జేఎన్‌టీయూలో కలకలం
విచారణకు మంత్రి దామోదర ఆదేశం
సంగారెడ్డి: సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ హాస్టల్ వంట గదిలోని చట్నీ పాత్రలో చిట్టెలుక ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఈ సంఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివి. సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం సుల్తా¯Œన్‌పూర్ జేఎన్‌టీయూ హాస్టల్ మెస్ పనితీరు వారం రోజులుగా బాగా లేదని విద్యార్థులు పలుమార్లు ప్రి¯Œన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి విద్యార్థులు తినే చట్నీలో చిట్టెలుక ప్రత్యక్షమైంది. దాన్ని విద్యార్థులు వీడియో తీసి మంగళవారం సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరంగా మారింది.
విషయం తెలియగానే కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహ మంగళవారం ఉదయం హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. చట్నీలో ఎలుక పడటం వాస్తవమేనని, కానీ విద్యార్థులు తిన్న తర్వాత కడిగేందుకు నీళ్లు పోసి ఉంచిన పాత్రలోనే ఎలుక ఉందని ఆయన స్పష్టం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని హాస్టళ్లు, క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని సంస్థల లైసెన్స్‌లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, హాస్టళ్లు, క్యాంటీన్లలో ఆహార పదార్థాలు తయారు చేసే నిర్వాహకులపై నిఘా ఉంచాలని సూచించారు.
అపరిశుభ్రతపై అడిషనల్ కలెక్టర్ ఆగ్రహం
అడిషనల్ కలెక్టర్ మాధురి హాస్టల్‌ను సందర్శించి అక్కడి అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా శుభ్రం చేయకుండా పాత్రలను అలాగే ఉంచడమేమిటని కాంట్రాక్టర్‌ను నిలదీశారు. బాధ్యులను వెంటనే తొలగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట అందోల్ ఆర్డీవో పాండు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ధర్మేందర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment