Fake ghee
-
నకిలీ నెయ్యి కేంద్రంపై పోలీసుల దాడి
హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ పరిధిలో ఓ కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముసారంబాగ్‌లో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున రంగంలోకి దిగిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నెయ్యి తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 4500 కిలోల నకిలీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసి.... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
పూతరేకుపై కల్తీ పూత
కల్తీ నెయ్యితో తయారీ తింటే అనారోగ్యం ఖాయం అమలాపురం :నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయి.. కమ్మనైన రుచిని పంచే ఆత్రేయపురం పూతరేకుకు కల్తీ సెగ తగలింది. పూతరేకులకు అద్భుతమైన రుచిని తెచ్చేందుకు స్వచ్ఛమైన నెయ్యి వినియోగించే బదులు కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు స్వార్థంతో చేస్తున్న ఈ పని.. జాతీయ స్థాయిలో ఆత్రేయపురం పూతరేకుకున్న ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు కేంద్రంగా తయారవుతున్న కల్తీనెయ్యి ఇటీవల ఆత్రేయపురం మండలంలో పెద్ద ఎత్తున దొరికిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా సరఫరా అవుతున్నా ఇక్కడే ఇంత పెద్ద ఎత్తున దొరకడానికి కారణం దీనిని స్థానికంగా తయారు చేస్తున్న పూతరేకుల్లో వినియోగించడమే. ఒక్క ఈ మండలంలోనే ఏటా సుమారు రూ.10 కోట్ల విలువైన కల్తీ నెయ్యి అమ్మకాలు సాగుతున్నాయంటే ఇక్కడ వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆవులు, గేదెల కళేబరాల నుంచి సేకరించిన కొవ్వులో కొంత నెయ్యి కలిపి కల్తీ చేస్తున్నారు. ఇది సువాసన వచ్చేందుకు కొన్ని రకాల ఎసెన్స్ వాడుతున్నారు. కల్తీనెయ్యి వల్ల పెద్దపేగు, లివర్ సంబంధ వ్యాధులు వస్తాయి. కల్తీ మోతాదు పెరిగితే ఫుడ్ పాయిజన్ కూడా జరగవచ్చు. బహిరంగ మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ధర కేజీ రూ.500 వరకూ ఉండడంతో కొందరు పూతరేకుల తయారీదారులు ఇలా పక్కదారి పట్టారు. రూ.250కే రావడంతో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు. బ్రాండెడ్ అన్నట్టుగా బిల్డప్ ఆత్రేయపురం మండలం పులిదిండిలోని ఒక వ్యాపారి నిడదవోలు నుంచి పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి దిగుమతి చేసుకుంటున్నాడు. దీనిని స్థానిక వ్యాపారులు కేజీ రూ.110కి కొంటున్నారు. రాజమండ్రిలోని బ్రాండెడ్ కంపెనీ నుంచి తెచ్చినట్టు చెబుతూ వారు పూతరేకుల తయారీదారులను మోసగిస్తున్నారు. కేజీ రూ.250 చొప్పున రోజుకు 15 నుంచి 20 కేజీల వరకూ విక్రయిస్తున్నారు. ఖండాంతర ఖ్యాతికి మచ్చ కల్తీ అని తెలిసి కూడా కొంతమంది పూతరేకుల తయారీదారులు లాభాపేక్షతో దీనిని వినియోగిస్తున్నారు. ఇది ఆత్రేయపురం పూతరేకు ఖ్యాతికి మచ్చ తెచ్చింది. ఆత్రేయపురం నుంచి జిల్లాతోపాటు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలకు, అమెరికాకు కూడా పూతరేకులు ఎగుమతి అవుతూంటాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఇళ్లల్లో ఫంక్షన్లకు ఆత్రేయపురం పూతరేకును అతిథులకు అందించడం సర్వసాధారణమైంది. వీటి తయారీపై మండలంలో సుమారు 300 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవిస్తున్నాయి. ఏటా రూ.25 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. ఇప్పుడు కల్తీ మచ్చవల్ల మొత్తం తయారీదారులపైనే అపనమ్మకం ఏర్పడుతోందని నిజాయితీగా వ్యవహరించే వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూతరేకులతోపాటు పలు స్వీట్ల వినియోగంలో కల్తీ నెయ్యి వినియోగిస్తున్నారు. కొందరే ‘కల్తీ’ని వినియోగిస్తున్నారు నాణ్యమైన ముడిసరుకుతో తయారు చేయడంవల్లే ఆత్రేయపురం పూతరేకులకు అంత గుర్తింపు వచ్చింది. కొంతమంది స్వార్థపరులు కల్తీ నెయ్యి వినియోగించి పూతరేకుకు చెడ్డపేరు తెస్తున్నారు. వారివల్ల పూతరేకుల పరిశ్రమ దెబ్బతినేలా ఉంది. - సఖిలేటి రామకృష్ణంరాజు, పూతరేకుల వ్యాపారం, తాడిపూడి, ఆత్రేయపురం -
కల్తీ నెయ్యి స్వాధీనం: నిర్వాహకుడు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని బాలానగర్‌లో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 300 లీటర్ల కల్తీ నెయ్యిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసి.... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలానగర్‌లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు. -
వంట నూనెలో ఎలుక కలకలం
రామంతపూర్: ఇప్పటికే కల్తీపాలు, కల్తీ నెయ్యి, కల్తీ మసాలాలు హైదరాబాదీల ప్రాణాలు హరిస్తుంటే తాజాగా.. ఓ పెద్ద షోరూంలో కొన్న నూనెలో ఎలుక రావడంతో మళ్లీ కలకలం రేగింది. నగరంలోని రామంతపూర్‌లో నివాసముంటున్న చక్రవర్తి అనే వ్యక్తి ఆకాశవాణిలో పని చేస్తున్నారు. ఆయన ఈ నెల ఒకటో తారీకున దగ్గరలో ఉన్న ఒక మాల్ నుంచి సరుకులు తెచ్చారు. అందులో భాగంగా ఓ కంపెనీకి చెందిన వంట నూనె కొనుగోలు చేశారు. ఈ రోజు నూనె ప్యాకెట్ కత్తిరించి చూడగా.. అందులో ఎలుక కనిపించింది. దీంతో ఆయన సిబ్బందిని సంప్రదించగా.. బిల్లు తీసుకురావాలని.. బిల్లు లేకపోతే తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. -
నకిలీ నెయ్యి గుట్టు రట్టు
వేంసూరు : విజయవాడ చెందిన కొందరు వ్యక్తులు మండలంలోని కుంచపర్తి గ్రామంలో ఓ ఇంట్లో తయారు చేస్తున్న నకిలీ నెయ్యి వ్యాపారం గుట్టు రట్టుయింది. శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందించడంతో రాత్రి 11 గంటల సమయంలో సత్తుపల్లిరూరల్ సీఐ రాజిరెడ్డి, వేంసూరు పోలీస్‌స్టేషన్ సిబ్బంది కలిపి రైడ్ చేయగా నవదుర్గ, శ్రీలక్ష్మీ దుర్గ, మాదుర్గ అనే కంపెనీల పేరుతో తయారు చేస్తున్న నకిలి నెయ్యి ప్యాకెట్లు, డబ్బాలు భారీ మొత్తంలో లభించారుు. వాటిని స్వాధీనం చేసుకొని రూ.7లక్షల విలువ చేసే మిషనరీ, లేబుల్ ఉన్న ఖాళీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు భీమవరపు మాధవరెడ్డి, శీలం ప్రసాదరెడ్డి, పోతురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఆపరేటర్ ఢిల్లీకి చెందిన రాణారాజ్పుత్ నరేష్సింగ్ , ఇంటి యజమాని మద్దిరెడ్డి పుల్లారెడ్డిను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి మాట్లాడుతూ విజయవాడకు చెందిన మాధవరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కొల్లి రత్నాకర్ కుంచపర్తిలోని మద్దిరెడ్డి పుల్లారెడ్డి ఇంటిని అద్దెకు తీసుకొని అందులో గుట్టు చప్పుడు కాకుండా గత నెల రోజుల నుంచి నుంచి నకిలీ నెరుు్య తయారు చేస్తున్నారు. పామాయిల్‌ను తక్కువ వేడితో నెయ్యిలో కలిపి ప్యాకింగ్ చేస్తున్నారు. ఒక ప్రముఖ కంపెనీ పక్కన మరోపేరు (చిన్న అక్షరాలు)తో ఉన్న లేబుల్ ఫ్యాకెట్లలో తయారు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటివి గ్రామాలలో జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.