నకిలీ నెయ్యి గుట్టు రట్టు
వేంసూరు : విజయవాడ చెందిన కొందరు వ్యక్తులు మండలంలోని కుంచపర్తి గ్రామంలో ఓ ఇంట్లో తయారు చేస్తున్న నకిలీ నెయ్యి వ్యాపారం గుట్టు రట్టుయింది. శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందించడంతో రాత్రి 11 గంటల సమయంలో సత్తుపల్లిరూరల్ సీఐ రాజిరెడ్డి, వేంసూరు పోలీస్‌స్టేషన్ సిబ్బంది కలిపి రైడ్ చేయగా నవదుర్గ, శ్రీలక్ష్మీ దుర్గ, మాదుర్గ అనే కంపెనీల పేరుతో తయారు చేస్తున్న నకిలి నెయ్యి ప్యాకెట్లు, డబ్బాలు భారీ మొత్తంలో లభించారుు. వాటిని స్వాధీనం చేసుకొని రూ.7లక్షల విలువ చేసే మిషనరీ, లేబుల్ ఉన్న ఖాళీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు భీమవరపు మాధవరెడ్డి, శీలం ప్రసాదరెడ్డి, పోతురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఆపరేటర్ ఢిల్లీకి చెందిన రాణారాజ్‌పుత్ నరేష్‌సింగ్ , ఇంటి యజమాని మద్దిరెడ్డి పుల్లారెడ్డిను అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సత్తుపల్లి రూరల్ సీఐ రాజిరెడ్డి మాట్లాడుతూ విజయవాడకు చెందిన మాధవరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, కొల్లి రత్నాకర్ కుంచపర్తిలోని మద్దిరెడ్డి పుల్లారెడ్డి ఇంటిని అద్దెకు తీసుకొని అందులో గుట్టు చప్పుడు కాకుండా గత నెల రోజుల నుంచి నుంచి నకిలీ నెరుు్య తయారు చేస్తున్నారు. పామాయిల్‌ను తక్కువ వేడితో నెయ్యిలో కలిపి ప్యాకింగ్ చేస్తున్నారు. ఒక ప్రముఖ కంపెనీ పక్కన మరోపేరు (చిన్న అక్షరాలు)తో ఉన్న లేబుల్ ఫ్యాకెట్లలో తయారు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటివి గ్రామాలలో జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.