ఎలుక పెయింటింగ్‌‌కు అన్ని వేలా? | Watch: Rat painting Have Earned Over 1000 Pounds | Sakshi
Sakshi News home page

ఎలుక పెయింటింగ్‌‌కు అన్ని వేలా?

Published Fri, May 22 2020 8:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

లండన్‌ : పెయింటింగ్‌.. సహజంగా వివిధ రంగులతో ఉండి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి కళా రూపాన్ని కొన్ని లక్షలు పోసి కొంటారు. అయితే కళకు మనుషులు, జంతువులు అన్న భేదం లేదని నిరూపించింది ఓ ఎలుక. తన చిట్టి పొట్టి పాదాలతో ఓ కళాఖండాన్ని రూపొందించింది. ఈ చిట్టెలుక గీసిన బొమ్మను వేలు పెట్టి కొంటారని మీకు తెలుసా. అవునండి.. ఎలుక గీసిన చిత్రం ఏకంగా 1000 పౌండ్లు (అక్షరాల 92 వేలు) సంపాందించింది. 

వివరాళ్లోకి వెళితే.. మాంచెస్టర్‌కు చెందిన జెస్‌ అనే మహిళ కొన్ని ఎలుకలను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో గుస్‌ అనే ఎలుకతో ఓ పెయింటింగ్‌ వేసింది. డ్రాయింగ్‌ రూమ్‌లో ఎలుక పాదాలను పెయింట్‌లో ముంచి కొన్ని కాగితాలపై ఉంచారు. అది అటు ఇటు తిరుగుతుంటే పేపర్‌పై ఎలుక అడుగులు కలర్‌ఫుల్‌గా‌ ఏర్ప​డ్డాయి. అలా కొన్ని పేపర్లపై వేసిన ఎలుక పాదాల పేయింటింగ్‌లన్నింటినీ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. అలా పెయింటింగ్‌లు అన్ని అమ్ముడుపోగా జెస్‌ మొత్తం 1000 పౌండ్లను రాబట్టింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'ఎలుక చిత్రాలకు ఇంత మార్కెట్‌ ఉందా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుస్‌ ప్రస్తుతం మినీ ‘హెన్రీ మాటిస్సే’ అయ్యిందని ఆమె అన్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement