ఇటీవల కాలంలో ఎన్నో డైట్‌లు చేసి ఉంటారు. మంచి ఫలితాలు పొందేందుకు అవన్నీ కాస్త టైం తీసుకుంటాయి. అయితే ఈ డైట్ మాత్రం సత్వర ఫలితాలు ఇవ్వడమే గాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా బరువు తగ్గడమే గాక మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అంటున్నారు. ఇంతకీ ఏంటీ ఓమాడ్ డైట్? చెయొచ్చా అంటే..
ఓమాడ్ అంటే..
'వన్ మీల్ ఏ డే'ని ఓమాడ్ అంటారు. అంటే..ఒక్కపూట భోజనం చేసి మిగతా సమయం అంతా తినడానికి బ్రేక్ ఇవ్వడం అన్నమాట. దీని వల్ల ఈజీగా శరీరంలోని కేలరీలు బర్న్ అవుతాయంటున్నారు. చాలా గంటల సేపు తినడానికి విరామం ఇచ్చేస్తాం కాబట్టి శరీరంలోని కొవ్వులు కరుగుతాయని చెబుతున్నారు. ఇంతలా గ్యాప్ ఇవ్వడం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుందంటున్నారు.
ఇక్కడ ఈ డైట్‌లో వ్యక్తి రోజువారీగా ఒక్కసాగే నిండుగా భోంచేస్తాడు. ఆ ఆహరం ఒకటి నుంచి రెండు గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి దాదాపు 20 నుంచి 23 గంటలు విరామం ఇస్తారు. మొదట్లో మాత్రం వ్యక్తులకు కేవలం 16 గంటలే విరామం ఇవ్వగా రానురాను ఎక్కువ గంటలు పెంచడం జరుగుతుంది. దీన్ని అడపదడపా ఉపవాసం అనికూడా పిలుస్తారు. ఈ డైట్ ఆర్యో శ్రేయస్సును పెంచి ఎటువంటి అనారోగ్య సమస్యల బారినపడకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రయోజనాలు..
- ఈ డైట్ వల్ల ఈజీగా బరువు తగ్గుతారు, పైగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలింది.
- జీవక్రియ మెరుగుపడుతుంది.
- మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది
- సెల్యూరలార్ ప్రక్రియలను సక్రియం చేస్తుంది.
- జీర్ణవ్యవస్థకు సుదీర్ఘ విరామం కారణంగా ప్రేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- అలాగే ఉబ్బరం, అజీర్ణం, వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు
ఎదురయ్యే సమస్యలు..
- ఇక్కడే ఒకేసారి ఆహారం స్వీకరిస్తాం కాబట్టి..అన్ని క్యాలరీలు ఉండే ఆహారానని తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాలతో కూడిన ఆహార తీసుకోవడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే సుదీర్ఘ విరామాన్ని తట్టుకునేలా మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
- కొంతమంది దీనీని సరిగా తీసుకోలేకపోవచ్చు. లేదా ఒకేసారి ఇలా తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కొనవచ్చు.
- వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది.
- దీనికి తగ్గట్టు జీవనశైలి ఉండాలి అప్పుడే ఈ డైట్ మంచి ఫలితాలనిస్తుంది.
గమనిక: ఇది ఆరోగ్యంపై అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. అనుసరించే ముందు మీ వ్యక్తిగత నిపుణుడు లేదా వైద్యులను సలహాలు, సూచనలతో పాటించటం ఉత్తమం.
(చదవండి: చెరుకురసం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? కానీ వీళ్లు మాత్రం..)
Comments
Please login to add a commentAdd a comment