వంట నూనెలో ఎలుక కలకలం | Deadly rat appears in Cook oil after buying from a mega showroom | Sakshi
Sakshi News home page

వంట నూనెలో ఎలుక కలకలం

Published Wed, Dec 23 2015 4:30 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

వంట నూనెలో ఎలుక కలకలం

వంట నూనెలో ఎలుక కలకలం

రామంతపూర్: ఇప్పటికే కల్తీపాలు, కల్తీ నెయ్యి, కల్తీ మసాలాలు హైదరాబాదీల ప్రాణాలు హరిస్తుంటే తాజాగా.. ఓ పెద్ద షోరూంలో కొన్న నూనెలో ఎలుక రావడంతో మళ్లీ కలకలం రేగింది. నగరంలోని రామంతపూర్‌లో నివాసముంటున్న చక్రవర్తి అనే వ్యక్తి ఆకాశవాణిలో పని చేస్తున్నారు. ఆయన ఈ నెల ఒకటో తారీకున దగ్గరలో ఉన్న ఒక మాల్ నుంచి సరుకులు తెచ్చారు.

అందులో భాగంగా ఓ కంపెనీకి చెందిన వంట నూనె కొనుగోలు చేశారు. ఈ రోజు నూనె ప్యాకెట్ కత్తిరించి చూడగా.. అందులో ఎలుక కనిపించింది. దీంతో ఆయన సిబ్బందిని సంప్రదించగా.. బిల్లు తీసుకురావాలని.. బిల్లు లేకపోతే తనకెలాంటి సంబంధం లేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement