మామిడిమొక్క చుట్టూ మూషికం ప్రదక్షిణ | rat circumambulates around a small tree | Sakshi
Sakshi News home page

మామిడిమొక్క చుట్టూ మూషికం ప్రదక్షిణ

Published Sun, Jul 27 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM

మామిడిమొక్క చుట్టూ మూషికం ప్రదక్షిణ

మామిడిమొక్క చుట్టూ మూషికం ప్రదక్షిణ

కోనరావుపేట మండలం బావుసాయిపేటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న మామిడిమొక్క చుట్టూ ఓ మూషికం ప్రదక్షణలు చేస్తోంది.

బావుసాయిపేట(కోనరావుపేట): కోనరావుపేట మండలం బావుసాయిపేటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న మామిడిమొక్క చుట్టూ ఓ మూషికం ప్రదక్షణలు చేస్తోంది. ఇటీవల గ్రామ శివారులో ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఆవరణలో మామిడిమొక్కలు నాటారు. శనివారం ఉదయం 6గంటల ప్రాంతంలో ఓ మూషికం మామిడిమొక్క చుట్టూ తిరుగుతుండటం గీతకార్మికులు చూశారు. గ్రామస్తులకు సమాచారం అందించడంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చిచూశారు. కొందరు ఇది దేవుని మహిమంటూ కొబ్బరికాయలు కొట్టి మొక్కారు. ఇది చూడడానికి వచ్చిన ఓ గ్రామస్తునికి పూనకంతో వచ్చి ఊగిపోయాడు. కొందరు బియ్యం పోసినా వాటిని మూషికం తినడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement