Deepika Padukone: డైట్‌ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు | Never followed a diet syas Deepika Padukone | Sakshi
Sakshi News home page

Deepika Padukone: డైట్‌ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు

Published Thu, Jul 18 2024 2:05 AM | Last Updated on Thu, Jul 18 2024 5:50 AM

 Never followed a diet syas Deepika Padukone

‘‘డైట్‌’ అనే పదం చుట్టూ చాలా అ΄ోహలు ఉన్నాయని నాకనిపిస్తోంది. డైట్‌ అంటే కడుపు మాడ్చుకోవడం, తక్కువ తినడం, కష్టంగా నచ్చనవి తినడం అని మనందరం అనుకుంటాం. కానీ డైట్‌ అంటే మనం తీసుకునే ఆహారం, తీసుకునే ΄ానీయాలు. నిజానికి డైట్‌ అనే పదం గ్రీకు పదం ‘డైటా’ నుంచి వచ్చింది. డైటా అంటే జీవన విధానం అని అర్థం’’ అన్నారు దీపికా పదుకోన్‌. ప్రస్తుతం ఆమె గర్భవతి అని తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికా ఫలానా డైట్‌ని ఫాలో అవుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.

 అయితే ప్రచారంలో ఉన్నవి నమ్మవద్దంటూ దీపికా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘నేను బాగా తింటాను. కాబట్టి సరిగ్గా తిననని వస్తున్న వార్తలను నమ్మొద్దు. డైట్‌ అంటే క్రమం తప్పకుండా తినడం, మన శరీరాన్ని అర్థం చేసుకోవడం.. ఫాడ్‌ డైట్‌ (త్వరగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక)ని ఫాలో కాను. శుభ్రంగా తినడానికే ఇష్టపడతాను. నా డైట్‌లో ఇవి ఉన్నాయని ఆశ్చర్య΄ోతున్నారా?’’ అంటూ కేక్స్, సమోసా వంటి వాటి ఫొటోలను కూడా షేర్‌ చేశారు దీపికా పదుకోన్‌. ఇక సెప్టెంబరులో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఆ మధ్య దీపికా, ఆమె భర్త–హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement