డైట్ చేసి బరువు తగ్గాలి అంటే నోటిని చాలా కంట్రోల్ చేయాలి. నచ్చిన వాటిని తినకుండా చాలా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో డైట్ చేద్దాం అనుకునేవాళ్లు మధ్యలోనే బాబోయ్! నావల్ల కాదంటూ వదిలేస్తారు. దీంతో బరువు తగ్గలేక, నోటిని కంట్రోల్ చేయలేక చాలా మంది నానాపాట్లు పడుతుంటారు. అలాంటి వారికి 'ర్యాట్ బ్రేక్ ఫాస్ట్'(ఎలుక అల్పహారం) చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటీ ఎలుక అల్పహారమా? అని సందేహించకండి. అది అన్నింటిని కాంబేనేటడ్‌గా తింటుంది. దానికి దొరికిన వాటిని కొంచెం కొంచెంగా తినేస్తుంది. అది ఇది అని ఉండదు అన్నింటిని కలగపులగంగా తినేస్తుంది. అలా ఎలుక చిరుతిండిని ఫాలో అయితే అన్నింటిని తిన్న ఫీలింగ్ ఉంటుంది. పైగా బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ బ్రేక్‌ఫాస్ట్ గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటో చూద్దామా!
చాలామందికి చిరుతిండ్లు తినడం అలవాటు. అంతెందుకు భోజనం చేయగానే నోట్లో కాస్త స్వీటు లేదా పండో నోట్లో పడాల్సిందే. కొందరూ అదే పనిగా తింటూనే ఉంటారు. అలాంటి వారికి ఈ ఎలుక అల్పహార విధాన మంచిం ఎంపిక. దీని వల్ల ఎక్కువ తినరు. పైగా అన్నింటిని తిన్నా.. ఫీల్ వస్తుంది. ఏంటీ ర్యాక్ బ్రేక్ ఫాస్ట్ అంటే..వివిధ పదార్థాల కలయిక. అంటే.. కొన్ని రకాల చిరుతిండ్లను కాంబినేటడ్‌గా అల్పహారంలా తింటే ఎక్కువ తిన్న ఫీల్ వస్తుంది. ఇలా ఎలుకలు తినేటప్పుగూ గమినిస్తే తెలుస్తుంది. అది తనకు కావాల్సిన తిండిగింజలను అన్నింటిని తెచ్చుకుంటుంది.
అన్నింటిని మిక్స్‌డ్‌గా తింటుంది. అలా మనం కూడా తీసుకుంటే ఆహారం వృధా అవ్వదూ పైగా అన్ని తినగలుగుతాం. దీన్ని బ్రిటీష్ సూపర్ మార్కెట్ దిగ్గజం వెయిట్రోస్ తన వార్షిక ఆహార పానీయాల నివేదికలో ఈ ట్రెండ్‌ను హైలైట్ చేసింది. ఇది అసాధారణమైన స్నాక్ కాంబినేషన్. ఆకలిని అణుచుకోలేక వెంట వెంటనే పెద్దగా భోజనాన్ని తినేయకుండా కాస్త కడుపుకి తగ్గించి తినే విధానమే ఇది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు, సమస్యలు బేరీజు వేసుకుని సరైన విధంగా ఫాలో అవ్వాలి. అవేంటంటే..
కఠినమైన భోజనం నుంచి విముక్తి: ర్యాట్ బ్రేక్ ఫాస్ట్ పాటించడం వల్ల ఇలాగే తినాలనే మన సాధారణ భోజన షెడ్యూల్ని కాస్త మారుస్తుంది. ఆకలిని బట్టి తినే విధంగా, ప్రాధాన్యతల ఆధారంగా తినడానికి అనుమతిస్తుంది. బిజీ షెడ్యూల్‌లు ఉన్నవారికి ఇది ఆకర్షణీయంగా ఉంటుంది.
తినాలనే క్యూరియాసిటీ : ట్రెండ్‌కు తగినట్టుగా భోజన వేళలను, అలవాట్లను మార్చుకుని చిన్న భోజనాలతో రోజును పూర్తి చేయడం దీని ప్రధాన ఉద్దేశ్యం. అయితే ర్యాట్ బ్రేక్ పాస్ట్ అలవాటు చేసుకుంటే మాత్రం చిన్న చిన్న అల్పాహారాలతోనే కడుపు నింపేసుకుంటాం.
బెటర్‌గా తినడం: మిగిలిపోయిన పదార్థాలను తినడం, కనిపించిన ప్రతి వస్తువునూ కొనేయడం వంటి అలవాట్లను, ఆహార వ్యర్థాలను తినే అవాటును తగ్గిస్తుంది.
ఆహారంపై కంట్రోల్: నియంత్రణ లేని అల్పాహారం అధిక క్యాలరీలను తీసుకోవడానికి దారితీస్తుంది. ఈ విధానం ఒకరకంగా పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకుని తినేలా చేస్తుంది. తత్ఫలితంగా ఆహారంపై నియంత్రణ ఏర్పడుతుంది.
పోషకాహార సమతుల్యత: స్నాక్స్‌పై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం వల్ల సమతుల్య భోజనం నుంచి అవసరమైన పోషకాలను తీసుకోవడం కుదరకపోవచ్చు. అందువల్ల ఈ స్నాక్స్‌లో వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌లు ఉండేలా చూసుకోవడం మంచిది
మూడ్స్‌పై ప్రభావం: ఒకోసారి ఇలా అల్పాహారంలా తింటుంటే మన ఆకలిపై ఒత్తిడి లేదా విసుగుకు దారితీస్తుంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సరైన విధాంగా ఈ విధానాన్ని అమలు చేయాలి.
అయితే ఈ ర్యాక్ బ్రేక్ ఫాస్ట్ అనేది అన్ని వేళలా సౌకర్యవంతమైన విధానం కాకపోవచ్చు గానీ కాస్త ఆహారంపై మనసు పెట్టి తినేలా మాత్రం చేస్తుంది. ఏ విధానమైనా పిచ్చిలా కాకుండా ఇష్టపూర్వకంగా పద్ధతిగా తీసుకుంటే సత్ఫలితాలను పొందగలుగుతాం.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. ఈ పద్ధతి ఫాలో అవ్వాలనుకుంటే మీ ఆరోగ్య స్థితిని అనుసరించి వ్యక్తిగత వైద్యుడిని సలహాల మేరకు అనుసరించడం మంచిది.
(చదవండి: ఆ క్రీడాకారుడు ధరించిన 'షూ'లు వేలంలో రికార్డు స్థాయిలో రూ. 66 కోట్లు..)
Comments
Please login to add a commentAdd a comment