రాష్ట్ర చట్టసభల్లో ఎలుకను పట్టేందుకు గత ఏడేళ్లలో ప్రభుత్వం రూ. 24.47 లక్షలు ఖర్చు చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి ఈ సమాధానం లభించింది.
2015 ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు విధానసౌధతో పాటు వికాసౌధలో ఎలుకలతో పాటు క్రిములును తొలగించేందుకు గాను రూ.4,96,333లను చెల్లించేలా ఓ ప్రైవేట్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ లెక్కన గత ఏడేళ్లలో ఎలుకల కోసం రూ.24.47 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. కాగా, ఈ ఏడేళ్లలో 700 ఎలుకలు పట్టుబడ్డాయని ప్రభుత్వం తెలియజేసింది.
- సాక్షి, బెంగళూరు
700 ఎలుకలకు రూ.24.47 లక్షలు!
Published Mon, Sep 14 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM
Advertisement