆకారం కనిపించడంతో దానికి కొనుగోలు చేసిన వ్యక్తి కలవరపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బందరు రోడ్డులోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కె.పూర్ణేష్‌బాబు మొగల్రాజపురంలోని రిలయన్స్‌మార్ట్‌లో ఇటీవల ఓ కేస్ కూల్‌డ్రింక్ బాటిళ్లను కొనుగోలు చేశారు. శుక్రవారం ఆయన తన ఇంటికి వచ్చిన అతిథులకు కూల్ డ్రింక్ ఇచ్చేందుకు కేస్‌లోంచి ఓ బాటిల్ తీశారు. అందులో బల్లిఆకారంలో ఉన్న పురుగు కనపడింది. డ్రింక్ బాటిల్‌లో బల్లి ఆకారం ఉండటంతో పూర్ణేష్‌బాబు రిలయన్స్ మార్ట్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. రిలయన్స్ సిబ్బంది దాన్ని చూసి అది ఫంగస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆహార తనిఖీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితుడు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment